News
News
వీడియోలు ఆటలు
X

Cryptocurrency Prices: క్రిప్టో కరెన్సీ ఏ వైపు? బిట్‌కాయిన్‌కు వరుస నష్టాలు

Cryptocurrency Prices Today, 27 March 2023: క్రిప్టో మార్కెటు సోమవారం ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 27 March 2023:

క్రిప్టో మార్కెటు సోమవారం ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 0.17 శాతం పెరిగి రూ.22.97 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.44.37 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.15 శాతం తగ్గి రూ.1,44,937 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.17.43 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.42 శాతం తగ్గి రూ.82.55, బైనాన్స్‌ కాయిన్‌ 0.04 శాతం పెరిగి రూ.27,004, రిపుల్‌ 1.48 శాతం పెరిగి రూ.38.70, యూఎస్‌డీ కాయిన్‌ 0.32 శాతం తగ్గి రూ.82.44, కర్డానో 2.65 శాతం తగ్గి రూ.28.91, డోజీ కాయిన్ 0.07 శాతం తగ్గి 6.05 వద్ద కొనసాగుతున్నాయి. సీయూఎస్‌డీటీ, ర్యాడికల్‌, ఫ్లెక్స్‌ కాయిన్‌, జోయి, కస్పా, సేఫ్‌ మూన్‌, ఇన్‌స్యూర్‌ డెఫి లాభపడ్డాయి. ఈకాయిన్‌, జిట్‌కాయిన్‌, బ్లాక్స్‌, టామీ నెట్‌, నుసైఫర్‌, బేసిన్‌ అటెన్షన్‌, నెర్వస్‌ నెట్‌వర్క్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 27 Mar 2023 02:44 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

సంబంధిత కథనాలు

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: తెలంగాణలో రాష్ట్రావతరణ వేడుక ఉత్సాహం- ఏపీలో పోస్టర్‌ వివాదం- మార్నింగ్ ఏబీపీ దేశం టాప్‌ న్యూస్

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price Today 01 June 2023: పుంజుకుంటున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి

Cryptocurrency Prices: క్రిప్టో బిగ్‌ కాయిన్స్‌ క్రాష్‌ - బిట్‌కాయిన్‌ రూ.80వేలు లాస్‌!

Cryptocurrency Prices: క్రిప్టో బిగ్‌ కాయిన్స్‌ క్రాష్‌ - బిట్‌కాయిన్‌ రూ.80వేలు లాస్‌!

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Stock Market News: రెడ్‌ జోన్లో సూచీలు - 18,500 నిఫ్టీ క్లోజింగ్‌!

Health Insurance: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్‌ కూడా వస్తాయ్‌

Health Insurance: ప్రీమియం తగ్గించుకునే సులువైన దారుంది, రివార్డ్స్‌ కూడా వస్తాయ్‌

టాప్ స్టోరీస్

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Kishan Reddy : కేంద్రం తరపున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు - ఇతర రాష్ట్రాల్లోనూ చేస్తున్నామన్న కిషన్ రెడ్డి !

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

ఆసుపత్రిలో చేరిన ఎంఎస్‌ ధోనీ- మోకాలి గాయానికి చికిత్స

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు

Konaseema: హిజ్రా హత్య కేసులో ముగ్గురి అరెస్ట్, మిస్టరీ కేసు ఛేదించిన కోనసీమ పోలీసులు