News
News
X

Astec Lifesciences Shares: వీక్‌ మార్కెట్‌లోనూ రికార్డ్‌ కొట్టిన ఆస్టెక్, దీని కథ మామూలుగా లేదు

గత మూడు ట్రేడింగ్ డేస్‌లోనే ఇది 24 శాతం ర్యాలీ చేసింది.

FOLLOW US: 
 
Astec Lifesciences Shares: ఇవాళ్టి (గురువారం) వీక్‌ మార్కెట్‌లోనూ, ఇంట్రా డే ట్రేడ్‌లో, ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ షేర్లు 14 శాతం పెరిగాయి, 52 వారాల రికార్డు స్థాయి రూ.2,274.55 కి చేరాయి. 

ఈ ఏడాది జులై 20వ తేదీ నాటి గరిష్ట స్థాయి రూ.2,178.85 ని ఇవాళ ఈ పెస్టిసైడ్స్‌ & ఆగ్రో కెమికల్స్ స్టాక్‌ అధిగమించింది. అంతేకాదు, గత మూడు ట్రేడింగ్ డేస్‌లోనే ఇది 24 శాతం ర్యాలీ చేసింది.

ప్రైస్‌ ట్రెండ్స్‌
మధ్యాహ్నం 12.55 గంటల సమయానికి S&P BSE సెన్సెక్స్‌లో 0.66 శాతం క్షీణతతో పోలిస్తే, ఆస్టెక్ లైఫ్‌సైన్సెస్ స్క్రిప్‌ 7.23 శాతం పెరిగి రూ.2,143.60 వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది కాలంలో బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లో 6 శాతం క్షీణతకు వ్యతిరేకంగా, ఇది 67 శాతం జూమ్ అయింది. గత నెల రోజుల కాలంలో 11 శాతం, గత ఆరు నెలల కాలంలో 19 శాతం ర్యాలీ చేసింది. 

బిజినెస్‌
వ్యవసాయ రసాయనాలు, పురుగు మందుల వ్యాపారాన్ని ఆస్టెక్‌ కంపెనీ చేస్తోంది. ఆగ్రో కెమికల్‌ యాక్టివ్‌ ఇంగ్రీడియంట్స్‌ (టెక్నికల్), బల్క్, ఫార్ములేషన్స్, ఇంటర్మీడియట్ ఉత్పత్తులను తయారు చేస్తోంది. అటు ఎగుమతులు, ఇటు దేశీయ విక్రయాలు రెండింటిలో మంచి సేల్స్‌ నంబర్లు కనిపిస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, యూరప్, పశ్చిమ ఆసియా, ఆగ్నేయ ఆసియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికాలోని 25 దేశాలకు ఈ కంపెనీ ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి.

News Reels

2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (Q1FY23), మొత్తం ఆదాయంలో 44.4 శాతం వార్షిక (YoY) వృద్ధితో రూ.187 కోట్లను ఈ కంపెనీ నివేదించింది. పెరిగిన విక్రయాలు, ప్రైస్‌ రియలైజేషన్స్‌, CMO వాల్యూమ్స్‌ వల్ల మంచి వృద్ధిని సాధించింది. Q1FY23 ఆదాయంలో CMO సేల్స్‌ 16 శాతం వాటాను అందించింది. అంతకుముందు ఏడాది మొదటి త్రైమాసికంలో ఈ కంపెనీకి ఎలాంటి CMO విక్రయాలు లేవు.

ఫ్యూచర్‌ 
కంపెనీకి చెందిన కొత్త R&D సెంటర్‌ నిర్మాణం పని వేగంగా సాగుతోంది, FY23 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. కంపెనీ ఈ సంవత్సరం 2 కొత్త CMO ఉత్పత్తులను వాణిజ్యీకరించనుంది. 

కంపెనీ రాబడిలో ఎగుమతుల వాటా మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ, తన హెర్బిసైడ్స్ ప్లాంట్‌ను గత ఏడాది ఆగస్టులో వాణిజ్యీకరించింది. ఈ కొత్త వ్యాపార విభాగం నుంచి వచ్చే ఆదాయం నుంచి మీడియం టర్మ్‌లో కంపెనీకి అధిక ప్రయోజనం పొందుతుందని భావిస్తున్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 13 Oct 2022 02:05 PM (IST) Tags: Pesticides Stock Market Astec Lifesciences Record high Agrochemicals

సంబంధిత కథనాలు

UPI Transactions: పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు - పట్టణాలతో ఢీ!

UPI Transactions: పల్లెలూ, చిన్న పట్టణాల్లో 650% పెరిగిన యూపీఐ లావాదేవీలు - పట్టణాలతో ఢీ!

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్‌ డల్‌! తగ్గిన బిట్‌కాయిన్‌ రేట్‌!

Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్‌ డల్‌! తగ్గిన బిట్‌కాయిన్‌ రేట్‌!

Stock Market Closing 06 December 2022: సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ - నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Stock Market Closing 06 December 2022: సూచీలను నడిపిస్తున్న పీఎస్‌యూ బ్యాంక్స్‌ - నష్టాల్లోంచి తేరుకున్న నిఫ్టీ, సెన్సెక్స్‌

Five-Star Business Finance: ఫుల్‌ రైజింగ్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ స్టాక్‌, ఇవాళ 19% జూమ్‌

Five-Star Business Finance: ఫుల్‌ రైజింగ్‌లో ఫైవ్‌ స్టార్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ స్టాక్‌, ఇవాళ 19% జూమ్‌

India GDP Growth: గుడ్‌ న్యూస్‌, భారత జీడీపీ వృద్ధి అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్‌

India GDP Growth: గుడ్‌ న్యూస్‌, భారత జీడీపీ వృద్ధి అంచనా పెంచిన ప్రపంచ బ్యాంక్‌

టాప్ స్టోరీస్

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

YS Sharmila: కేసీఆర్ అంటే కొట్టి చంపే రాజ్యాంగం, తెలంగాణలో ఇదే అమలవుతోంది: వైఎస్ షర్మిల

TDP Leader Narayana : మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ - బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

TDP Leader Narayana :  మాజీ మంత్రి నారాయణకు రిలీఫ్ -  బెయిల్ కొనసాగిస్తూ హైకోర్టు తీర్పు !

Assistant Professor Jobs: వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

Assistant Professor Jobs: వైద్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!