అన్వేషించండి

Gas Cylinder: గ్యాస్‌​ సిలిండర్‌పై ABCDలు ఎందుకుంటాయి! ప్రమాదాల నుంచి ఇవి ఎలా తప్పిస్తాయి!

Gas Cylinder expiry Date : అర్ధం కాని భాషలో ఎక్స్‌పైరీ డేట్‌ను రాసిన గ్యాస్‌ కంపెనీలను తప్పుబట్టాలి తప్ప, ప్రజలను కాదు.

Check Gas Cylinder Expiry Date: వంట గ్యాస్‌ లేనిదే ఆకలి తీరదు, ఒక్క రోజు కూడా గడవదు. గ్యాస్‌ సిలిండర్‌ రేటెంతో మనలో చాలా మందికి తెలుసు. కానీ, దానికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటుందని మాత్రం ఎక్కువ మందికి తెలీదు. గ్యాస్‌ కంపెనీలు దీని గురించి అవగాహన కల్పించడం లేదు.

చాలా వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. గడువు తీరిన వస్తువులను ఉపయోగిస్తే ఆరోగ్యానికి ప్రమాదం.​గడువు తీరిన గ్యాస్‌ సిలిండర్‌ అంతకంటే డేంజర్‌. ఎక్స్‌పైర్‌ అయిన గ్యాస్‌ సిలిండర్‌తో ప్రాణాలకే ప్రమాదం. మొత్తం కుటుంబానికే అది ప్రాణసంకటం.

నిజానికి, గ్యాస్‌ సిలిండర్‌ మీద పెద్ద అక్షరాలతో ఎక్స్‌పైరీ డేట్‌ రాసి ఉంటుంది. కానీ, అదొక కోడ్‌ లాంగ్వేజ్‌లా కనిపిస్తుంది తప్ప, తేదీ రూపంలో ఉండదు. కాబట్టే, అది ఎక్స్‌పైరీ డేట్‌ అన్న విషయం చాలామంది చదువుకున్న వారికి కూడా అర్ధం కాదు. ఇక గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏం తెలుస్తుంది?. ఈ విషయంలో.. అర్ధం కాని భాషలో ఎక్స్‌పైరీ డేట్‌ను రాసిన గ్యాస్‌ కంపెనీలను తప్పుబట్టాలి తప్ప, ప్రజలను కాదు. 

గ్యాస్‌ సిలిండర్‌ను ఇంటింటికి అందించే లోకల్‌ ఏజెన్సీలు, వాటి సిబ్బంది కూడా గ్యాస్‌ సిలిండర్‌ ఎక్స్‌పైరీ డేట్‌ గురించి ప్రజలకు చెప్పడం లేదు.

గ్యాస్‌ సిలిండర్‌ ఎక్స్‌పైరీ డేట్ ఎలా చెక్‌ చేయాలి? (How to check gas cylinder expiry date?)

గ్యాస్​సిలిండర్‌ను పట్టుకునే భాగం (హ్యండిల్‌) లోపలి వైపున ఒక పదం కనిపిస్తుంది. ఆ పదంలో A, B, C, D ల్లో ఏదో ఒక అక్షరంతో పాటు రెండంకెల సంఖ్య కనిపిస్తుంది. అదే ఎక్స్‌పైరీ డేట్‌. దానిని డీకోడ్​చేస్తే గానీ ఆ సిలిండర్​ఎక్స్‌పైరీ డేట్‌ ఏంటో తెలీదు. డీకోడ్‌ చేయడమంటే, ఆ పనిని కంప్యూటర్‌ ఎక్స్‌పర్ట్‌ చేయాల్సిన అవసరం లేదు, సామాన్యులు కూడా చాలా సులభంగా అర్ధం చేసుకోవచ్చు. 

గ్యాస్‌ సిలిండర్‌పై కనిపించే A, B, C, D లకు అర్ధం ఇది:

A అంటే జనవరి నుంచి మార్చ్​వరకు ఉన్న కాలం
B అంటే ఏప్రిల్​నుంచి జూన్ వరకు  ఉన్న కాలం
C అంటే జులై నుంచి సెప్టెంబర్​వరకు ఉన్న కాలం
D అంటే అక్టోబర్​ నుంచి డిసెంబర్​వరకు ఉన్న కాలం

A లేదా B లేదా C లేదా D పక్కన కనిపించే రెండంకెల సంఖ్య సంవత్సరానికి గుర్తు. ఆ సంఖ్య 21 అని రాసి ఉంటే 2021 సంవత్సరంగా, 25 అని రాసి ఉంటే 2025 సంవత్సరంగా, 28 అని రాసి ఉంటే 2028 సంవత్సరంగా భావించాలి.

ఇంకా సింపుల్‌గా అర్ధం చేసుకుందాం. గ్యాస్‌ సిలిండర్‌ మీద "B 28" అని రాసి ఉంటే... ఆ గ్యాస్​సిలిండర్​2028 ఏప్రిల్ -​జూన్  మధ్యకాలంలో ఎక్స్‌పైర్‌ అవుతుందని అర్ధం. ఒకవేళ, "D 21" అని రాసి ఉంటే... ఆ సిలిండర్‌ 2021 అక్టోబర్ -డిసెంబర్‌లో ఎక్స్‌పైర్‌ అవుతుందని అర్ధం. అంటే, ఆల్రెడీ దాని గడువు ముగిసింది.​

ఎక్స్‌పైర్‌ అయిన గ్యాస్‌ సిలిండర్‌ వాడితే ఏమవుతుంది? (What happens if an expired gas cylinder is used?)

