Independence Day Sale 2025: Flipkartలో ఐదు రోజులపాటు భారీ డిస్కౌంట్ సేల్, ఆగస్టు 13న ప్రారంభం
Flipkart Independence Day Sale 2025 | డిస్కౌంట్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఫ్లిప్‌కార్ట్ శుభవార్త చెప్పింది. ఆగస్టు 13 నుండి 17 వరకు ఈ-కామర్స్ సంస్థ ఇండిపెండెన్స్ డే సేల్ ప్రకటించింది.

Flipkart Independence Day Sale 2025: దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ 2025ని ప్రకటించింది. ఈ డిస్కౌంట్ సేల్ ఆగస్టు 13న ప్రారంభం కానుంది. ఆగస్టు 17వ తేదీతో ఇండిపెండెన్స్ డే సేల్ ముగుస్తుందని సంస్థ తెలిపింది. ఐదు రోజుల మెగా షాపింగ్ ఈవెంట్ లో ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ఫ్యాషన్, హోమ్ అప్లయన్సెస్, ఇతర కేటగిరీలపై భారీ డిస్కౌంట్‌లు లభిస్తాయి. ముఖ్యంగా, కంపెనీ బ్యాంక్ ద్వారా ఆఫర్‌లు.. ఎక్స్ఛేంజ్ బోనస్‌లను సైతం కస్టమర్లకు అందిస్తోంది. ఇది కొనుగోలుదారుల నగదు మరింత పొదుపు చేయడానికి వీలు కల్పిస్తుంది. Flipkart Freedom Sale 2025 ఆగస్టు 15 సమయంలో వస్తున్నందున దీన్ని ఇండిపెండెన్స్ డే సేల్ అని పిలుస్తారు. ఇటీవల ముగిసిన సేల్ గడువు పొడిగింపు అని చెబుతున్నారు.
ఈ సేల్ ప్రత్యేకత ఏమిటి?
ఫ్లిప్‌కార్ట్ ఇండిపెండెన్స్ డే సేల్ 2025ని ఏడాదిలోనే అతిపెద్ద మిడ్-ఇయర్ సేల్‌లలో ఒకటిగా చెప్పవచ్చు. ఇందులో టీవీలు, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, ఫ్యాషన్, గృహోపకరణాలు, కిచెన్ అప్లయన్స్‌లపై భారీ డిస్కౌంట్ లభిస్తాయి. Vivo, Asus, Samsung, Motorola, HP, TCL వంటి బ్రాండ్‌ల ప్రొడక్ట్స్ తక్కువ ధరలకు లభిస్తాయి. వీటితో పాటు వినియోగదారులు ఫర్నిచర్, దుస్తులు, సన్‌గ్లాసెస్, నగలు, ఇతర లైఫ్‌స్టైల్ ఉత్పత్తులను ఆఫర్ ధరలకు కొనగోలు చేయవచ్చు.
ఈ సేల్‌లో డిస్కౌంట్ కోసం
బ్యాంక్ ఆఫర్: కెనరా బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో చేసే చెల్లింపులపై 10 శాతం ఇన్‌స్టంట్ తగ్గింపు లభిస్తుంది.
క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్: వీటిని ఆయా బ్యాంక్ ఆఫర్‌లతో కలిపి అడిషనల్‌గా సేవ్ చేయవచ్చు.
బండిల్ డీల్స్: Flipkart Plus Super Coins ఉపయోగించి మీరు కొన్న ప్రొడక్ట్స్‌పై 10% వరకు అడిషనల్ డిస్కౌంట్ పొందవచ్చు.
వారికి ప్రి యాక్సెస్: Flipkart Plusతో పాటు VIP మెంబర్స్‌కు డీల్స్ ముందుగానే లభిస్తాయి. ఈ సేల్ ఆగస్టు 13, 2025 నుంచి ఆగస్టు 17, 2025 వరకు 5 రోజులపాటు ఉంటుంది. మీకు అవసరం ఉన్న వస్తువులు, ఉత్పత్తులను ఈ మెగా డిస్కౌంట్ సేల్‌లో తక్కువ ధరలకే సొంతం చేసుకోండి.
ఏ ఆఫర్‌లపై ఫోకస్ చేయాలి..
ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్: సాంప్రదాయ, ఇతర ఫ్యాషన్ దుస్తులపై ధరలపై డిస్కౌంట్స్
ఎలక్ట్రానిక్స్: Samsung, Vivo, Asus, Motorola, HP, TCL లపై ప్రత్యేక తగ్గింపు.
యాక్సెసరీస్: గడియారాలు (Smart Watches), సన్‌గ్లాసెస్, ఆభరణాలపై ఆకర్షణీయమైన డీల్స్.
హోమ్ అండ్ కిచెన్: ఫర్నిచర్, కిచెన్ ఎసెన్షియల్స్ మరియు డెకర్ ఐటమ్స్‌పై ఆఫర్‌లు.






















