అన్వేషించండి

8th Pay Commission: కనీస వేతనం 4 రెట్లు పెంచాలని డిమాండ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గుడ్ న్యూస్ వింటారా ?

8వ వేతన సంఘంపై చర్చలు ఊపందుకున్నాయి. ఉద్యోగులు కనీస వేతనం 50,000- 72,000 చేయాలని, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు.

8th Pay Commission Latest Update: ప్రస్తుతం 8వ వేతన సంఘం ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులపై పనిచేస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల తమ బెనిఫిట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. వివిధ ఉద్యోగ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేతనాలు, అలవెన్సులు, ఇతర పలు మార్పులను కోరుతున్నాయి. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి అనేక సూచనలు కూడా చేశాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే, గత కొన్ని సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల విధానంలో ఇది అతిపెద్ద మార్పు అవుతుంది. 8వ వేతన సంఘం ఏం చేస్తుంది, వారి సిఫారసులతో ఉద్యోగులకు కలిగే బెనిఫిట్స్ తాజాగా అప్డేట్స్ ఇక్కడ తెలుసుకుందాం.

శాలరీ స్ట్రక్చర్‌లో మార్పు కోసం డిమాండ్

కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం 'ప్రగతిశీల శిక్షక్ న్యాయ మంచ్' (PSNM) వేతనాలు, అలవెన్సుల మొత్తం విధానంలో పలు మార్పులు చేయాలని డిమాండ్ చేసింది. టీచర్ల సంఘం తన ప్రతిపాదనలో లెవెల్ 1 ఉద్యోగులకు కనీస మూల వేతనం రూ. 50,000 నుండి రూ. 60,000 వరకు ఉండాలని కోరింది. ఇది ప్రస్తుత 7వ వేతన సంఘం కింద లభించే రూ. 18,000 బేసిక్ శాలరీ కంటే చాలా ఎక్కువ.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్, ఇంక్రిమెంట్‌పై దృష్టి

ఉద్యోగ సంఘాల యూనియన్ ప్రస్తుత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.57 పెంచి 2.62 నుండి 3.83 వరకు చేయాలని సూచించింది. అలాగే, వార్షిక ఇంక్రిమెంట్ 3 శాతం నుండి దాదాపు 6-7 శాతం వరకు పెంచాలని డిమాండ్లు వస్తున్నాయి. ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ మార్పులు అవసరమని ఉద్యోగుల సంఘం చెబుతోంది. ఈ మార్పులతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన భారీగా పెరుగుతుంది.

జీతం 4 రెట్లు పెంచాలని డిమాండ్

భారతీయ ప్రతిరక్షా మజ్దూర్ సంఘ్ (BPMS) కనీస ప్రాథమిక వేతనాన్ని (Basic Salry) దాదాపు రూ. 72,000కి పెంచాలని కేంద్రాన్ని, 8వ వేతన సంఘాన్ని డిమాండ్ చేసింది. ఇది ప్రస్తుత బేసిక్ శాలరీ కంటే 4 రెట్లు ఎక్కువ. దీనితో పాటు, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 4కి పెంచాలని కూడా చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. టాప్ లెవెల్ పోస్టులకు గరిష్ట వేతనం రూ. 10 లక్షల వరకు ఉండాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ సూచనలను అంగీకరిస్తే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలలో భారీ పెరుగుదల సాధ్యమవుతుందనరి ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. 

కేంద్ర ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 

8వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 ఉండవచ్చని నిపుణులు పేర్కొన్నారు. 7వ వేతన సంఘం కింద కనీస ప్రాథమిక వేతనం రూ. 18,000. ఒకవేళ ప్రభుత్వం ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.86 శాతంగా నిర్ణయిస్తే.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 2.86 అయితే కనీస ప్రాథమిక వేతనం 18,000 రూపాయల నుండి నేరుగా 51,480 కు పెరుగుతుంది. దీని ప్రకారం బేసిక్ పే లో 186 శాతం భారీ పెరుగుదల నమోదు అవుతుంది. 

అయితే, 2.86 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ లేదా 186 శాతం జీతం పెంపుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3 వద్ద ఉంచాలని డిమాండ్ చేస్తున్నాయి. అంతా ఓకే అయితే కనుక కనీస వేతనం 54,000 వరకు వెళ్లే అవకాశం ఉంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Tata Sons Chairman Chandrasekaran Resigns:టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
టాటా గ్రూప్‌లో సంచలనం! అనూహ్యంగా తప్పుకున్న చంద్రశేఖరన్! భారీగా నష్టపోయిన షేర్లు!
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Devdutt Padikkal Century: శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
శ్రీలంకపై తొలి టెస్టులో సెంచరీ బాదిన దేవదత్ పడిక్కల్.. 24 ఏళ్ల తరువాత తొలి బ్యాటర్‌గా
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
Embed widget