అన్వేషించండి

Railway Rules: రైల్లో బాణసంచా తీసుకెళ్తున్నారా? - జైల్లో దీపావళి జరుపుకోవాల్సి వస్తుంది

Carrying Crackers In Train: రైలు ప్రయాణం చేసే సమయంలో మనతో పాటు దీపావళి క్రాకర్స్‌ను తీసుకెళ్లవచ్చా?. ఈ ప్రశ్న చాలా మంది మదిలో ఉంటుంది. ఈ విషయంలో రైల్వే రూల్స్‌ ఉన్నాయి.

Railway Rules For Carrying Crackers In Train: మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ వస్తుంది. ఇప్పటికే, దేశవ్యాప్తంగా దీపావళి షాపింగ్‌ (Divali 2024 Shopping) జోరుగా సాగుతోంది. కొత్త బట్టలు, చెప్పులు, మిఠాయిలు, ఇంట్లోకి కావలసిన సరకులు, గృహాలంకరణ వస్తువులతో పాటు బాణాసంచా కూడా దీపావళి షాపింగ్‌ లిస్ట్‌లో ఉంటుంది. వాస్తవానికి, ఇదే అత్యంత కీలకమైంది. దీపావళి అంటేనే క్రాకర్స్‌ వెలగాలి, చెవులు చిల్లులు పడేలా మోతలు మోగాలి. వెలుగులు, మోతలు లేకుండా దీపావళి జరగదేమో. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అప్పుడే బాణసంచా దుకాణాలు కూడా వెలిశాయి. పటాకుల కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. వాయు కాలుష్యం కారణంగా, దిల్లీలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించారు. కానీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాత్రం దీపావళి క్రాకర్స్‌పై నిషేధం లేదు. ఎలాంటి ఆంక్షలు లేకుండా కాల్చొచ్చు, పేల్చొచ్చు.

మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పటాకుల తయారీ యూనిట్లు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల్లో బాణసంచా బాగా చౌకగా లభిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా అలాంటి చోట్లకు వెళ్లి ప్రజలు బాణసంచా కొంటారు. కొంతమంది క్రాకర్‌ బాక్స్‌లను గిఫ్ట్‌గా కూడా ఇస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో... టపాసులను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లాల్సి వస్తుంది. మరి.. రైల్లో క్రాకర్స్‌ను తీసుకెళ్లొచ్చా?. దీనికి సంబంధించి భారతీయ రైల్వే ఏవైనా రూల్స్‌ పెట్టిందా?.

క్రాకర్స్‌కు రైల్లో నో ఎంట్రీ
భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని వస్తువులను తీసుకెళ్లడంపై నిషేధం ఉంది. ఆ వస్తువుల వల్ల రైలు భద్రత, ప్రయాణికుల భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. రైల్వే రూల్స్‌ను చూస్తే... రైలులో ప్రయాణిస్తున్నప్పుడు గ్యాస్ స్టవ్, గ్యాస్ సిలిండర్, మండే రసాయనాలు, పెట్రోల్‌ & డీజిల్‌ వంటి ఇంధనాలు, యాసిడ్, దుర్వాసన వచ్చే వస్తువులు, కత్తుల వంటి పదునైన వస్తువులు, విరిగిపోయే లేదా కారిపోయే వస్తువులను అనుమతించరు. ఇలాంటి వస్తువుల ప్రయాణికులు సమస్యలు ఎదుర్కోవచ్చు. కాబట్టి, పైన చెప్పినవన్నీ నిషేధిత జాబితాలోకి చేరాయి. వీటితో పాటు దీపావళి బాణసంచా కూడా నిషేధిత జాబితాలో ఉంది. ఈ రూల్‌ ప్రకారం, రైలులో ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులెవరూ టపాసులు వెంట తీసుకెళ్లకూడదు. దీనిని ధిక్కరిస్తే కోరిమరీ సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుంది.

3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు
నిషేధిత వస్తువులను వెంట తీసుకెళ్తున్న ప్రయాణీకులను అడ్డుకునే అధికారం రైల్వే అధికార్లకు ఉంది. అలాంటి ప్రయాణీకులపై రైల్వే చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. ప్రయాణీకులు వెయ్యి రూపాయల వరకు జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు 3 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడొచ్చు. కేసు తీవ్రతను బట్టి ఈ రెండింటినీ ఒకేసారి విధించవచ్చు. 

బాణసంచాకు మండే స్వభావం అత్యధికంగా ఉంటుంది. అది అంటుకోవడానికి మంటే అక్కర్లేదు, కాస్త వేడి తగినా చాలు. రైల్లో బాణసంచా పేలితే రైలు బోగీకి కూడా మంటలు అంటుకునే ప్రమాదం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగొచ్చు. అందుకే భారతీయ రైల్వే విభాగం రైల్లోకి బాణసంచా తీసుకురావడాన్ని నిషేధించింది.

మరో ఆసక్తికర కథనం: పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ - ఈ వ్యాపారాల్లో లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటుంది! 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడుభారత్ వీర విధ్వంసం, సఫారీ గడ్డపైనే రికార్డు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Brother Passes Away: చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
చంద్రబాబు ఇంట్లో తీవ్ర విషాదం, చికిత్స పొందుతూ సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
Nayanthara Dhanush Issue:ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
ధనుష్ వర్సెస్ నయనతార... పది కోట్లకు లీగల్ నోటీస్ - హీరోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నయన్ ఓపెన్ లెటర్
Indiramma Houses: కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
కాకతీయ టెక్స్ టైల్ పార్క్ భూ నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు, ఉత్తర్వులు జారీ
Minister Atchennaidu: జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
జీరో అవర్‌పై అసెంబ్లీలో వాదోపవాదాలు - టీడీపీ ఎమ్మెల్యేకు రిప్లై ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు
Anurag Kulkarni - Ramya Behara Wedding: సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
సీక్రెట్‌గా లవ్ మ్యారేజ్ చేసుకున్న టాలీవుడ్ సింగర్స్... నెట్టింట ఫోటోలు వైరల్!
Game Changer: ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
ఇండియాలో డ్యుయెట్ సాంగ్... అమెరికాలో డోప్ సాంగ్ - తమన్ ‘గేమ్ ఛేంజర్’ ప్లాన్స్ మామూలుగా లేవుగా
Mike Tyson vs Jake Paul Boxing Result: మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
మహాబలుడు మైక్ టైసన్‌పై యువ బాక్సర్ జేక్ పాల్ విజయం - ప్రైజ్ మనీ ఎంతో తెలుసా!
Sharmila: ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
ఏపీ గ్రూప్ 2 తరహాలోనే గ్రూప్ 1 మెయిన్స్‌కు అభ్యర్థుల్ని ఎంపిక చేయాలి - ప్రభుత్వానికి షర్మిల డిమాండ్
Embed widget