By: ABP Desam | Updated at : 12 Jan 2022 02:52 PM (IST)
క్రిప్టో కరెన్సీ
Cryptocurrency Prices Today, 12 January 2022: క్రిప్టో మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. మార్కెట్ విలువ ఎక్కువగా ఉన్న కాయిన్లలో పెట్టుబడులు కాస్త పెరిగాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 1.50 శాతం పెరిగి రూ.34.19 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.59.92 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 4.03 శాతం పెరిగి రూ.2,59,767 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.28.37 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 2.88 శాతం పెరిగి రూ.37,188, టెథెర్ 0.08 శాతం పెరిగి రూ.80.34, సొలానా 2.48 శాతం పెరిగి రూ.11,286, కర్డానో 6.36 శాతం పెరిగి రూ.98.39 యూఎస్‌డీ కాయిన్ 0.06 శాతం తగ్గి 80.32 వద్ద కొనసాగుతున్నాయి. ఒమిస్ గో, లైవ్‌పీర్, స్వైప్, ఎయిర్‌స్వాప్, వేవ్స్, గాలా, ది సాండ్ బాక్స్ 8 నుంచి 15 శాతం వరకు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డ్యాష్, ఇంటర్నెట్ కో, చైన్ లింక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
Also Read: CCD New CEO Malavika Hegde: భర్త విధికి తలవంచితే.. ఆమె ఎదిరించి నిలబడింది.. ఓ మంచి కాఫీ లాంటి కథ!
Also Read: Multibagger stock: పెన్నీ స్టాక్.. 2 ఏళ్లు.. లక్ష పెట్టుబడి.. రూ.50 లక్షలు ప్రాఫిట్!
Also Read: PNB Service Charges: కస్టమర్లకు పీఎన్‌బీ షాక్! సర్వీస్ ఛార్జెస్ పెంచేసిన పంజాబ్ బ్యాంక్
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
త్వరలో నియంత్రణ!
క్రిప్టో కరెన్సీని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని తెలిసింది. వాస్తవంగా శీతకాలం సమావేశాల్లోనే నియంత్రణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే మరింత మంది నిపుణులు, స్టేక్ హోల్డర్లు, అనుభవజ్ఞుల సలహాలను తీసుకోవాలని నిర్ణయించింది. క్రిప్టోలను పూర్తిగా నిషేధిస్తారని మొదట్లో వార్తలు వచ్చినా.. క్రిప్టో అసెట్, నియంత్రణ బిల్లును తీసుకొస్తున్నారని తెలిసింది.
Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!
Cryptocurrency Prices: మిక్స్‌డ్ జోన్లో క్రిప్టో కరెన్సీ - రూ.15వేలు తగ్గిన బిట్‌కాయిన్!
Aakash IPO: బైజూస్ ఆకాశ్ ఐపీవో తేదీ మార్పు! వచ్చే ఏడాదికి మార్చిన బోర్డు!
Stock Market News: బుల్‌రన్ కంటిన్యూ! 18,600 వద్ద క్లోజైన నిఫ్టీ!
Banking Services Unavailable: హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్! జూన్‌లో కొన్ని రోజులు ఈ సేవలు బంద్!
Apple Vision Pro: ప్రపంచాన్ని కళ్ల ముందుకు తెస్తున్న యాపిల్ - విజన్ ప్రో హెడ్‌సెట్ లాంచ్ - రేటు ఎంతంటే?
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
యాపిల్ విజన్ ప్రో హెడ్ సెట్ ఎలా ఉంది? - ఎలా పని చేస్తుంది? - ఈ ఫొటోలు చూస్తే ఫుల్ క్లారిటీ!
iOS 17 Features: ఐవోఎస్ 17లో మూడు సూపర్ ఫీచర్లు - లాంచ్ చేసిన యాపిల్!