అన్వేషించండి

Gold Price: 10 గ్రాముల పసిడి రూ.100 కన్నా తక్కువే - కొనాలంటే టైమ్‌ మెషీన్‌ ఎక్కాలి

Gold Price History: భారతదేశంలో, బంగారంపై పెట్టుబడి పెట్టడం ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. కాలంతో పాటు బంగారం ధరలు కూడా పెరుగుతూ ఆకాశాన్ని అంటుతున్నాయి.

Gold Price History: బంగారం అనేది భారతీయులకు ఒక పాజిటివ్‌ సెంటిమెంట్‌. యుగాలుగా, మన దేశ సంస్కృతి & సంప్రదాయాల్లో పసిడి ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఎలాంటి వేడుకలోనైనా పుత్తడిని శుభప్రదమైన వస్తువుగా భావిస్తారు. అంతేకాదు, ఇది నమ్మదగిన పెట్టుబడిగానూ మారింది, దాని ప్రాముఖ్యత క్రమంగా పెరిగింది. ప్రపంచంలోని మొత్తం బంగారంలో భారతదేశంలోనే 11% పైగా ఉందని సర్వేలు చెబుతున్నాయి. 

ఎల్లో మెటల్‌ డిమాండ్‌ ఎప్పటికప్పుడు పెరుగుతుండేసరికి, ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం, భారతదేశ మల్టీ కమొడిటీ ఎక్సేంజ్‌లో (MCX) 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి (24 కేరెట్లు) రేటు దాదాపు రూ. 72,000కు చేరుకుంది. ప్రభుత్వం విధించే పన్నులు కూడా దీనికి కలిపితే స్పాట్‌ గోల్డ్‌ రేటు వస్తుంది. అయితే, ఒకప్పుడు. మన దేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ. 100 కన్నా తక్కువగా ఉండేదని మీకు తెలుసా?.

బ్యాంక్‌బజార్‌ డేటా ప్రకారం, 1964లో భారతదేశంలో 10 గ్రాముల బంగారం (24 కేరెట్లు) ధర రూ. 63.25. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోల్చి చూస్తే, బంగారం ధరలో పెను మార్పు కనిపిస్తుంది. 1964 నుంచి ఇప్పటి వరకు, స్వర్ణం విలువ దాదాపు 1130 రెట్లు పెరిగింది. 

భారత్‌లో బంగారం ధరల చరిత్ర (Gold price history since 1964)

1964 ------ రూ. 63.25
1965 ------ రూ. 71.75
1970 ------ రూ. 184
1975 ------ రూ. 540
1980 ------ రూ. 1330
1985 ------ రూ. 2,130       
1990 ------ రూ. 3200     
1995 ------ రూ. 4,680     
2000 ------ రూ. 4,400      
2005 ------ రూ. 7,000    
2010 ------ రూ. 18,500      
2015 ------ రూ. 26,343   
2020 ------ రూ. 48,651   
2021 ------ రూ. 48,720    
2022 ------ రూ. 52,670     
2023 ------ రూ. 63,820  
2024 (ఇప్పటి వరకు) ------ రూ. 71,743

బంగారం ధరలు ప్రతి రోజూ మారుతుంటాయి. ఒక్కోసారి కొన్ని వందల రూపాయలు తగ్గుతాయి, మరోమారు పెరుగుతుంటాయి. కానీ.. ఓవరాల్‌గా చూస్తే మాత్రం పెరిగే ధోరణినినే (upward trend) కొనసాగిస్తున్నాయి. గత 10 సంవత్సరాల్లోనే పసిడి రేట్లు రెట్టింపు పైగా పెరిగాయి. 2023లో, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, US వడ్డీ రేట్లలో మార్పులు, ద్రవ్యోల్బణం కారణంగా, కేవలం 10 నెలల్లోనే గోల్డ్‌ రేటు 10% పెరిగింది. ధరల్లో స్థిరమైన పెరుగుదల కారణంగా, దీర్ఘకాల పెట్టుబడి ఎంపికగా బంగారం ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా ఆర్థిక అనిశ్చితి సమయంలో బంగారం ఒక సురక్షిత పెట్టుబడి మార్గంగా (safe haven) నిలుస్తోంది.

బంగారం ధరలను ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి?
మన దేశంలోనే కాదు, గ్లోబల్‌ మార్కెట్‌లోనూ ఎల్లో మెటల్‌ రేట్లు నిరంతరం మారుతుంటాయి. గ్లోబల్ డిమాండ్, ప్రపంచ మార్కెట్ పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, వివిధ ప్రభుత్వాల విధానాలు, ఆర్థికపరమైన మార్పులు వంటివి ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి, భారతదేశంలోని బంగారం ధరలకు కూడా ఈ కారణాలే వర్తిస్తాయి. దీంతోపాటు... ధంతేరస్, అక్షయ తృతీయ వంటి పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో డిమాండ్ పెరిగి పసిడి రేట్లు పెరుగుతాయి.

మరో ఆసక్తికర కథనం: సుందర్‌ పిచాయ్‌ మామూలోడు కాదు - గూగుల్‌ను ఓ ఆట ఆడించాడు 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP DesamAmitshah vs Rahul Gandhi Ambedkar Controversy | పార్లమెంటును కుదిపేసిన 'అంబేడ్కర్ కు అవమానం' | ABPఆటోలో అసెంబ్లీకి, కేటీఆర్ సహా బీఆఎర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనరేవంత్ ఎక్కడికెళ్లినా సెక్యూరిటీని పెట్టుకో, లేకుంటే కొడతారు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం -  కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
నాగబాబు కోసం పవన్ కల్యాణ్ త్యాగం - కేబినెట్ మార్పుచేర్పుల్లో సంచలన విషయం ఇదే !
One Nation One Election JPC: జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
జమిలీపై జేపీసీకి చైర్మన్‌గా పీపీ చౌదరి - 21 మంది సభ్యుల నియామకం - రాజ్యసభ ప్రతినిధులు పెండింగ్
Weather Update Today: అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
అల్పపీడనంతో ఏపీలో అక్కడ వర్షాలు, ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ - తెలంగాణలో చలి పంజా
Look Back 2024: అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
అన్నకు ఎదురెళ్ళిన బాణం.. షర్మిల 2024లో ప్లస్సు అదే.. మైనస్ అదే
Constable Physical Events: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు విడుదల - షెడ్యూలు ఇదే
This Week OTT Movies: ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
ఈ వారం ఓటీటీల్లోకి ఎన్ని సినిమాలు, సిరీస్‌లు వస్తున్నాయో తెలుసా... సినీ ప్రియులకు పండగే
WhatsApp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ త్వరలో - ఇకపై ఫోన్ కాలింగ్ తరహాలో!
Maruti Suzuki Ertiga: బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
బెస్ట్ మైలేజీ ఇచ్చే సెవెన్ సీటర్ కారు ఇదే - ఫ్యామిలీకి పర్‌ఫెక్ట్ ఛాయిస్!
Embed widget