By: ABP Desam | Updated at : 01 Jun 2022 08:38 AM (IST)
ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త
Commercial Cylinder Price Drop: ఎల్పీజీ వినియోగదారులకు శుభవార్త. కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 135 మేర తగ్గిస్తూ, ఆయిల్ కంపెనీలు కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నాయి. తగ్గించిన ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2,220.50 అయింది. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.2219కి దిగిరాగా, కోల్‌కతాలో రూ.2322, ముంబైలో రూ.2,171.50, చెన్నైలో రూ.2373కి లభ్యం కానుందని ఓ ప్రకటనలో తెలిపారు. గత నెలలో రూ.102.50 పెరగగా, తాజాగా కమర్షియల్ సిలిండర్ ధర దిగిరావడం ఊరటనిచ్చింది.
Prices of 19kg commercial LPG cylinders reduced by Rs 135 per cylinder. It will now cost Rs 2219 in Delhi, in Kolkata it will cost Rs 2322, in Mumbai Rs 2171.50, and in Chennai it will cost Rs 2373.
— ANI (@ANI) June 1, 2022
No change in rates of domestic LPG cylinder. New rates are effective from today pic.twitter.com/4EzRDHQheG
ఇంటి అవసరాల ఎల్పీజీ ధరలు ఎలా ఉన్నాయంటే..
LPG Price Hike : సామాన్యుడికి గ్యాస్ గుదిబండలా మారింది. గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల పెరగడంతో రూపంలో మరో భారం సామాన్యుడి నెత్తినపడింది. తాజాగా domestic LPG cylinder Priceలో ఏ మార్పులు చేయలేదు. గృహావసరాలకు ఉపయోగించే 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర ఇటీవల ధరలు పెరిగాయి. గ్యాస్ బండ ధరను చమురు సంస్థలు రూ.3.50 పెంచాయి. అలాగే వాణిజ్య సిలిండర్ ధరపై రూ.8 పెంచాయి. ఇప్పటికే నిత్యావసరాలు, ఇంధన ధరల భారాన్ని మోస్తున్న సామాన్యులపై గ్యాస్ ధర పెరుగుదలతో మరింత భారం పడనుంది.
పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే, ఇప్పుడు వాటికి గ్యాస్ కూడా తోడైంది. ఇప్పటికే నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చి సామాన్యుడి జేబుకు చిల్లుపడింది. ధరలు పెరుగుతున్న తీరుతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వచ్చే కాస్త సంపాదన వీటికేపోతే బతుకు బండి ఎలా సాగుతున్నదని ఆవేదన చెందుతున్నారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు గ్యాస్ సిలిండర్ మీద రూ.185 పెరిగింది. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.1100లకు చేరువలోకి వచ్చింది. ధరల నియంత్రణలో కేంద్ర విఫలమైందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. గతేడాది జులై 2021లో గ్యాస్ ధర రూ.887 ఉండేది. ఇప్పుడు రూ.1,100కి చేరడంతో పేదలు గ్యాస్ కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. కూలిపనులు చేసుకునే సామాన్యులు, చిరువ్యాపారుల జేబులు ఖాళీ అవుతున్నాయి.
Also Read: Gas Cylinders Explode: గ్యాస్ సిలిండర్ పేలితే బీమా పొందడం ఎలా? ఈజీ ప్రాసెస్ ఇదే!
Also Read: LPG Gas Cylinder Rate: గ్యాస్ వినియోగదారులకు షాక్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు- మరోసారి భారీగా పెంపు
Nissan Magnite Discount: నిస్సాన్ మ్యాగ్నైట్‌పై భారీ డిస్కౌంట్ - కొనాలంటే ఇదే రైట్ టైం!
Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!
TDS: ఏ పోస్టాఫీసు పథకాల్లో TDS కట్ అవుతుంది, వేటికి మినహాయింపు ఉంది?
Form 16: ఇంకా ఫామ్-16 అందలేదా?, ఆన్‌లైన్‌లో చూసే ఆప్షన్ కూడా ఉంది
EPFO: 6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్‌లకు EPFO మెసేజ్‌లు, అందులో ఏం ఉంది?
Khammam Medico Suicide: మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య, ఒంటికి నిప్పంటించుకుని బలవన్మరణం!
Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్
KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వరాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు
Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్