అన్వేషించండి

Banks strike in December: సమ్మె బాటలో బ్యాంకులు, డిసెంబర్‌ ప్రారంభం నుంచే స్ట్రైక్‌ షురూ!

Banks strike in December: డిసెంబర్‌ నెలలో చాలా రోజుల పాటు వివిధ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు, ఆ సమ్మె రోజుల్లో బ్యాంకు సేవలు ప్రజలకు అందవు.

Bank Employees Strike In December 2023: మన దేశ ప్రజల దైనందిన జీవితంలో బ్యాంక్‌లు కూడా ఒక భాగం. సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు, ప్రతి వ్యక్తికి బ్యాంక్‌తో పని ఉంటుంది. వచ్చే నెలలో ప్రజలు బ్యాంకింగ్‌ కష్టాలు (banking services will be hit in December 2023) ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. 

డిసెంబర్‌ నెలలో చాలా రోజుల పాటు వివిధ బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగుతున్నారు, ఆ సమ్మె రోజుల్లో బ్యాంకు సేవలు ప్రజలకు అందవు. బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మెపై, 'ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్' (AIBEA) ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. డిసెంబరు 2023లో, వేర్వేరు తేదీల్లో బ్యాంకుల్లో సమ్మెను AIBEA ప్రకటించింది. PTI రిపోర్ట్‌ ప్రకారం, బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె (Bank Employees Strike in 2023 December 4th to 11th) డిసెంబర్ 4న ప్రారంభమై, డిసెంబర్ 11 వరకు  కొనసాగుతుంది. 

డిసెంబర్ 2023లో ఈ రోజుల్లో ఈ బ్యాంకుల్లో ఉద్యోగుల సమ్మె:

డిసెంబర్ 4, 2023- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్‌ ‍‌(Employees Strike in SBI, Punjab National Bank, Punjab & Sind Bank)
డిసెంబర్ 5, 2023- బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా (Employees Strike in Bank of Baroda, Bank of India‌)
డిసెంబర్ 6, 2023- కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Employees Strike in Canara Bank, Central Bank of India)
డిసెంబర్ 7, 2023- ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్‌ (Employees Strike in Indian Bank, UCO Bank)
డిసెంబర్ 8, 2023- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Employees Strike in Union Bank Of India, Bank of Maharashtra)
డిసెంబర్ 9 & 10, 2023- బ్యాంకులకు రెండో శనివారం & ఆదివారం సెలవులు
డిసెంబర్ 11, 2023- ప్రైవేట్ బ్యాంకుల్లో ఉద్యోగుల సమ్మె (Private Bank Employees Strike)

బ్యాంకు ఉద్యోగుల డిమాండ్లు (Demands of bank employees)
బ్యాంకులో పని చేయడానికి సరిపడా సిబ్బంది ఉండాలన్నది బ్యాంకు ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌. దీంతో పాటు, బ్యాంకింగ్ రంగంలో ఔట్ సోర్సింగ్‌ సేవలను నిషేధించడం ద్వారా శాశ్వత ఉద్యోగాల సంఖ్యను పెంచడం, మరికొన్ని డిమాండ్లు కూడా ఉన్నాయి. తాత్కాలిక ఉద్యోగుల వల్ల, బ్యాంక్‌ కస్టమర్ల వ్యక్తిగత సమాచారం కూడా ప్రమాదంలో పడుతుందని బ్యాంక్‌ ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

బ్యాంక్‌ కస్టమర్లకు సమస్యలు
AIBEA ప్రతిపాదించిన సమ్మె కారణంగా, బ్యాంక్ కస్టమర్లు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. బ్యాంక్‌ ఉద్యోగుల స్ట్రైక్‌ డిసెంబరు 4 - 11 తేదీల మధ్య వివిధ బ్యాంకుల్లో జరుగుతుంది. అవే రోజుల్లో బ్యాంక్‌లో మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, ఆ పని నిలిచిపోవచ్చు. కాబట్టి, బ్యాంక్‌ ఉద్యోగుల సమ్మె తేదీలను (Bank employees strike dates) గుర్తు పెట్టుకుని  ముందే జాగ్రత్త పడండి. బ్యాంక్‌ బంద్‌ ముందు రోజునో, తర్వాత రోజునో మీ పని పూర్తి చేసుకోండి.

మరో ఆసక్తికర కథనం: నష్టాల్లో ప్రారంభమైనా పుంజుకుంటున్న స్టాక్‌ మార్కెట్లు, బ్యాంక్‌ షేర్లు డీలా

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Advertisement
Advertisement
Advertisement
metaverse

వీడియోలు

Jagan Letter to AP Assembly Speaker | ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాసిన మాజీ సీఎం జగన్Raja Singh Counter to Asaduddin | అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలకు రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్KA Paul Advice To Chandrababu Naidu | సీఎం చంద్రబాబుకు కేఏ పాల్ సలహాలుBJP MLA Comments on YSRCP | బీజేపీ ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Met BRS Leaders: వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
వైఎస్సార్ హయాంలో ఎన్నో జరిగినా భయపడలేదు, కొందరు పార్టీ మారితే నష్టం లేదు: కేసీఆర్
Allagadda: టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
టీడీపీ నేత భాస్కర్‌రెడ్డి దంపతులపై దాడి, భార్య మృతితో కలకలం - ఆస్పత్రికి వెళ్లిన అఖిల ప్రియ
Renu Desai: ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
ఒక తల్లి శాపం మీకు తగులుతుంది - పవన్, ఆన్నా ఫోటో షేర్ చేస్తూ రేణు దేశాయ్ పోస్ట్
Raja Singh: దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
దేశం విడిచి వెళ్లిపో- అసదుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలపై రాజాసింగ్ స్ట్రాంగ్ కౌంటర్
Pawan Kalyan: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఖరారు, డిప్యూటీ సీఎంగా తొలిసారి నియోజకవర్గానికి జనసేనాని
Bharateeyudu 2 Trailer: ‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
‘భారతీయుడు 2’ ట్రైలర్: కమల్ విశ్వరూపం - ఆ ఒక్క సీన్.. మైండ్ బ్లాక్ అంతే!
Nandyal: నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
నంద్యాలలో బీరు బాటిల్లో ప్లాస్టిక్ స్పూన్, అవాక్కైన యువకుడు
David Warner Retirement: ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
ముగిసిన డేవిడ్ వార్నర్‌ శకం, మూడు ఫార్మాట్లకు ఆసీస్ స్టార్ గుడ్‌ బై
Embed widget