Gold Rate Today 3rd June 2022: పసిడి ప్రియులకు షాక్ - మళ్లీపెరిగిన బంగారం ధర, నిలకడగా వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ
Gold Rate Today 3rd June 2022: హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
Gold Price Today 3rd June 2022: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ పెరిగాయి. బంగారం ధరలకు భిన్నంగా వెండి ధర మాత్రం నిలకడగా మార్కెట్ అవుతోంది. రూ.110 మేర పెరగడంతో తాజాగా హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ.47,600 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. మరోవైపు వెండి ధర నిన్నటి ధర వద్ద నిలకడగా ఉంది. హైదరాబాద్‌లో 1 కేజీ వెండి ధర రూ.67,600 అయింది.
ఏపీలో పెరిగిన బంగారం ధర.. (Gold Rate Today In AP)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు పెరగడంతో విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 3rd June 2022) 10 గ్రాముల ధర రూ.51,930 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 కు ఎగబాకింది. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి
విశాఖపట్నం, తిరుపతిలో రూ.100 మేర పెరగడంతో నేడు 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,930 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,600 అయింది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో నేడు 1 కేజీ వెండి ధర రూ.67,000 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,930 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.47,600 కి పుంజుకుంది.
చెన్నైలో బంగారంపై రూ.390 పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,750 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 తో దేశంలోనే రికార్డ్ ధరలో విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,600 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.51,930గా ఉంది.
పసిడి, వెండి ధరలపై పలు అంశాలు ప్రభావం..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు సైతం బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.