News
News
X

Credit Suisse: క్రెడిట్ సూయిస్ తెర వెనుక కథేంటి, ఎందుకీ పతనం?

క్రెయిట్‌ సూయిస్‌ వచ్చి అగ్నికి ఆజ్యం పోసింది.

FOLLOW US: 
Share:

Credit Suisse Crisis: అమెరికాలో మొదలైన బ్యాంకింగ్‌ సంక్షోభం ఇప్పుడు యూరప్‌ను చుట్టుముట్టింది. యూరోప్‌లోని అతి పెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ సూయిస్ బ్యాంక్ షేర్లు కొన్ని రోజులుగా భారీగా పతనం అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 27% క్షీణించాయి. అమెరికన్‌ బ్యాంకులు అంటించిన మంటలో ప్రపంచ మార్కెట్లలోని సంపద ఇప్పటికే ఆవిరవుతోంది. ఇప్పుడు క్రెయిట్‌ సూయిస్‌ వచ్చి ఆ అగ్నికి ఆజ్యం పోసింది. 

క్రెయిట్‌ సూయిస్‌ సంక్షోభం ప్రభావంతో మన మార్కెట్లు కూడా ఇవాళ (గురువారం, 16 మార్చి 2023) ప్రతికూలంగా ప్రారంభం అయ్యాయి. 

స్విట్జర్ల్యాండ్‌కు ప్రముఖ బ్యాంక్‌ క్రెడిట్‌ సూయిస్‌. దీనికి 166 సంవత్సరాల చరిత్ర ఉంది. ప్రపంచంలోని అతి పెద్ద బ్యాంకుల్లో ఒకటి. UBS AG తర్వాత స్విట్జర్లాండ్‌లో ఇది రెండో అతి పెద్ద బ్యాంక్. బ్యాంకింగ్‌తో పాటు వివిధ రకాల ఆర్థిక సేవలను కూడా అందిస్తుంది. స్విస్‌ ఎక్స్ఛేంజీలో (SIX) ఈ సంస్థ షేరు బుధవారం (15 మార్చి 2023) 27% నష్టంతో రికార్డ్‌ స్థాయి కనిష్టానికి పడిపోయింది. దీంతో, క్రెడిట్‌ సూయిజ్‌ షేరు ట్రేడింగ్‌ స్విస్‌ ఎక్స్ఛేంజీ తాత్కాలికంగా నిలిపేసింది. గత 3 నెలల్లో బ్యాంక్ షేర్‌ ధర మూడింట ఒక వంతు వరకు తగ్గింది.

ఈ ప్రభావం యూరోపియన్‌ బ్యాంకింగ్‌ రంగంపైనా పడింది, ఇతర యూరోపియన్‌ బ్యాంక్‌ షేర్ల కూడా పతనం అయ్యాయి. ఫ్రాన్స్‌కు చెందిన సొసైటీ జనరాలి 12% & BNP పారిబస్‌ 10% మేర పడిపోయాయి. దీంతో, ఈ రెండు బ్యాంకుల షేర్లలోనూ ట్రేడింగ్‌ను తాత్కాలికంగా ఆపేశారు. జర్మనీకి చెందిన డాయిష్‌ బ్యాంక్‌ షేర్లు 8%, బార్‌క్లేస్‌ బ్యాంక్‌ షేర్లు 9% మేర క్షీణించాయి. 

ఈ పతనానికి కారణం ఏంటి?
క్రెడిట్ సూయిస్‌లో 'సౌదీ నేషనల్ బ్యాంక్' అతి పెద్ద వాటాదారు సంస్థ. క్రెడిట్ సూయిస్‌ మొత్తం వాటాలో వాటా 9.9 శాతం దీనికి ఉంది. క్రెడిట్ సూయిస్‌కు ఆర్థిక సాయం చేయడంపై సౌదీ నేషనల్ బ్యాంక్ ‍‌(Saudi National Bank) నిర్ద్వంద్వంగా నిరాకరించమే ఈ పతనానికి కారణం.

