By: ABP Desam | Updated at : 06 Dec 2021 03:29 PM (IST)
Edited By: Ramakrishna Paladi
Cryptocurrency
Cryptocurrency Prices Today, 6 December 2021: క్రిప్టో కరెన్సీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 2.15 శాతం తగ్గి రూ.39.76 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.68 లక్షల కోట్లకు తగ్గింది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 4.56 శాతం తగ్గి రూ.3,31,273 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.36 లక్షల కోట్లకు చేరుకుంది.
బైనాన్స్ కాయిన్ 2.96 శాతం తగ్గి రూ.46,221, టెథెర్ 0.02 శాతం పెరిగి రూ.83.15, సొలానా 8.84 శాతం తగ్గి రూ.15,033, కర్డానో 5.48 శాతం తగ్గి రూ.108, యూఎస్‌డీ కాయిన్ 0.12 శాతం పెరిగి రూ.83.00 వద్ద కొనసాగుతున్నాయి. బేసిక్ అటెన్షన్, అల్గొరాండ్, వేవ్స్, యూఎస్‌డీ కాయిన్, ట్రూ యూఎస్‌డీ, పాక్స్ డాలర్,టెథర్ లాభాల్లో ఉన్నాయి. రిపబ్లిక్, ఫెచ్, టెర్రా, ఎయిర్‌స్వాప్, క్వాంట్‌స్టాంప్, పవర్ లెడ్జ్, క్వార్క్ చైన్ నష్టాల్లో ఉన్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Multi bagger stock: రూ.లక్ష పెట్టుబడికి రూ.21 లక్షల లాభం ఇచ్చిన షేరు!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Gold-Silver Price: మరోసారి పెరిగిన బంగారం ధర.. వెండి నిలకడగా.. నేటి తాజా ధరలివీ..
Also Read: LIC Policy: రోజుకు 73 పెట్టుబడితో మెచ్యూరిటీకి రూ.10 లక్షలు పొందొచ్చు!
Also Read: WhatsApp : 2 కోట్ల మంది అకౌంట్ పీకేసిన వాట్సాప్ ! ఎందుకు..? ఏమిటి? ఎలా ?
Mukesh Ambani: మరోమారు తాతయిన ముకేష్ అంబానీ, వారసురాలికి జన్మనిచ్చిన ఆకాశ్-శ్లోక
New Rules: జూన్ నుంచి కొత్త మార్పులు, ఈ వివరాలు తెలీకపోతే మీ జేబు గుల్ల!
Gas Cylinder Price: బ్లూ సిలిండర్ ధర భారీగా తగ్గింపు, రెడ్ సిలిండర్ రేటు యథాతథం
Elon Musk: నేనే నం.1, ప్రపంచ కుబేరుడి కిరీటం మళ్లీ నాదే!
Latest Gold-Silver Price Today 01 June 2023: దిగొచ్చిన పసిడి - బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !