రియల్ వరల్డ్ టెస్ట్‌లో తేలిన నిజం: మైలేజ్‌లో XSR 155 బెస్టా? 160 Duke బెస్టా?
యమహా XSR 155, KTM 160 డ్యూక్ బైక్స్‌కు ఎక్స్‌పర్ట్‌లు సిటీ, హైవే రియల్ వరల్డ్ మైలేజ్ టెస్ట్ చేశారు. నిజమైన రైడింగ్‌లో ఏ బైక్ ఎక్కువ మైలేజ్ ఇచ్చిందో ఈ కథనంలో తెలుసుకోండి.

Yamaha XSR 155 mileage: బైక్ కొనేటప్పుడు పవర్, లుక్ మాత్రమే కాదు... రోజూ ఎంత పెట్రోల్ తాగుతుందన్నది కూడా చాలా మందికి కీలకం. ముఖ్యంగా, ఎక్కువగా సిటీ రైడింగ్, అప్పుడప్పుడు హైవే ట్రిప్స్ వేసే వారికి మైలేజ్ పెద్ద ఫ్యాక్టర్. ఈ నేపథ్యంలో... Yamaha XSR 155, KTM 160 Duke బైక్స్‌ను ఎక్స్‌పర్ట్‌లు రియల్ వరల్డ్ కండిషన్స్‌లో టెస్ట్ చేసి, సిటీ & హైవే మైలేజ్ ఎలా ఉందో నిజాలు వెలికితీశారు.
ముందుగా బైక్స్ గురించి చిన్న పరిచయం
KTM 160 Duke అనేది నేకడ్ స్ట్రీట్‌ఫైటర్ బైక్. భారత మార్కెట్‌లో నిలిపేసిన 125 Dukeకు ఇది సక్సెసర్‌గా వచ్చింది. మరోవైపు, యమహా XSR 155 అనేది రెట్రో స్పోర్ట్ మోటార్‌సైకిల్. R15, MT-15లతో ఒకే చాసిస్, ఒకే ఇంజిన్ ప్లాట్‌ఫామ్ షేర్ చేస్తుంది.
ఇంజిన్ విషయానికి వస్తే, KTM 160 Dukeలో 164.2cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 9,500rpm వద్ద 19hp పవర్, 7,500rpm వద్ద 15.5Nm టార్క్ ఇస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో పని చేస్తుంది.
యమహా XSR 155లో 155cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 10,000rpm వద్ద 18.4hp పవర్, 7,500rpm వద్ద 14.2Nm టార్క్ ఇస్తుంది. ఇందులో కూడా 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంది.
Yamaha XSR 155 రియల్ వరల్డ్ మైలేజ్
ఎక్స్‌పర్ట్‌లు, ముందుగా XSR 155 ట్యాంక్ ఫుల్ చేసి హైవే మీద సుమారు 50 కిలోమీటర్లకు పైగా నడిపారు. ఆ తర్వాత ట్యాంక్ ఫుల్ చేయడానికి 1.1 లీటర్ పెట్రోల్ అవసరమైంది. దీంతో హైవే మైలేజ్ లీటరు 51.7 కిలోమీటర్లుగా లెక్క తేలింది.
ఆ తర్వాత, సిటీ ట్రాఫిక్ ఉన్న ప్రాంతాల్లో దాదాపు 50 కిలోమీటర్లు రైడ్ చేశారు. మళ్లీ టాప్ అప్ చేయడానికి 0.96 లీటర్ పెట్రోల్ వాడాల్సి వచ్చింది. దీంతో సిటీలో XSR 155 మైలేజ్ లీటరుకు 50.3 కిలోమీటర్లుగా నమోదైంది.
KTM 160 Duke రియల్ వరల్డ్ మైలేజ్
160 Duke ట్యాంక్ కూడా ఫుల్ చేసి హైవే మీద 56.5 కిలోమీటర్లు రైడ్ చేశారు. తర్వాత ట్యాంక్ నింపడానికి 1.25 లీటర్ పెట్రోల్ అవసరమైంది. దీంతో హైవే మైలేజ్ లీటరుకు 45.2 కిలోమీటర్లుగా వచ్చింది.
సిటీ రైడింగ్‌లో కూడా ట్యాంక్ ఫుల్ చేసి 47.7 కిలోమీటర్లు నడిపిన తర్వాత 1.23 లీటర్ పెట్రోల్ ఖర్చైంది. అలా సిటీలో 160 Duke మైలేజ్ లీటరుకు 38.7 కిలోమీటర్లుగా రికార్డ్ అయింది.
సిటీలో, హైవే మీద ఇచ్చిన మైలేజ్ కంపారిజన్
సిటీలో
Yamaha XSR 155 ---- 50.30 KPL
KTM 160 Duke ---- 38.70 KPL
హైవే మీద
Yamaha XSR 155 ---- 51.70 KPL
KTM 160 Duke ---- 45.20 KPL
సగటు మైలేజ్
Yamaha XSR 155 ---- 51 KPL
KTM 160 Duke ---- 41.95 KPL
ఏది బెస్ట్?
KTM 160 Duke పవర్‌ఫుల్ ఇంజిన్, స్పోర్టీ నేచర్‌తో సిటీలో రైడ్ చేయడానికి చాలా ఫన్‌గా ఉంటుంది. అయితే బరువు కూడా XSR 155 కంటే దాదాపు 10 కిలోలు ఎక్కువ.
యమహా XSR 155 మాత్రం తేలికైన బైక్. ఇంజిన్ ఇంధన సామర్థ్యం కోసం ఇప్పటికే మంచి పేరు సంపాదించింది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ వల్ల హైవే మీద 70-80kmph స్పీడ్‌లోనూ ఇంజిన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది.
మొత్తానికి, రియల్ వరల్డ్ టెస్ట్‌లో యమహా XSR 155 స్పష్టంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చింది. రోజూ ఆఫీస్ వెళ్లేవాళ్లు, లాంగ్ రైడ్స్ ఇష్టపడే వారు మైలేజ్‌కు ప్రాధాన్యం ఇస్తే XSR 155 మెరుగైన ఎంపికగా కనిపిస్తోంది. పవర్, అగ్రెసివ్ రైడింగ్ స్టైల్ కావాలంటే 160 Duke తనదైన ఆకర్షణ చూపిస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















