అన్వేషించండి

Budget 2024: నిర్మలమ్మ బడ్జెట్‌ నుంచి కామన్‌ మ్యాన్‌ కోరుకునేది ఇవే, అత్యాశలు లేవు

2014లో, రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పరిమితిని పెంచారు. అప్పట్నుంచి మార్పు లేకుండా అలాగే ఉంది.

Budget 2024 Expectations: కేంద్ర బడ్జెట్ 2024 వెల్లడికి మరికొన్ని రోజులే మిగిలుంది. ఇది ఓట్-ఆన్-అకౌంట్ ‍‌(Vote-on-account) అయినా, సార్వత్రిక ఎన్నికల ముందు వస్తోంది కాబట్టి ప్రజలు కొన్ని తాయిలాలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా, వ్యక్తిగత పన్ను చెల్లింపుదార్లు ఆర్థిక మంత్రి నిర్మలమ్మ (Finance Minister Nirmala Sitharaman) సహృదయత కోసం తపిస్తున్నారు.

కేంద్ర బడ్జెట్‌ నుంచి సామాన్యులు కోరుకునేది ఇవే (Common man wishes from Budget 2024)

1) సెక్షన్ 80C మినహాయింపు పరిమితి పెంపు (Deduction under Section 80C)
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80 CCE ప్రకారం... ప్రస్తుతం సెక్షన్ 80C, 80CCC, 80 CCD(1) కింద లభించే తగ్గింపులన్నీ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.50 లక్షలుగా ఉంది. 2014లో, రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షలకు పరిమితిని పెంచారు. అప్పట్నుంచి మార్పు లేకుండా అలాగే ఉంది, ఏటా సగటున 3% కంటే తక్కువే పెరిగినట్లైంది. ఇదే కాలంలో సగటు ద్రవ్యోల్బణం ఇంతకంటే ఎక్కువగా ఉంది. కాబట్టి, ఈ పరిమితిని కనీసం రూ.2.50 లక్షలకు పెంచాలన్నది టాక్స్‌పేయర్ల అభ్యర్థన.

2) టాక్స్‌ స్లాబ్స్‌లో మార్పులు ‍‌(Changes in tax slabs)
2023 బడ్జెట్‌లో, కొత్త ఆదాయపు పన్ను విధానంలో స్లాబ్ రేట్లను ఆర్థిక మంత్రి సవరించారు. కొత్త శ్లాబ్స్‌ ప్రకారం కూడా అధిక పన్ను రేట్లతో ప్రజలపై భారం పడుతోందన్నది నిపుణుల మాట. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని, కుటుంబాలకు ఆర్థిక నష్టం లేకుండా చూడాలన్నది అభిలాష.

కొత్త ఆదాయపు పన్ను విధానం ప్రకారం అమల్లో ఉన్న శ్లాబ్‌ సిస్టమ్‌:

- రూ.3 లక్షల వరకు ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. 
- రూ.3-6 లక్షల మధ్య ఆదాయంపై 5%
- రూ.6-9 లక్షల మధ్య ఆదాయంపై 10%
- రూ.9-12 లక్షల మధ్య ఆదాయంపై 15%
- రూ.12-15 లక్షల మధ్య ఆదాయంపై 20%
- రూ.15 లక్షలు, అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను కట్టాలి.

3) NPS డబ్బుపై పన్ను రద్దు ‍‌(Tax-free NPS withdrawals)
ప్రస్తుతం ఉన్న నిబంధన ప్రకారం, ఒక వ్యక్తి రిటైర్‌ అయిన తర్వాత NPS ఖాతా నుంచి గరిష్టంగా 60% డబ్బును వరకు మాత్రమే వెనక్కు తీసుకోవడానికి అవకాశం ఉంది. మిగిలిన 40%తో యాన్యుటీ కొనుగోలు చేయాలి. యాన్యుటీ స్వీకరించడం ప్రారంభమైనప్పుడు దానిపై టాక్స్‌ చెల్లించాల్సి వస్తోంది. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, NPS కార్పస్‌లో 60% డబ్బుకు మాత్రమే పన్ను ఉండదు. బ్యాలెన్స్ మీద తక్షణమే కాకపోయినా, భవిష్యత్తులో పన్ను కట్టాల్సి వస్తోంది. దీనిని సవరించి, NPSలో జమ చేసిన మొత్తం డబ్బును పన్ను రహితంగా మార్చాలని సబ్‌స్క్రైబర్లు ఆశిస్తున్నారు. 