నేపథ్యం ఇదీ..
బ్యాంక్‌ ఆర్థిక స్థితి విషయంలో కొన్ని బలహీనతలు ఉన్నట్లు 2022 వార్షిక నివేదికలో క్రెడిట్‌ సూయిజ్‌ వెల్లడించిన క్షణంలో ఈ బ్యాంక్‌ పతనానికి బీజం పడింది. బ్యాంక్‌ ఆర్థిక ఆరోగ్య పరిస్థితిపై స్వయంగా ఆ సంస్థే అనుమానాలు వ్యక్తం చేయడంతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ భారీగా దెబ్బతింది. నాటి నుంచి బ్యాంక్‌ షేర్లు పతనం అవుతూ వచ్చాయి. 

బ్లూంబెర్గ్ నివేదిక ప్రకారం... నిధుల సేకరణ కోసం క్రెడిట్ సూయిస్ ప్రయత్నిస్తే, మీరు బ్యాంకులో ఇంకా పెట్టుబడి పెట్టారా అని సౌదీ నేషనల్ బ్యాంక్ చైర్మన్ అమ్మర్ అల్ ఖుదైరీని ఒక ముఖాముఖిలో రిపోర్టర్‌ ప్రశ్నించారు. క్రెడిట్ సూయిస్‌లో  సౌదీ నేషనల్ బ్యాంక్ ఇకపై పెట్టుబడులు పెట్టదని ఆయన సమాధానం చెప్పారు. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి, అతి పెద్ద కారణం నియమాలు & చట్టపరమైన సవాళ్లు. ఈ వ్యాఖ్యలతో క్రెయిట్‌ సూయిస్‌ షేర్లలో పతనం వేగవంతం అయింది.

స్విస్ నేషనల్ బ్యాంక్ చేయూత
CNBC యొక్క నివేదిక ప్రకారం, క్రెడిట్ సూయిస్‌కి సహాయం చేయడానికి స్విస్ నేషనల్ బ్యాంక్ ముందుకు వచ్చింది. స్విస్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ సూయిస్‌కు 52.68 బిలియన్ డాలర్ల రుణాన్ని ప్రకటించింది. ఈ రుణం స్వల్పకాలిక రుణంగా ఇస్తోంది. 

Published at : 16 Mar 2023 10:40 AM (IST) Tags: Credit Suisse Crisis Credit Suisse shares fall Saudi National Bank

సంబంధిత కథనాలు

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Expensive Bikes: దేశంలో అత్యంత ఖరీదైన బైక్స్ ఇవే - చూడటం తప్ప కొనడం కష్టమే!

Stock Market News: బాగా పెరిగి మళ్లీ డౌన్‌ - సెన్సెక్స్‌ 126, నిఫ్టీ 40 పాయింట్లు అప్‌!

Stock Market News: బాగా పెరిగి మళ్లీ డౌన్‌ - సెన్సెక్స్‌  126, నిఫ్టీ 40 పాయింట్లు అప్‌!

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Home Loan Rates: తెలియకుండానే రెండేళ్లు అదనంగా హోమ్‌లోన్‌ వడ్డీ కట్టేస్తున్న జనం! రీఫైనాన్సింగ్‌ బెటర్‌!

Mamaearth IPO: మామఎర్త్‌ ఐపీవోకి బ్రేక్‌, పబ్లిక్‌ ఆఫర్‌ను పక్కనబెట్టిన స్కిన్‌ కేర్ కంపెనీ

Mamaearth IPO: మామఎర్త్‌ ఐపీవోకి బ్రేక్‌, పబ్లిక్‌ ఆఫర్‌ను పక్కనబెట్టిన స్కిన్‌ కేర్ కంపెనీ

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

Car Fuel Tank Tips: కారులో ట్యాంక్ ఫుల్ చేయిస్తున్నారా? - అయితే మీ వాహనం డేంజర్‌లో ఉన్నట్లే! - ఎందుకో తెలుసా?

టాప్ స్టోరీస్

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్‌ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!