By: ABP Desam | Updated at : 20 Apr 2022 07:03 AM (IST)
బంగారం, వెండి ధరలు
Gold Price Today In Hyderabad : బంగారం ధరలు మార్చి 9వ తేదీన జీవితకాల గరిష్టానికి చేరగా... నేడు ఆ ధరల్ని సైతం మించిపోయి రికార్డ్ రేట్లు నమోదు చేసింది బంగారం. గత నెలలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,330 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,800 అయింది. తాజాగా చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,870 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,290 అయింది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర (Gold Rates Today In Hyderabad) రూ.54,380కు చేరగా, 22 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.49,850 అయింది. వెండి మాత్రం రూ.75 వేల మార్క్ నుంచి దిగొచ్చింది. తాజాగా రూ.300 మేర తగ్గడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74,900 కు పతనమైంది.
ఏపీలో బంగారం ధర.. (Gold Rate In Andhra Pradesh)
ఏపీ మార్కెట్లోనూ బంగారం ధరలు జీవితకాల గరిష్టానికి చేరుకున్నాయి. నేడు విజయవాడలో 24 క్యారెట్ల బంగారం (Gold Rate in Vijayawada 20th April 2022) 10 గ్రాముల ధర రూ.54,380 అయింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,850 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. విజయవాడలో స్వచ్ఛమైన వెండి 1 కేజీ ధర రూ.74,900 కు దిగొచ్చింది.
విశాఖపట్నం, తిరుపతిలో బంగారం ధర నిలకడగా ఉంది, కానీ లైఫ్ టైమ్ రికార్డ్ రేట్లలో విక్రయాలు జరుగుతున్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,380 కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.49,850 కు పతనమైంది.
ఇక విశాఖపట్నం, తిరుపతి మార్కెట్లో రూ.300 మేర తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.74,900 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధర..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 కాగా, 24 క్యారెట్ల బంగారం రూ.54,380 కి పెరిగింది.
చెన్నైలో రూ.190 మేర ధర పెరగడంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,290 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,870 కి చేరింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,850 కాగా, 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.54,380 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ప్లాటినం ధర
హైదరాబాద్‌లో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,690కి ఎగబాకింది.
ఢిల్లీలో 32 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల ధర రూ.25,010 కి చేరింది.
చెన్నైలో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,690 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
ముంబైలో రూ.44 పెరగడంతో 10 గ్రాముల ప్లాటినం ధర రూ.24,690 అయింది.
పసిడి, వెండి ధరలపై ప్రభావం చూపే విషయాలు..
పసిడి, వెండి ధరల్లో రోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపైన ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఒక రకమైన కారణం. అయితే, ఇలా ప్రపంచ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.
Cryptocurrency Prices: మళ్లీ నష్టాల బాటలో బిట్‌కాయిన్ - ఎంత తగ్గిందంటే?
NSE Co-location Scam: ఎన్ఎస్ఈ స్కామ్‌లో కీలక పరిణామం - ట్రేడర్లు, బ్రోకర్ల ఇళ్లలో సీబీఐ సోదాలు
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Maruti Suzuki New Facility: కొత్త ప్లాంట్ పెడుతున్న మారుతి సుజుకి - రూ.20 వేల కోట్ల పెట్టుబడి, 13 వేల ఉద్యోగాలు - ఎక్కడో తెలుసా?
Russia Ukraine War : ఉక్రెయిన్‌పై గెలిచాం - ప్రకటించేసుకున్న రష్యా !
Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
Monkeypox: శృంగారంతో మంకీపాక్స్ వ్యాప్తి? వేగంగా వ్యాపిస్తున్న వైరస్, ఎక్కువ ప్రమాదం వీరికే!
Complaint On Avanti Srinivas : "ఒరేయ్ పంతులూ .." అన్నారు - మాజీ మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు !