Cryptocurrency Prices Today: రూ.లక్ష కోట్లు పెరిగిన బిట్‌కాయిన్ విలువ.. స్తబ్దుగా క్రిప్టో మార్కెట్
కీలక క్రిప్టోలన్నీ ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.49 శాతం పెరిగి రూ.37.80 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.68 లక్షల కోట్లుగా ఉంది.
Cryptocurrency Prices Today, 19 December 2021: క్రిప్టో మార్కెట్లలో ఆదివారమూ పెద్దగా జోష్ లేదు. కీలక క్రిప్టోలన్నీ ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గత 24 గంటల్లో బిట్‌కాయిన్ 0.49 శాతం పెరిగి రూ.37.80 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్ విలువ రూ.68 లక్షల కోట్లుగా ఉంది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరియమ్ 0.28 శాతం తగ్గి రూ.3,15,460 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.35 లక్షల కోట్లుగా ఉంది.
బైనాన్స్ కాయిన్ 0.77 శాతం పెరిగి రూ.43,153, టెథెర్ 0.00 శాతంగా ఉండి రూ.80.52, సొలానా 3.04 శాతం పెరిగి రూ.14,816, కర్డానో 0.96 శాతం పెరిగి రూ.103, యూఎస్‌డీ కాయిన్ 0.08 శాతం తగ్గి రూ.80.61 వద్ద కొనసాగుతున్నాయి. టెరా, కాస్మోస్, స్వైప్, కర్వ్ డావో, లైట్‌కాయిన్ 1 నుంచి 13 శాతం వరకు లాభపడ్డాయి. లించ్, డీఎఫ్‌ఐ మనీ, సుషీ, ఆవె, డియా 3 నుంచి 6 శాతం వరకు నష్టపోయాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Salary Structure Change: శాశత్వంగా WFH చేస్తున్నారా..! అయితే HRA కట్.. పెరగనున్న పన్ను భారం!
Also Read: Global Spam Report 2021: ఇండియాలో పాపులర్ స్కామ్ ఏంటో తెలుసా? అకౌంట్లో మీ డబ్బు జాగ్రత్త!!