Cryptocurrency Prices Today: లక్షల్లో పడిపోతున్న బిట్‌కాయిన్ మార్కెట్ విలువ.. నేటి ధరలు ఇవే!
మదుపర్లు తమ వాటాలను ఉపసంహరించేందుకే ఎక్కువగా మొగ్గు చూపడంతో బిట్‌కాయిన్ విలువ మరింత తగ్గింది. 24 గంటల వ్యవధిలో 0.19 శాతం మాత్రమే పెరిగి రూ.44,68,418 వద్ద కొనసాగుతోంది. మిగతా క్రిప్టోల పరిస్థితీ అదే
క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో బుధవారం కొనుగోళ్లు మందగించాయి! మదుపర్లు తమ వాటాలను ఉపసంహరించేందుకే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దాంతో బిట్‌కాయిన్ విలువ మరింత తగ్గించింది. 24 గంటల వ్యవధిలో 0.19 శాతం మాత్రమే పెరిగి రూ.44,68,418 వద్ద కొనసాగుతోంది. దీని మార్కెట్ విలువ రూ.80,59,242 కోట్లకు తగ్గింది. బిట్‌కాయిన్ తర్వాత అతిపెద్ద మార్కెట్ విలువ కలిగిన ఎథిరెమ్ ఏకంగా 5.59 శాతం పెరిగి రూ.3,69,725 వద్ద ట్రేడ్ అవుతోంది. మార్కెట్ విలువ రూ.40,67,435కు చేరుకుంది.
బైనాన్స్ కాయిన్ 4.16 శాతం పెరిగి రూ.50,545, టెథెర్ 0.01 శాతం పెరిగి రూ.78.61, సొలానా 9.82 శాతం పెరిగి రూ.17,480, కర్డానో 0.84 శాతం పెరిగి రూ.125, రిపుల్ 1.95 శాతం పెరిగి రూ.78.73 వద్ద కొనసాగుతున్నాయి. ఇక స్టార్జ్, ఓమిస్‌గో, కాస్మోస్, అల్‌రాండ్, పవర్ లెడ్జ్, ఎయిర్‌స్వాప్, కాంపౌండ్ కాయిన్స్ రెండు శాతానికి పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
హెచ్చుతగ్గులు ఉంటాయి
క్రిప్టో కరెన్సీల ధరలు తెలుసుకోవడం ఇప్పుడు సులభమే. ఎక్కువ మంది వీటిపై పెట్టుబడులు పెడుతున్నారు. బిట్‌కాయిన్స్, ఎథిరెమ్, లైట్‌కాయిన్, రిపిల్, డోజీకాయిన్‌ను భారత్‌లో ఎక్కువగా ట్రేడ్ చేస్తున్నారు. ప్రతి రోజు వీటి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. మార్కెట్ వొలటైల్‌గా ఉంటుంది. ఎక్కువగా వినిపించే బిట్‌కాయిన్, ఎథెర్, డోజీకాయిన్, లైట్‌కాయిన్, రిపిల్ ధరలు నిమిషాల్లోనే మారుతుంటాయి.
క్రిప్టో కరెన్సీ అంటే?
క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ అసెట్. ఇప్పుడున్న కరెన్సీ లాగే చాలా దేశాల్లో వీటిని లావాదేవీలకు అనుమతి ఇస్తున్నారు. కంప్యూటరైజ్‌డ్ డేటాబేస్ లెడ్జర్లలో ఈ కాయిన్లపై ఓనర్‌షిప్‌ను భద్రపరుస్తారు. బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ ద్వారా వీటిని తయారు చేస్తారు. ఈ క్రిప్టో కరెన్సీ భౌతికంగా కనిపించదు. అంతా డిజిటల్ రూపంలోనే ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీకి వీటికీ సంబంధం లేదు.
భారత్‌లో ట్రేడింగ్‌కు అనుమతి
భారత్‌లో క్రిప్టో కరెన్సీకి చట్టబద్ధత లేదు. అయితే ట్రేడింగ్ చేసుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. లాభనష్టాలతో ప్రభుత్వానికి సంబంధం ఉండదు. పెట్టుబడి దారులే బాధ్యులు అవుతారు. ప్రజల్లో అవగాహన పెరగడంతో క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజ్‌లు, ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్, యాప్స్ చాలా అందుబాటులోకి వచ్చాయి.
Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?
Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది
Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..
Also Read: Star Health IPO: స్టార్ హెల్త్ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!