మీరు గ్యాస్‌ బుక్‌ చేసిన తర్వాత, "D 23" అని రాసి ఉన్న సిలిండర్‌ డెలివెరీ అయితే, ఆ సిలిండర్‌ గడువు 2023 డిసెంబర్‌తోనే తీరిపోయిందని అర్ధం చేసుకోవాలి, ఇక ఆ సిలిండర్‌ను వినియోగించకూడదు. సిలిండర్‌ గడువు తీరడమంటే అందులోని గ్యాస్‌ పనికిరాకుండా పోవడం కాదు. ఆ సిలిండర్‌ మాత్రమే పనికి రాదని అర్ధం. సిలిండర్‌లో నింపిన గ్యాస్‌ చాలా ఒత్తిడితో ఉంటుంది. గడువు తీరిన సిలిండర్‌ అంత ఒత్తిడిని భరించలేదు, ఒక్కసారిగా పేలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, మీ ఇంటికి గ్యాస్‌ సిలిండర్‌ రాగానే ఎక్స్‌పైరీ డేట్‌ చెక్‌ చేసుకోవడం మరిచిపోవద్దు.

సాధారణంగా, గడువు తీరిన సిలిండర్‌ను గ్యాస్‌ కంపెనీలు సరఫరా చేయవు. ఒకవేళ పొరపాటున మీ ఇంటికే అది వస్తే, వెంటనే దానిని తిరస్కరించండి. గడువు ఉన్న సిలిండర్‌ ఇవ్వమని అడగండి. వెంటనే మార్చి ఇస్తారు. నిర్లక్ష్యం చేస్తే మాత్రం మొత్తం మీ కుటుంబం ప్రాణాలకే ప్రమాదం. వంటింట్లో బాంబ్‌ పెట్టుకుని వంట చేస్తున్నట్లేనని మర్చిపోవద్దు.

మరొక విషయం, చాలా మందికి ఒకే సిలిండర్‌ ఉంటుంది, గ్యాస్‌ కనెక్షన్‌ ఉండదు. కాబట్టి, వాళ్లు ఆ సిలిండర్‌ను రీఫిల్‌ చేయించుకుంటూ చాలా​సంవత్సరాలుగా వాడుతుంటారు. సిలిండర్‌ ఎక్స్‌పైరీ డేట్‌ చూసుకోకుండా ఇదే పనిని కొనసాగిస్తే, ఆ ఫ్యామిలీ పూర్తిగా డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లే.

మరో ఆసక్తికర కథనం: తక్కువ ఖర్చుతో ఇన్సూరెన్స్‌ పాలసీ - 'బీమా సుగమ్‌'తో సాధ్యం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Tirupati Pilgrim Stampede CPR | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTirupati Pilgrim Stampede | తిరుపతి తొక్కిసలాటలో ఆరుగురు భక్తుల మృతి | ABP DesamTTD Chairman BR Naidu on Stampede | తొక్కిసలాట ఘటనపై టీటీడీ ఛైర్మన్ దిగ్భ్రాంతి | ABP DesamTirupati Pilgrims Stampede 6died | వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల పంపిణీలో విషాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR News: రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
రేవంత్ రాసిచ్చిన ప్రశ్నల్నే అడిగారు- రేసు కేసు విచారణపై కేటీఆర్‌ కామెంట్స్- నాయకుల ఘన స్వాగతం
YS Jagan Comments On Tirumala Stampede: తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్
తిరుమల రావాలంటే భయపడే స్థితి తీసుకొచ్చారు- మొదటి ముద్దాయి చంద్రబాబే- జగన్ సీరియస్‌ కామెంట్స్ 
Tirupati Stampede : ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
ప్రాణాలు పోతున్నాయి వేంకటేశా.. పాపం ఎవరిది తిరుమలేశా..!
Infosys Tiger: ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
ఆఫీసుకు ఎట్టి పరిస్థితుల్లో రావొద్దని ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మెయిల్ - వస్తే చస్తారని వార్నింగ్ - ఎం జరిగిందంటే ?
Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
తిరుపతి తొక్కిసలాట ఘటన - మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Tamil 8: చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
చివరి దశకు వచ్చేసిన తమిళ బిగ్‌బాస్ - ఫైనల్ రేసులో ఎంత మంది ఉన్నారు? ప్రైజ్ మనీ ఎంత?
Mudragada: చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి
చంద్రబాబు గారండీ.. మా జగన్ వస్తే ఊరుకోడండీ..- ఇట్లు  పాత మిత్రుడు ముద్రగడ పద్మనాభరెడ్డి
Divorce Proceedings in India : డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
డివోర్స్ ఎన్ని రకాలో తెలుసా? విడాకుల డ్యాకుమెంటేషన్, లీగల్ ప్రాసెస్​ ఇదే.. భరణాన్ని ఎలా డిసైడ్ చేస్తారంటే
Embed widget