Dant Kanti: పతంజలిదంత్ కాంతి గండుష అయిల్ ఆవిష్కరణ - ప్రాచీన ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రాల సమ్మేళనం
Gandusha Oil: ఆయిల్ పుల్లింగ్ కోసం గండూష ఆయిల్ ను పతంజలి విడుదల చేసింది. దీన్ని ప్రాచీన ఆయుర్వేదం, ఆధునిక శాస్త్రాల సమ్మేళంతో సిద్ధం చేశారు.

Dant Kanti Gandusha Oil: పతంజలి దంత్ కాంతి గండుష ఆయిల్ పుల్లింగ్‌ను ప్రవేశపెట్టింది. ఇది శాస్త్రీయ ఆయుర్వేద గ్రంథాలలో ప్రస్తావించబడిన గండుష పద్ధతి ఆధారంగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. పతంజలి ఆయుర్వేదంలో పాతుకుపోయిన దంత్ కాంతి బ్రాండ్ తో గండుష ఆయిల్ పుల్లింగ్‌ను పతంజలి ప్రారంభించింది. బాబా రామ్‌దేవ్ దీనిని సంప్రదాయం ,శాస్త్రంగా సమ్మేళనంగా అభివర్ణించారు. ఆచార్య బాలకృష్ణ దీనిని దంత సమస్యలకు సహజ పరిష్కారమని తేల్చారు .
పురాతన ఆయుర్వేద పద్ధతిని పునరుద్ధరించడం!
పతంజలి శాస్త్రీయ ఆయుర్వేద గ్రంథాలలో పేర్కొన్న గంధుష పద్ధతి ఆధారంగా దంత్ కాంతి గండుష ఆయిల్ పుల్లింగ్‌ను ప్రవేశపెట్టారు. ఆయుర్వేదంలో ఆయిల్ పుల్లింగ్ ను రోజువారీ దినచర్యగా భావిస్తారు. ఈ ప్రయోగం కేవలం ఒక ఉత్పత్తిని ఆవిష్కరించడం గురించి మాత్రమే కాదు, ఆయుర్వేదం యొక్క కోల్పోయిన రోజువారీ సంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి ఒక చారిత్రాత్మక ప్రయత్నాన్ని సూచిస్తుందని పతంజలి పేర్కొంది.
"పతంజలి చొరవ యోగా, ఆయుర్వేద రంగంలో ఒక కొత్త మైలురాయి. పతంజలి కేవలం చికిత్సలను అందించడమే కాదు, సంస్కృతి, సంప్రదాయం , విజ్ఞాన శాస్త్ర సంగమాన్ని ప్రపంచానికి అందిస్తోంది."నేడు ప్రజలు తమ సొంత శరీరాలతో ఎలా పనిచేయాలి , సహకరించాలో మర్చిపోయారని గండూష అయిల్ ను ఆవిష్కరించిన కార్యక్రమంలో బాబా రాందేవ్ అన్నారు. యోగా , ఆయుర్వేదం ద్వారా, పతంజలి దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేస్తోంది. భారతదేశ ప్రాచీన సనాతన జ్ఞానం వేల సంవత్సరాల క్రితం ఎలా ఉందో నేటికీ అంతే సందర్భోచితంగా ఉందని దంత ఉత్పత్తి పునరుద్ఘాటిస్తుందని రాందేవ్ అన్నారు.
దంత సమస్యలతో బాధపడుతున్న వారికి పరిష్కారం: బాలకృష్ణ
"ఈ ఉత్పత్తి మా పతంజలి పరిశోధనా సంస్థలోని శాస్త్రవేత్తల మూడు సంవత్సరాల అవిశ్రాంత కృషి , అంకితభావం ఫలితం. దంత్ కాంతి గండుష ఆయిల్ పుల్లింగ్ కేవలం రోజువారీ అభ్యాసం కాదు, ఇది ఆధునిక అవసరాలను తీర్చే వైద్య శాస్త్రం." చరక సంహిత , సుశ్రుత సంహిత వంటి ప్రధాన ఆయుర్వేద గ్రంథాలు గండుషను ఒక ముఖ్యమైన నోటి ఆరోగ్య ప్రక్రియగా వర్ణించాయని ఆయన వివరించారు. దంత సమస్యలు విస్తృతంగా ఉన్న నేటి ప్రపంచంలో, దంత కాంతి గండుష ఆయిల్ పుల్లింగ్ సహజమైన, సురక్షితమైన , ప్రభావవంతమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఇది దంత కాంతి శ్రేణిలో తాజా మరియు అత్యంత వినూత్నమైన ఉత్పత్తి.." అని ఆచార్య బాలకృష్ణ తెలిపారు.
గండూష వల్ల దంతాలు , చిగుళ్ళను బలోపేతం అవుతాయి. తుంబురు నూనె, పంటి నొప్పి నుండి ఉపశమనం కలిగించే లవంగం ఇందులో ఉన్నాయి. దుర్వాసనను తొలగించే పుదీనా నూనె, బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించే యాంటీ బాక్టీరియల్ లక్షణాలతో కూడిన యూకలిప్టస్ నూనె, యాంటీ మైక్రోబయల్‌గా ఉండటం వలన దంతాలు క్షయం , ఇన్ఫెక్షన్ల నుండి రక్షించే తులసి నూనె, ఆయుర్వేద స్వర్ణ వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి సహాయపడే పూర్తి శ్రేణి ఆధారాల ఆధారిత దంత ఉత్పత్తులను త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఆచార్య బాలకృష్ణ ప్రకటిచారు.
పయోరియా , ఇతర దంత వ్యాధుల చికిత్సలో శక్తివంతమైన సహాయం
యోగా మరియు ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో బాబా రామ్‌దేవ్ , ఆచార్య బాల్కృష్ణ అద్భుతమైన కృషి చేశారని
ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఉత్తరాఖండ్ శాఖ కార్యదర్శి డాక్టర్ విశ్వజిత్ వాలియా అన్నారు. "దంత్ కాంతి గండుషా ఆయిల్ పుల్లింగ్ అనేది పరిశోధన, ఫలితాల ఆధారిత ఆయుర్వేద ఔషధం, ఇది పయోరియా , వివిధ దంత రుగ్మతలకు చికిత్స చేయడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది" అని ఆ తెలిపారు. పతంజలి రీసెర్చ్ ఫౌండేషన్ చేపడుతున్న పరిశోధనా కార్యక్రమాలను కూడా ఆయన ప్రశంసించారు.





















