అన్వేషించండి

Rishad Premji: సగం జీతంతో సరిపెట్టుకున్న అజీమ్‌ ప్రేమ్‌జీ వారసుడు, కారణమేంటో తెలుసా?

విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 8 కోట్లు మాత్రమే జీతంగా (Rishad Premji Salary) తీసుకున్నారు. ఇది అతని జీతంలో సగం మాత్రమే.

Rishad Premji Salary: భారతీయ వ్యాపార ప్రపంచంలో పరిచయం అవసరం లేని వ్యక్తి అజీమ్ ప్రేమ్‌జీ. విప్రోను (Wipro) ఎఫ్‌ఎంసీజీ కంపెనీ స్థాయి నుంచి దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటిగా ఆయన తీర్చిదిద్దారు. అజీమ్ ప్రేమ్‌జీ కేవలం 21 ఏళ్ల వయసులో విప్రో బాధ్యతలు చేపట్టారు, సంస్థను రూ. 2.70 లక్షల కోట్ల విలువైన కంపెనీగా అందలం ఎక్కించారు. ఆ తర్వాత, నిర్వహణ బాధ్యతలకు స్వస్థి పలికి స్వచ్ఛంద సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పుడు సామాజిక సేవ కార్యక్రమాల్లోనూ ప్రపంచ స్థాయిలో తనదైన ముద్ర వేశారు అజీమ్‌ ప్రేమ్‌జీ.

ప్రస్తుతం, విప్రో ఛైర్మన్‌గా సంస్థ బాధ్యతలను అజీమ్‌ ప్రేమ్‌జీ కుమారుడు రిషద్ ప్రేమ్‌జీ మోస్తున్నారు. రిషద్ ప్రేమ్‌జీ 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ. 8 కోట్లు జీతంగా (Rishad Premji Salary) తీసుకున్నారు. ఇది అతని జీతంలో సగం మాత్రమే. విప్రో ఐటీ సర్వీసెస్ ఆదాయాలు తగ్గడంతో రిషద్ ప్రేమ్‌జీ ఈ నిర్ణయం తీసుకున్నారు, సగం జీతంతో సరిపెట్టుకున్నారు.

అత్యంత ఉదార వ్యక్తుల్లో అజీమ్‌ ప్రేమ్‌జీ ఒకరు
భారతదేశంలోని అత్యంత ఉదారమైన వ్యక్తుల్లో ఒకరిగా అజీమ్ ప్రేమ్‌జీకి (Azim Premji) గుర్తింపు ఉంది. దార్శనికత & స్వచ్ఛంద సేవల ద్వారా ఒక మహోన్నత మార్గదర్శిగా ఆయన నిలిచారు. పదవీ విరమణకు ముందు, దాదాపు రెండు దశాబ్దాల పాటు దేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఉన్నారు. ఎడెల్‌గివ్ హురున్ ఫిలాంత్రఫి లిస్ట్‌ 2023 (Hurun India 2023) ప్రకారం, గత ఒక్క ఏడాదిలోనే అజీమ్ ప్రేమ్‌జీ & అతని కుటుంబం సుమారు రూ. 1774 కోట్లు విరాళంగా ఇచ్చారు. రిషద్ ప్రేమ్‌జీ కూడా తన తండ్రి పరిచిన బాటలోనే నడుస్తున్నారు. కంపెనీ కష్టాల్లో కూరుకుపోవడం చూసి తన జీతాన్ని స్వయంగా సగానికి సగం తగ్గించుకున్నారు.

రిషద్ ప్రేమ్‌జీ 2007లో విప్రో కమాండర్‌ బాధ్యతలు
53 ఏళ్ల పాటు విప్రోకు నాయకత్వం వహించిన అజీమ్ ప్రేమ్‌జీ, ఆ సంస్థను తన కుమారుడు రిషద్ ప్రేమ్‌జీకి అప్పగించారు. రిషద్ ప్రేమ్‌జీ 2007లో విప్రోలో చేరారు. 2019లో ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అయ్యారు. దీనికి ముందు వివిధ హోదాల్లో బాధ్యతలు తీసుకున్నారు, కంపెనీ స్థితిగతులను ఆకళింపు చేసుకున్నారు. వెస్లియన్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదివిన రిషద్ ప్రేమ్‌జీ, హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా కూడా తీసుకున్నారు. రిషద్ నాస్కామ్ (NASSCOM) చైర్మన్‌గా కూడా వ్యవహరించారు. ఇప్పుడు గ్లోబల్ కంపెనీ విప్రోను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం విప్రోలో 2.50 లక్షల మంది పని చేస్తున్నారు.

రిషద్ ప్రేమ్‌జీ.. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 9,51,353 డాలర్ల (రూ.8 కోట్లు) జీతం తీసుకున్న రిషద్‌.. కొవిడ్-19 సమయంలోనూ ఇలాంటి ఆదర్శవంతమైన నిర్ణయమే తీసుకున్నారు. అప్పుడు కూడా రిషద్ స్వయంగా తన జీతంలో 31 శాతం కోత విధించుకున్నారు. రిషద్ ప్రేమ్‌జీ విప్రో ఎంటర్‌ప్రైజెస్, విప్రో జీఈ, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ బోర్డుల్లోనూ మెంబర్‌గా సేవలు అందిస్తున్నారు.

మరో ఆసక్తికర కథనం: క్రెడిట్‌ స్కోర్‌ తక్కువున్నా గృహ రుణం, ఈ ఉపాయాలు తెలిస్తే చాలు!

టాప్ హెడ్ లైన్స్

Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి
EMI భారం తగ్గాలంటే ఏం చేయాలి? Home Loan తీసుకున్న వారు ఇవి తెలుసుకోండి

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Irumudi Story : ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
ఎమోషన్... డివోషన్... క్రైమ్ ఇన్వెస్టిగేషన్ - ఇరుముడి స్టోరీ అదేనా?
Raaka Update : 'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
'రాకా' నలుగురు హీరోయిన్స్ - ఎవరి రోల్ ఏంటో తెలుసా?
Embed widget