అన్వేషించండి

Cryptocurrency Prices: తగ్గని క్రిప్టో దూకుడు - 24 గంటల్లో రూ.30వేలు పెరిగిన బిట్‌కాయిన్‌

Cryptocurrency Prices Today, 17 January 2023: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.87 శాతం పెరిగి రూ.17.30 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.33.34 లక్షల కోట్లుగా ఉంది.

Cryptocurrency Prices Today, 17 January 2023:

క్రిప్టో మార్కెట్లు మంగళవారం భారీ లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.87 శాతం పెరిగి రూ.17.30 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.33.34 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.55 శాతం పెరిగి రూ.127,942 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.15.41 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.35 శాతం పెరిగి రూ.81.83, బైనాన్స్‌ కాయిన్‌ 0.99 శాతం పెరిగి రూ.23,634, రిపుల్‌ 0.41 శాతం పెరిగి రూ.31.60, యూఎస్‌డీ కాయిన్‌ 0.32 శాతం పెరిగి రూ.81.82, బైనాన్స్‌ యూఎస్డీ 0.30 శాతం పెరిగి 81.81, డోజీ కాయిన్ 0.06 శాతం పెరిగి 6.90 వద్ద కొనసాగుతున్నాయి. మెడిబ్లాక్‌, ఏఎంపీ, ఫెచ్‌ ఏఐ, ఎస్‌ఎస్‌వీ నెట్‌వర్క్‌, గాలా, మ్యాజిక్‌, కేవ కాయిన్లుల లాభపడ్డాయి. ఈ కాయిన్‌, ఆర్టిఫీషియల్‌ లిక్విడ్‌, సెలో, జీఎంఎక్స్‌, ఎవ్‌మోస్‌, టెర్రా క్లాసిక్‌ యూఎస్డీ, ఎనర్జీ వెబ్‌ నష్టపోయాయి.

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
75th Constitution Day Celebrations: జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వస్తే నవంబర్‌ 26న వేడుకలు జరుపుకోవడం ఏంటీ?
AP Farm Fund Scheme: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అకౌంట్లలోకి రూ.75 వేలు, పథకానికి దరఖాస్తు చేసుకోండిలా!
Telangana Schools: తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
తెలంగాణలో ఈ స్కూల్స్ తర్వాతే మరేవైనా- సీఫోర్ సర్వేలో 'టాప్-5' పాఠశాలలు ఇవే
Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
సొమ్ము కేంద్రానిది, సోకు రాష్ట్ర ప్రభుత్వానిది - ఆ స్కీంలకు మోదీ ఫోటో పెట్టాలని బండి సంజయ్ డిమాండ్
IPL Auction 2025: ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
ఐపీఎల్ వేలంలో తెలుగు క్రికెటర్ల హవా, ముగ్గురికి ఛాన్స్ ఇచ్చిన ఫ్రాంచైజీలు
Asifabad News: ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ హౌస్ అరెస్ట్, విద్యార్థిని మృతితో పోలీసులు అలర్ట్
Embed widget