News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో కరెన్సీ - రూ.15వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

Cryptocurrency Prices Today, 05 June 2023: క్రిప్టో మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు.

FOLLOW US: 
Share:

Cryptocurrency Prices Today, 05 June 2023:

క్రిప్టో మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.41 శాతం తగ్గి రూ.22.11 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.42.90 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్‌ తర్వాత అతిపెద్ద మార్కెట్‌ విలువ కలిగిన ఎథీరియమ్‌ (Ethereum) గత 24 గంటల్లో 1.73 శాతం తగ్గి రూ.1,54,305 వద్ద ట్రేడ్‌ అవుతోంది. మార్కెట్‌ విలువ రూ.18.60 లక్షల కోట్లుగా ఉంది.

టెథెర్‌ 0.25 శాతం పెరిగి రూ.82.62, బైనాన్స్‌ కాయిన్‌ 1.93 శాతం తగ్గి రూ.24,839, రిపుల్‌ 1.51 శాతం పెరిగి రూ.44.01, యూఎస్‌డీ కాయిన్‌ 0.28 శాతం పెరిగి రూ.82.61, కర్డానో 1.72 శాతంపెరిగి రూ.30.88, డోజీ కాయిన్ 1.50 శాతం తగ్గి రూ.5.93 వద్ద కొనసాగుతున్నాయి. కాయిన్‌ మెట్రో, ఎనర్జీ వెబ్‌, లీనియర్‌, కోర్‌, ఇంజెక్టివ్‌, బ్లాక్స్‌, ఓషన్‌ ప్రొటొకాల్‌ లాభపడ్డాయి. ఆకాశ్‌ నెట్‌వర్క్‌, ఎక్స్‌డీసీ నెట్‌వర్క్‌, బీటీఎస్‌ఈ టోకెన్‌, ఐఓటా, ది గ్రాఫ్‌, బేబీ డోజీ కాయిన్‌, అలెఫ్ జీరో నష్టపోయాయి. 

హెచ్చుతగ్గులు ఉంటాయి

క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్‌, ఎథిరెమ్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్‌ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్‌ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్‌, ఎథెర్‌, డోజీకాయిన్‌, లైట్‌కాయిన్‌, రిపిల్‌ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.

క్రిప్టో కరెన్సీ అంటే?

క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్‌ అసెట్‌. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్‌ డేటాబేస్‌ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్‌ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.

భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి

భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌, యాప్స్‌ చాలా అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో నియంత్రణ!

క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్‌ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్‌, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు నవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 05 Jun 2023 05:47 PM (IST) Tags: Bitcoin Cryptocurrency Prices Ethereum Litecoin Ripple Dogecoin cryptocurrency

ఇవి కూడా చూడండి

Gold-Silver Price 28 September 2023: పసిడిలో భారీ పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Gold-Silver Price 28 September 2023: పసిడిలో భారీ పతనం - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Stock Market Today: 19,700 మీదే నిఫ్టీ ముగింపు - 173 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్‌

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Renovation Loan: మీ పాత ఇంటిని కొత్తగా మార్చేయండి - రెనోవేషన్‌ లోన్‌ రేట్లు, టాక్స్‌ బెనిఫిట్స్‌ ఇవిగో!

Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Cryptocurrency Prices: రెండు వేలు తగ్గిన బిట్‌కాయిన్‌! మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టోలు

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

Sugar Stocks: పెట్టుబడిని పరుగులు పెట్టించిన షుగర్‌ స్టాక్స్‌, ఇదంతా ఇథనాల్‌ ఎఫెక్టా?

టాప్ స్టోరీస్

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

Crocodile: హైదరాబాద్ లో నాలాలో కొట్టుకువచ్చిన మొసలి, స్థానికుల భయాందోళన

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

ఏపీ సెక్రటేరియట్ లో 50 మంది పదోన్నతులు వెనక్కి, ప్రభుత్వం ఉత్తర్వులు

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత

TS TET: తెలంగాణ 'టెట్' పేప‌ర్-1లో 36.89 శాతం, పేప‌ర్‌-2లో 15.30 శాతం ఉత్తీర్ణత