4) గృహ రుణాల చెల్లింపులకు ప్రత్యేక తగ్గింపు ‍‌(Special deduction on home loan repayments)
హౌసింగ్ లోన్‌లో తిరిగి చెల్లించే అసలును సెక్షన్ 80C కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఈ సెక్షన్‌ పరిధిలోకి జీవిత బీమా ప్రీమియం, ట్యూషన్ ఫీజు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, EPF, ELSSలో పెట్టుబడులు, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్‌, పన్ను ఆదా FDలు వంటివి వస్తాయి. వీటన్నింటికీ కలిపి పరిమితి కేవలం రూ.1.5 లక్షలు మాత్రమే. సెక్షన్‌ 80C పరిధిలోకి చాలా అంశాలు వస్తాయి, పైగా గృహ రుణాల కోసం తీసుకునే అమౌంట్‌ చాలా పెద్దది. దీనిని దృష్టిలో ఉంచుకుని, గృహ రుణాల చెల్లింపు కోసం విడిగా మినహాయింపు ఇవ్వాలని ప్రజలు అడుగుతున్నారు. 2019లో, సెక్షన్ 80EEA కింద ప్రత్యేక తగ్గింపును అనుమతించారు. మొదటిసారి ఇల్లు కొనే వ్యక్తుల హౌసింగ్‌ లోన్‌పై చెల్లించే వడ్డీ కోసం ప్రత్యేక మినహాయింపును ప్రవేశపెట్టారు. ఇప్పుడు కూడా అలాంటి దానినే గృహ రుణగ్రస్తులు కోరుకుంటున్నారు.

నిర్మలమ్మ తీసుకొచ్చే మధ్యంతర బడ్జెట్‌పై ప్రజలకు ఉన్న అంచనాలు, ఆశలు ఏ మేరకు నెరవేరుతాయో ఫిబ్రవరి 1న తెలుస్తుంది. అయితే.. రాబోయేది ఓట్-ఆన్-అకౌంట్ కాబట్టి, ఎలాంటి అద్భుతాలు ఆశించొద్దని ఆర్థిక మంత్రి ఇప్పటికే హింట్‌ ఇచ్చారు.

మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌లు 4 రోజులు బంద్‌, అర్జంట్‌ పనిపై వెళ్లే ముందు ఈ లిస్ట్‌ చూసుకోండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jagtial Pencil Artist | పెన్సిల్ ఆర్ట్ తో అదరగొడుతున్న జగిత్యాల జిల్లా కళాకారుడు | ABP DesamDharmapuri Ramesh Social Service With Face book | సోషల్ మీడియాతో సామాజిక సేవచేస్తున్న రేణిగుంట రమేశ్Team India At ITC Maurya Hotel in Delhi | హోటల్ కు చేరుకున్న టీం ఇండియా |ABP DesamTeam India Lands In Delhi After World Cup Win | దిల్లీలో అడుగుపెట్టిన టీంఇండియా |ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Team India Victory Parade: జగజ్జేతలకు జేజేలు,  టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
జగజ్జేతలకు జేజేలు, టీమిండియా ఆటగాళ్లకు బ్రహ్మరథం
India's T20 World Cup Glory Celebrations: ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
ముంబయిలో టీమ్‌ఇండియా విజయ యాత్ర
Jagan : పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
పిన్నెల్లి ఈవీఎం ధ్వంసానికి జగన్ సమర్థన - మానసిక స్థితి సరిగా లేదని టీడీపీ మండిపాటు
Revanth In Delhi : బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
బీఆర్ఎస్‌ ఎక్కడుందో టార్చ్‌తో వెదుక్కుంటున్నారు - కేసీఆర్ పై రేవంత్ సెటైర్లు
Team India Victory Parade: టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
టీమిండియాకు ముంబయి గ్రాండ్ వెల్కమ్, భారీ జనం మధ్యన ఊరేగింపు
BRS News: రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
రైతు ఆత్మహత్య వీడియోను పోస్ట్ చేసిన హరీశ్ రావు - చూస్తే కన్నీళ్లు ఆగవు!
Pawan Kalyan: ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
ప్రభుత్వ రికార్డుల దగ్ధంపై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్ - అధికారులకు కీలక ఆదేశాలు
Revanth Meets Modi: ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
ప్రధాని మోదీకి రేవంత్ 12 అంశాలపై వినతి పత్రాలు - ఆ జాబితా ఇదే
Embed widget