అన్వేషించండి

Adani Wilmar Listing Price: 3% నష్టపోయి 17% లాభపడ్డ అదానీ విల్మర్‌ - వెంటనే షేర్లు కొనేసిన మదుపర్లు

అదానీ విల్మర్‌ నేడు స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. ఇష్యూ ధర 230తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో మొదలైంది. మరికాసేపటికే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో 17 శాతం వరకు పుంజుకుంది.

వంట నూనెల తయారీ సంస్థ అదానీ విల్మర్‌ నేడు స్టాక్‌ మార్కెట్లో నమోదైంది. ఇష్యూ ధర 230తో పోలిస్తే స్వల్ప నష్టాల్లో మొదలైంది. మరికాసేపటికే మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో 17 శాతం వరకు పుంజుకుంది. ప్రస్తుతం రూ.40 లాభంతో 270 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

అదానీ విల్మర్‌ 3.91 శాతం డిస్కౌంట్‌తో రూ.221 వద్ద బీఎస్‌ఈలో నమోదైంది. ఇక ఎన్ఎస్‌ఈలో 1.30 శాతం డిస్కౌంట్‌తో రూ.227 వద్ద మొదలైంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత పుంజుకొంది. సింగపూర్‌కు చెందిన విల్మర్‌ గ్రూప్‌, భారత్‌లోని అదానీ గ్రూప్‌ జాయింట్‌ వెంచర్‌గా అదానీ విల్మర్‌ను స్థాపించారు. ఫార్చూన్‌ బ్రాండ్‌తో ఇది వంట నూనెలను విక్రయిస్తోంది. మధ్యాహ్నం షేర్ల ధర పెరగడంతో బీఎస్‌ఈ ప్రకారం కంపెనీ మార్కెట్‌ విలువ రూ.31,770 కోట్లకు చేరుకుంది.

Also Read: ఐపీవో క్రేజ్‌ - పెట్టుబడి పెట్టే ముందు ఇవి గుర్తుపెట్టుకుంటే నష్టాలు రావు!

ఈ కంపెనీ ఐపీవోకు మంచి స్పందనే లభించింది. 17 రెట్లు ఎక్కువగా ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నారు. ఐపీవో ధరల శ్రేణిని రూ.218-230 మధ్య నిర్ణయించింది. మొత్తంగా ఇప్పుడు 12 శాతం ప్రజలకు మిగతా 88లో ఇద్దరు ప్రమోటర్లకు చెరిసగం వాటా ఉండనుంది. ఇష్యూ ద్వారా సేకరించిన డబ్బులో రూ.1900 కోట్లను క్యాపిటల్‌ ఎక్స్‌పెండిచర్‌, రూ.1058 కోట్లను రుణాల చెల్లింపునకు, రూ.450 కోట్లను పెట్టుబడులు, విలీనాల కోసం వినియోగించనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో అదానీ విల్మర్‌ ఆదాయం రూ.24,957 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే సమయంలో ఇది రూ.16,273 కోట్లుగా ఉండేది. ఇక లాభం రూ.288 కోట్ల నుంచి రూ.357 కోట్లకు పెరిగింది. మొత్తంగా 2020-21లో కంపెనీ రాబడి రూ.37,195 కోట్లు కాగా లాభం రూ.728 కోట్లుగా ఉంది. వంట నూనెలు మాత్రమే కాకుండా బియ్యం, గోధుమ పిండి, చక్కెర, సబ్బులు, హ్యాండ్ వాష్‌లు, శానిటైజర్లను ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తోంది.

Also Read: ఆసియాలో రిచెస్ట్ పర్సన్‌గా గౌతమ్ అదానీ, రెండో స్థానానికి రిలయన్స్ అధినేత

Also Read: 75 ఏళ్ల క్రితం 'ఎయిర్ ఇండియా' పేరు నిర్ణయించిన తీరు తెలిస్తే.. సర్‌ప్రైజ్‌ అవుతారు!

 

టాప్ హెడ్ లైన్స్

Reliance Foundation Outreach: రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
రిలయన్స్ ఫౌండేషన్ సామాజిక సేవలు - జియో ఉచిత ఏఐ కోర్సుతో డిజిటల్ విప్లవం!
Reliance Industries 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ 1977 IPO: ధీరూభాయ్ అంబానీ సామాన్యులను అభివృద్ధిలో భాగస్వాములు ఎలా చేశారు
UPI Charges: దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
దీపావళి తర్వాతే యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు.. వ్యాపారులకు ఎన్పీసీఐ భారీ ఊరట
Personal Loan Interest Rates: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? టాప్ బ్యాంకుల వడ్డీ రేట్లు, కీ ఫ్యాక్టర్స్ మీ కోసం!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Graduate MLC Elections: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - కాంగ్రెస్ ముందడుగు.. అభ్యర్థుల తేల్చలేక తలమునకలవుతున్న బీఆర్ఎస్, బీజేపీ!
YS Jagan Cockroach Janata Party Support: CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
CJP నేతలకు జగన్ సంపూర్ణ మద్దతు - బీజేపీతో వైఎస్సార్‌సీపీ దోస్తీకి శాశ్వత ముగింపేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Embed widget