అన్వేషించండి

Telangana Budget 2024-25: రూ.2,91,159 కోట్లతో తెలంగాణ బడ్జెట్ - వివిధ రంగాలకు కేటాయింపులు ఇలా ఉన్నాయి

Telangana News: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చి ఆరు గ్యారంటీలను ప్రాతిపదికగా చేసుకొని 2024-25 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టింది.

Telangana Finance Minister Mallu Bhatti Vikramarka: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఇవాళ అసెంబ్లీ ప్రవేశ పెట్టింది. ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024 సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు. ఫిబ్రవరిలోనే బడ్జెట్ ప్రవేశ పెట్టాల్సి ఉన్నప్పటికీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తీసుకొచ్చారు. పూర్తిస్థాయిలో ఆర్థిక వనరులపై పట్టు లేదని, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల వివరాలు తెలియాల్సి ఉన్నందున అప్పట్లో ఆ నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యనే కేంద్రం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులను బేస్ చేసుకొని ఇప్పుడు బడ్జెట్‌ను రూపకల్పన చేశారు. మొత్తం రూ.2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 'ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే కలలు సాకారమవుతాయని సుదీర్ఘ కాలం ఉద్యమించారు. వారి ఆవేదన గుర్తించి యూపీఏ ప్రభుత్వం ప్రత్యేక రాష్టాన్ని ఇచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ధి కాలంలో పురోభివవృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదు. గత పాలకులు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమయ్యారు. ప్రజల సంక్షేమాన్ని కూడా పట్టించుకోలేదు. రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావ సమయానికి ఉన్న 77 వేల కోట్ల రూపాయల అప్పు... ఆరు లక్ష 71వేల 750 కోట్లకు చేరింది.' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 

బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇదే 

  • మొత్తం బడ్జెట్‌-  2,91,159
  • రెవెన్యూ వ్యయం - 2,20,945 కోట్లు 
  • మూల ధన వ్యయం - 33,487

'తప్పుడు నిర్ణయాలు - నో రిజల్ట్స్'

'గత పాలకులు తీసుకున్న తప్పుడు నిర్ణయాల కారణంగా సాగునీటి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అవినీతి సొమ్మును ఏ కాల్వల ద్వారా పారించాలని గత పాలకులు పని చేశారు. దీంతో మన నీళ్లను మనం సమర్థంగా ఉపయోగించుకోలేకపోయాం. దీన్ని సరిదిద్దేందుకు ఈసారి నిధులు కేటాయించాం. అప్పులు పెరగడంతో రాష్ట్ర ఆర్థిక స్థితి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. సొంత జాగీరులా మార్చేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రం ఏర్పడే నాటికి పరిపుష్టిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చేశారు. ఉద్యోగులకు సరైన టైంలో జీతాలు ఇవ్వలేకపోతున్నాం. వాళ్లే కాకుండా ప్రభుత్వ పథకాలపై ఆధారపడిన వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.' అని భట్టి పేర్కొన్నారు.

వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు 

 

ప్రభుత్వ రంగం

కేటాయించిన నిధులు కోట్లలో 

1 వ్యవసాయ రంగం   72,659 
2 నీటిపారుదల రంగం  22,301
3 విద్యా రంగం  21,292
4 వైద్య ఆరోగ్య రంగం  11,468
5 పారిశ్రామిక రంగం  2,762
6 ఐటీ అభివృద్ధి కోసం  774
7  స్త్రీ శిశు సంక్షేమ   2736
8 విద్యుత్ రంగం  16,410
9 హార్టీకల్చర్‌- ఆయిల్ పామ్ సాగు  737
10 పశు సంవర్థక రంగం 1980
11 ప్రజాపంపిణీ వ్యవస్థ 3836
12 పంచాయతీరాజ్‌ -గ్రామీణాభివృద్ధి 29,816
13 హైదరాబాద్ నగరాభివృద్ధి 10,000
14 రీజనల్ రింగ్ రోడ్ 1525
15 ఎస్సీ సంక్షేమం 33,124
16 ఎస్టీ సంక్షేమం  17,056
17 మైనార్టీ సంక్షేమం 3,003
18 బీసీ సంక్షేమం 9,200
19 అడవులు పర్యవరణ రక్షణ రంగం  1,064
20 శాంతి భద్రతలు   9,564 
21 రోడ్లు, భవనాలకు  5,790

Also Read:తెలంగాణ బడ్జెట్‌లో ఏ పథకాలకు ఎంత కేటాయించారంటే? 

Also Read: ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్ - బడ్జెట్ సమావేశాలకు గులాబీ బాస్

 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Daaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desamఆర్టీసీ బస్సులో పంచారామాలు, ఒక్క రోజులో వెయ్యి కిలో మీటర్లుPamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Teachers News: టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
టీచర్లకు గుడ్ న్యూస్, వారిపై నమోదైన కేసులు ఎత్తివేస్తామన్న మంత్రి నారా లోకేష్
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
Pawan Kalyan: మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
మహారాష్ట్రలో రెండు రోజుల పాటు పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - నాందేడ్‌లో మూడు సభల్లో ప్రసంగాలు
MBBS Student Dies: పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
పుట్టినరోజు నాడే తీవ్ర విషాదం- ఫిలిప్పీన్స్‌లో తెలంగాణ ఎంబీబీఎస్ విద్యార్థిని మృతి
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Thaman On Pushpa 2: 'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
'పుష్ప 2' బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో తమన్ క్లారిటీ... బన్నీ మూవీకి ఆయన ఇచ్చిన రివ్యూ ఏమిటంటే?
SBI Loan: లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
లోన్‌ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Embed widget