అన్వేషించండి

Telangana Budget 2024-25: వ్యవ'సాయమే' ప్రాధాన్యం - రైతులకు బడ్జెట్‌లో గుడ్ న్యూస్, రూ.500 బోనస్‌పై కీలక ప్రకటన

Telangana News: తెలంగాణ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం రూ.72,569 కోట్లు కేటాయిస్తూ అధిక ప్రాధాన్యం ఇచ్చింది. వరి సన్నాలు పండించే రైతులకు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించింది.

Telangana Budget Allocation To Agriculture: ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.2,91,159 కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను (Telangana Budget 2024-25) డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో వ్యవసాయ, సాగునీటి పారుదల రంగాలకు బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవ'సాయమే' ప్రాధాన్యంగా రైతుల సంక్షేమమే ధ్యేయంగా పలు కీలక ప్రకటనలు చేశారు. వ్యవసాయ రంగానికి ఏకంగా రూ.72.659 కోట్లు.. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్లు కేటాయించారు. అలాగే ఉద్యానవనం రూ.737 కోట్లు, పశు సంవర్థక శాఖకు రూ.1,980 కోట్లు ప్రతిపాదించారు.

'రైతులకు రూ.500 బోనస్'

రాష్ట్రంలో అన్నదాతలకు మేలు చేకూర్చేలా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్‌లో కీలక ప్రకటన చేశారు. వరికి క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ పంట నుంచే ఇది అమల్లోకి వస్తుందన్నారు. సన్నరకం  వరిసాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని.. అవి పండించిన రైతులకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. దీంతో సాగు విస్తీర్ణం పెరిగి అన్నదాతలకు మేలు చేకూరుతుందని పేర్కొన్నారు. 'రూ.2 లక్షల రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణమాఫీ చేస్తాం. ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు అవసరమైన సాయం చేస్తాం. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అందుకు అనుగుణంగానే వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయిస్తున్నాం.' అని భట్టి పేర్కొన్నారు.

రైతు కూలీలకు రూ.12 వేలు..

రాష్ట్రంలో భూమి లేని గ్రామీణులు ఎక్కువగా రైతు కూలీలుగా జీవనం సాగిస్తున్నారని.. అలాంటి వారు పని లేని సమయంలో ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రైతు కూలీల జీవనంలో మార్పులు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్న ఆయన.. భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ ఏడాది నుంచే ఈ ఆర్థిక సాయాన్ని వారికి అందిస్తామని స్పష్టం చేశారు. 'ఇప్పటివరకూ రూ.లక్ష వరకూ రుణం ఉన్న 11.34 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. ప్రధాని ఫసల్ బీమా యోజనలో చేరోబతున్నాం.' అని భట్టి పేర్కొన్నారు.

Also Read: Telangana Budget 2024-25: రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Sankranthiki vasthunnam: వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం'లో రమణ గోగుల పాట - 18 ఏళ్ళ తర్వాత హిట్ కాంబో రిపీట్
Viral News: బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
బిల్డింగ్ కూల్చాలంటూ నోటీసులు, ఆ ఓనర్ ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Sri Reddy News: ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!
ఏపీలో నటి శ్రీరెడ్డిపై కేసు నమోదు- వైసీపీ హయాంలో చేసిన పోస్టులు, కామెంట్లతో చిక్కులు!
Maruti Brezza vs Tata Nexon: మారుతి బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ఏది బెస్ట్ కారు?
మారుతి బ్రెజ్జా వర్సెస్ టాటా నెక్సాన్ - రూ.10 లక్షల్లోపు ఏది బెస్ట్ కారు?
Jagan: సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
సూపర్ సిక్స్ ఎగ్గొట్టేందుకే బడ్జెట్ - చంద్రబాబుపై జగన్ కీలక వ్యాఖ్యలు
Embed widget