By: ABP Desam | Updated at : 04 Jan 2022 04:01 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Cryptocurrency
Cryptocurrency Prices Today, 04 January 2022: క్రిప్టో మార్కెట్లు మంగళవారం స్తబ్దుగా ఉన్నాయి. మదుపర్లు కొనుగోళ్లు చేపట్టేందుకు వెనకడుగు వేస్తున్నారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 1.03 శాతం తగ్గి రూ.37.13 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.65.51 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 0.85 శాతం తగ్గి రూ.3,02,001 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.33.39 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 2.74 శాతం పెరిగి రూ.40,998, టెథెర్ 0.04 శాతం పెరిగి రూ.80.33, సొలానా 2.90 శాతం తగ్గి రూ.13,465, కర్డానో 2.35 శాతం తగ్గి రూ.107, యూఎస్‌డీ కాయిన్ 0.07 శాతం పెరిగి 80.38 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాండ్ ప్రొటొ, ఐక్సెసీ, టెజోస్, సింథెటిక్స్, ఇంటర్నెట్ కో, కర్వ్ డావో, చైన్‌లింక్ 6 నుంచి 12 శాతం వరకు పెరిగాయి. సుషి, ఆవె, స్వైప్, టెర్రా, అవలాంచె, గాలా, ది గ్రాఫ్ 4 నుంచి 9 శాతం వరకు నష్టాల్లో ఉన్నాయి.
Also Read: Fake Pan Card Check: పాన్ కార్డుపై డౌటా? అసలు, నకిలీ ఇలా గుర్తించండి
Also Read: Tata Altroz: అల్ట్రోజ్‌లో కొత్త బడ్జెట్ వేరియంట్.. లాంచ్ త్వరలోనే!
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Budget 2022: రైతన్నకు శుభవార్త! 4% వడ్డీకి రూ.18 లక్షల కోట్లు పంట రుణాలు ఇవ్వనున్న కేంద్రం!
Also Read: Budget 2022: ప్రభుత్వ బడ్జెట్ ఇన్ని రకాలా? ఇండియాలో ఏది అమలు చేస్తారో తెలుసా?
Gold-Silver Price Today 11 June 2023: దిగొస్తున్న పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు ఇవి
Petrol-Diesel Price 10 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
IT Documents: పన్ను ఆదా చేయాలంటే ఈ పత్రాలు తప్పనిసరి, త్వరగా సేకరించండి
SBI vs LIC: ఎస్‌బీఐ యాన్యుటీ ప్లాన్ Vs ఎల్‌ఐసీ యాన్యుటీ ప్లాన్, ఏది బెస్ట్?
Forex: పుంజుకున్న విదేశీ వాణిజ్యం, రెండు వారాల తర్వాత ఫారెక్స్ కళ
KTR About Dharani: భూమి సమస్యలను పరిష్కరించే బ్రహ్మాస్త్రం ధరణి - కేటీఆర్ నోట కేసీఆర్ మాట
TSPSC: నేడే 'గ్రూప్-1' ప్రిలిమినరీ పరీక్ష, 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత! అభ్యర్థులకు ముఖ్య సూచనలు!
Weather Latest Update: నేడు రాయలసీమకు వర్ష సూచన, రుతుపవనాల గమనం ఎలా ఉందంటే
Visakha Temperature: విశాఖలో భానుడి ప్రతాపం- 100 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు, ఎంతంటే!