Coal Crisis: దిల్లీకి మరో గుబులు! ఒకట్రెండు రోజులే బొగ్గు నిల్వలు.. కరెంటు ఉండదా?
దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడటంతో రాబోయే రోజుల్లో దిల్లీలో విద్యుత్ కోతలు తప్పకపోవచ్చని టాటా పవర్ సీఈవో గణేశన్ శ్రీనివాసన్ అన్నారు. నిల్వలు ఒకట్రెండు రోజుల అవసరాల మేరకు ఉన్నాయని పేర్కొన్నారు.
దేశ రాజధాని దిల్లీకి మరో గుబులు పట్టుకుంది! దేశవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తరిగిపోవడంతో విద్యుత్ సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది. 'బొగ్గు సంక్షోభం' నేపథ్యంలో విద్యుత్‌ను నేర్పుగా వినియోగించుకోవాలని పవర్ డిస్కమ్ టాటాపవర్ వినియోగదారులకు సూచించింది. కొందరికి సందేశాలు పంపించింది.
Also Read: రూ.1,000 లోపే స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ బ్యాండ్లు.. అమెజాన్ సేల్‌లో అదిరే ఆఫర్లు
దేశ వ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడటంతో రాబోయే రోజుల్లో దిల్లీలో విద్యుత్ కోతలు తప్పకపోవచ్చని టాటా పవర్ సీఈవో గణేశన్ శ్రీనివాసన్ అన్నారు. విద్యుత్ అవసరాలకు సాధారణంగా 20 రోజులకు సరిపడా ఉండాల్సిన నిల్వలు కేవలం ఒకట్రెండు రోజుల అవసరాల మేరకు ఉన్నాయని పేర్కొన్నారు.
Also Read: టాటా చేతికి ఎయిర్ ఇండియా.. స్పైస్ జెట్‌తో పోటీ పడి దక్కించుకున్న టాటా సన్స్
'దిల్లీ విద్యుత్ భారం తీర్చేందుకు రొటేషనల్ పద్ధతిలో కోతలు విధించాల్సి రావొచ్చు. ఐతే పరిస్థితిని నియంత్రించేందుకు దిల్లీ, కేంద్ర ప్రభుత్వాలు విద్యుత్ తయారీ కేంద్రాలకు బొగ్గును సరఫరా చేయడం, ఇతర అవసరాల నిల్వలను ఇక్కడికి మళ్లిస్తే ఇబ్బందులు ఉండకపోవచ్చు' అని శ్రీనివాసన్ అన్నారు. ఆయన ప్రకటనపై దిల్లీ ప్రభుత్వం వెంటనే స్పందించలేదు. ఇతర డిస్కమ్‌లు సైతం మాట్లాడలేదు.
Also Read: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేటులో మార్పులు చేసిన రెండు బ్యాంకులు.. వివరాలు ఇవే!
'నార్త్ దిల్లీలో బొగ్గు నిల్వలు పరిమితంగా ఉండటంతో మధ్యా్‌హ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్ సరఫరా కష్టంగానే ఉంటుంది. అందుకే విద్యుత్‌ను నేర్పగా వాడుకోండి. బాధ్యతగల పౌరుడిగా నడుచుకోండి. అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం' అని టాటా పవర్ వినియోగదారులకు సందేశాలు పంపడం గమనార్హం. కాగా దిల్లీ విద్యుత్ కొరత ఏర్పడే అవకాశం ఉందని తెలియడంతో బొగ్గు సరఫరా పెంచాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంతకుముందే కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Coal shortage | Delhi CM Arvind Kejriwal writes to PM Narendra Modi, requesting the intervention of the latter's office for diversion of adequate coal & gas to power plants supplying electricity to the national capital pic.twitter.com/9BaJXvp7q4
— ANI (@ANI) October 9, 2021