Market Update: మంగళవారం మార్కెట్లో విలవిల.. సెన్సెక్స్ 396, నిఫ్టీ 110 డౌన్.. ఎందుకంటే?
మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 396, నిఫ్టీ 110 పాయింట్ల వరకు నష్టపోయాయి.
స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్, ఫార్మా, ఆయిల్, గ్యాస్ కంపెనీలు నష్టపోవడంతో సూచీలు పతనం అయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 396 పాయింట్లు నష్టపోగా నిఫ్టీ 18000 దిగువన ముగిసింది.
క్రితం రోజు 60,718 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 60,755 వద్ద ఆరంభమైంది. మొదట్లో కొనుగోళ్లు చేపట్టడంతో 60,802 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. చివర్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో 396 పాయింట్ల నష్టంతో 60,322 వద్ద ముగిసింది. సోమవారం 18,109 వద్ద ముగిసిన నిఫ్టీ నేడు 18,127 వద్ద మొదలైంది. 18,132 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకొన్నా.. చివర్లో 110 పాయింట్ల నష్టంతో 17,999 వద్ద ముగిసింది.
ఎన్‌ఎస్‌ఈలో 1496 కంపెనీల షేర్లు లాభపడగా 1639 నష్టాల్లో ముగిశాయి. 122 షేర్లలో మార్పులేమీ లేవు. శ్రీ సిమెంట్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్, ఎస్‌బీఐ షేర్లు నష్టపోయాయి. మారుతీ సుజుకీ, ఎం అండ్ ఎం, టాటా మోటార్స్, హీరో మోటోకార్ప్, టెక్ మహీంద్రా లాభపడ్డాయి.
పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ రెండు శాతం, నిఫ్టీ బ్యాంక్, ఎనర్జీ, ఫార్మా సూచీలు ఒక శాతం తగ్గాయి. ఆటో సూచీ మాత్రం రెండు శాతానికి పైగా లాభపడింది. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్ కూడా నష్టాల్లోనే ముగిసింది.
Also Read: PM Modi Crypto Meeting: క్రిప్టో కరెన్సీపై మోదీ సమావేశం.. కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం!
Also Read: Financial Lessons for Kids: మీ పిల్లలకు ఈ 6 'డబ్బు' పాఠాలు నేర్పండి!
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి