అన్వేషించండి

Ex-Dividend: ఈ వారం డబ్బు సంపాదించే స్టాక్స్‌ - లిస్ట్‌లో 3 అదానీ కంపెనీలు

డివిడెండ్‌ మొత్తం షేర్‌హోల్డర్ల బ్యాంక్‌ అకౌంట్స్‌లో క్రెడిట్ అవుతుంది.

Ex-Dividend Stocks For This Week: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఈ వారం సంతోషాన్ని పంచే ఛాన్స్‌ ఉంది. ఈ ట్రేడింగ్‌ వీక్‌లో, చాలా పెద్ద కంపెనీల షేర్లు ఎక్స్-డివిడెండ్‌గా మారుతున్నాయి. వీటిలో, అదానీ గ్రూప్‌లోని 3 కంపెనీల షేర్లు కూడా ఉన్నాయి.

ఒక్కో  షేరుకు రూ. 50 డివిడెండ్
ఈ వారంలో ఎక్స్-డివిడెండ్‌ ట్రేడ్‌ చేసే స్టాక్స్ లిస్ట్‌లో అతి పెద్ద పేరు అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ది (Adani Enterprises). ఇది కాకుండా.. అదానీ గ్రూప్‌ సిమెంట్‌ కంపెనీలు ACC & అంబుజా సిమెంట్ (Ambuja Cement) కూడా ఎక్స్-డివిడెండ్ కానున్నాయి. ఎంఫసిస్ ‍‌(MPhasis) పెట్టుబడిదార్లు ఒక్కో షేరుకు రూ. 50 డివిడెండ్ పొందబోతున్నారు.

ఆయా కంపెనీలు గతంలో ప్రకటించిన డివిడెండ్‌ మొత్తం, ఎక్స్‌-డివిడెండ్‌ రోజున షేర్‌ ప్రైస్‌ నుంచి ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఆ తర్వాత, కంపెనీ గతంలోనే ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం, ఆ డివిడెండ్‌ మొత్తం షేర్‌హోల్డర్ల బ్యాంక్‌ అకౌంట్స్‌లో క్రెడిట్ అవుతుంది. మంచి డివిడెండ్‌ ప్రకటించే కంపెనీల నుంచి, మార్కెట్‌ ఒడిదొడుకులతో సంబంధం లేకుండా డబ్బు సంపాదించవచ్చు. అందుకే, డివిడెండ్‌ స్టాక్స్‌కు మార్కెట్‌లో ఎప్పుడూ డిమాండ్‌ ఉంటుంది.

ఈ వారం ఎక్స్‌-డివిడెండ్‌ స్టాక్స్‌

జులై 3 (సోమవారం)
ఇవాళ, ఎక్స్‌టెల్ ఇండస్ట్రీస్, బాలాజీ అమైన్స్, జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జ్యోతి ల్యాబ్ షేర్లు ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్‌ అవుతున్నాయి.

జులై 4 (మంగళవారం)
మంగళవారం ఎక్స్-డివిడెండ్‌గా మారుతున్న స్టాక్స్‌లో మోతీలాల్ ఓస్వాల్, పంజాబ్ & సింద్ బ్యాంక్ వంటి బిగ్‌ షాట్స్‌ ఉన్నాయి. వీటితో పాటు.. ఆల్కైల్ అమైన్స్ కెమికల్స్, ఆగ్రో టెక్ ఫుడ్స్, టైడ్ వాటర్ ఆయిల్ కూడా మంగళవారం ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్‌ చేస్తాయి.

జులై 5 (బుధవారం)
ఈ వారంలో మూడో రోజున, Mphasis షేర్లు ఎక్స్-డివిడెండ్‌గా మారతాయి. ఈ కంపెనీ బోర్డు ఒక్కో షేరుకు రూ. 50 భారీ డివిడెండ్ ప్రకటించింది. దీపక్ స్పిన్నర్స్, సుందరం ఫైనాన్స్ షేర్లు కూడా జులై 5న ఎక్స్-డివిడెండ్‌ ట్రేడ్‌ చేస్తాయి.

జులై 6 (గురువారం)
వారంలో నాలుగో రోజున నాలుగు కౌంటర్లలో ఎక్స్-డివిడెండ్‌ ట్రేడ్‌ జరుగుతుంది. గురువారం ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్‌ చేసే షేర్లలో ఎలిగెంట్ మార్బుల్స్ అండ్ గ్రెయినీ ఇండస్ట్రీస్, IDBI బ్యాంక్, కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్, యశో ఇండస్ట్రీస్ ఉన్నాయి.

జులై 7 (శుక్రవారం)
ఈ వారంలో చివరి వర్కింగ్‌ డే నాడు ఎక్స్-డివిడెండ్‌లో ట్రేడ్‌ చేసే కంపెనీల్లో చాలా పెద్ద పేర్లు కనిపిస్తున్నాయి. లిస్ట్‌లో అన్నింటి కంటే అతి పెద్ద పేరు అదానీ గ్రూప్ ఫ్లాగ్‌షిప్‌ కంపెనీ అయిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ది. దీంతో పాటు... కేర్ రేటింగ్స్, ACC, అంబుజా సిమెంట్, L&T టెక్నాలజీ సర్వీసెస్ షేర్లు అదే రోజు ఎక్స్-డివిడెండ్‌ అవుతాయి.

మరో ఆసక్తికర కథనం: కనిష్ట స్థాయిలో పసిడి - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

#UITheMovie Warner  Decode | Upendra సినిమా తీస్తే మరి అంత సింపుల్ గా ఉండదుగా.! | ABP DesamUnstoppable With NBK Season 4 Ep 6 Promo |  Sreeleela తో నవీన్ పోలిశెట్టి ఫుల్ కామెడీ | ABP Desamజగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Metro Rail In Vizag and Vijayawada: విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
విశాఖ, విజయవాడ ప్రజలకు శుభవార్త, మెట్రోరైల్ ప్రాజెక్టు డీపీఆర్‌లకు ఏపీ ప్రభుత్వం ఆమోదం
Tiruvannamalai Landslide: ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం, తిరువణ్ణామలైలో విషాదం
Sundar Pichai: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌కి ముంబై కోర్టు నోటీసులు, అసలేం జరిగింది!
Andhra Pradesh News: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Most Expensive Android Smartphones: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆండ్రాయిడ్ ఫోన్లు - టాప్ మోడల్ రేటెంతో తెలుసా?
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Embed widget