అన్వేషించండి

Bajaj Platina On Loan: కేవలం రూ.5000 జేబులో వేసుకురండి, బజాజ్ ప్లాటినా బైక్‌ను ఇంటికి తీసుకెళ్లండి!

Bajaj Platina Finance Plan: ఎలాంటి రోడ్లమీదైనా రయ్యిన దూసుకెళ్లడానికి బజాజ్‌ ప్లాటినా 100 బైక్‌లో 102cc ఇంజిన్‌ ఉంది. సిటీల్లో తిరగడంతో పాటు ఆఫ్‌-రోడింగ్‌కు కూడా ఈ బండి అనుకూలంగా ఉంటుంది.

Bajaj Platina 100 Price, Down Payment, Loan and EMI Details: టూవీలర్‌ సెగ్మెంట్‌లో, మైలేజ్‌కు మరో పేరు బజాజ్‌. రేటు తక్కువ - రేంజ్‌ ఎక్కువ అన్నట్లు నడుస్తున్న బజాజ్‌ బైక్‌లు, స్కూటర్లు భారతీయుల మనస్సుల్లో గట్టిగా పాతుకుపోయాయి. సిటీలో స్టైల్‌గా షికార్లు కొట్టడానికైనా, జాజ్‌ కోసం డైలీ అప్-డౌన్ చేస్తున్నా, పల్లెటూరి రోడ్లపై దుమ్ము రేపాలన్నా బజాజ్‌ బైక్‌ బెస్ట్‌ ఆప్షన్‌ అవుతుంది. కుటుంబానికైనా, కుర్రకారుకైనా, సంసారపక్షంగానైనా, సరదాలకైనా బజాజ్ ప్లాటినా 100 చక్కగా సరిపోతుంది. మీరు ఈ బైక్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఒకేసారి పూర్తి డబ్బు చెల్లించడానికి బదులు ఫైనాన్స్ కూడా తీసుకోవచ్చు. లేదా, మీ జేబులో కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఉన్నా బజాజ్ ప్లాటినా 100ను ఇంటికి తెచ్చుకోవచ్చు.

తెలుగు రాష్ట్రాల్లో బజాజ్ ప్లాటినా 100 ధర
ఏపీ, తెలంగాణలోని వివిధ నగరాల్లో బజాజ్‌ ప్లాటినా 100 ఆన్‌-రోడ్‌ ధర (Bajaj Platina 100 on-road price) రూ. 84,000 నుంచి రూ. 86,000 మధ్య ఉంటుంది. ఈ రేటులో.. ఎక్స్-షోరూమ్ ధర (Bajaj Platina 100 ex-showroom price) రూ. 69,254తో ‍‌పాటు, RTO ఫీజ్‌, బీమా, ఇతర ఖర్చులు కలిపితే ఆన్‌-రోడ్‌ రేటు వస్తుంది. ఈ బజాజ్ బైక్ కొనడానికి, మీరు కేవలం రూ. 5,000 డౌన్ పేమెంట్ చేస్తే చాలు. మిగిలిన రూ. 80,000 బ్యాంకు నుంచి లోన్ తీసుకోవాలి. బ్యాంక్‌ మీకు 9 శాతం వడ్డీ రేటుకు టూవీలర్‌ లోన్ మంజూరు చేసిందని అనుకుందాం. లోన్ మొత్తం, వడ్డీ రేటు వంటివి మీ క్రెడిట్ స్కోర్‌, ఆదాయం, బ్యాంక్‌ పాలసీపై ఆధారపడి ఉంటాయి. 

EMI వివరాలు

3 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు చొప్పున, ప్రతి నెలా దాదాపు రూ. 2,544 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ 36 నెలల్లో మీరు మొత్తం రూ. 11,583 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 

4 సంవత్సరాల కాలానికి రుణం తీసుకుంటే, 9 శాతం వడ్డీ రేటు చొప్పున, ప్రతి నెలా దాదాపు రూ. 1,991 EMI చెల్లించాల్సి ఉంటుంది. ఈ 48 నెలల్లో మీరు మొత్తం రూ. 15,559 వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. 

అంటే, మీరు నాలుగేళ్ల టెన్యూర్‌లో టూవీలర్‌ లోన్‌ తీసుకుంటే, నెలకు రూ. 2000 కన్నా తక్కువ మొత్తం చెల్లిస్తే చాలు.

ఇంజిన్‌ పవర్
బజాజ్ ప్లాటినా 100 బండికి కంపెనీ 102 cc ఇంజిన్‌ బిగించింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 7.9 PS పవర్‌ను & 8.3 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్‌ చేస్తుంది. ఈ బైక్ బరువు దాదాపు 117 కిలోలు. ఈ బైక్‌ టైర్లకు డ్రమ్ బ్రేకులు అమర్చారు, బ్రేకింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇంకా... DRL, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, టాకోమీటర్, యాంటీ-స్కిడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ కూడా ఉన్నాయి. ఈ బైక్‌కు 200 mm గ్రౌండ్ క్లియరెన్స్‌ ఉంటుంది, ఎత్తైన స్పీడ్‌ బ్రేకర్లు, లోతైన గుంతల్లో కూడా ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు.

మైలేజ్‌
ఈ బండికి 11 లీటర్ల కెపాసిటీతో ఇంధనం ట్యాంక్ ఉంది. కంపెనీ ప్రకారం, బజాజ్ ప్లాటినా 100 లీటరుకు 70-72 km మైలేజ్‌ (Bajaj Platina 100 mileage) ఇస్తుంది. మనం 70 కిలోమీటర్ల మైలేజ్‌ను లెక్కలోకి తీసుకుంటే, ఈ బైక్‌ ట్యాంక్‌ ఫుల్‌ చేసిన తర్వాత 770 కిలోమీటర్ల వరకు (కంపెనీ లెక్క ప్రకారం) మధ్యలో ఆగకుండా నడుస్తుంది. డ్రైవింగ్‌ స్టైల్‌, రోడ్‌ కండిషన్‌, వాతావరణ పరిస్థితులు కూడా మైలేజ్‌పై ప్రభావం చూపుతాయని గుర్తుంచుకోండి.

మార్కెట్లో, బజాజ్ ప్లాటినా 100 బైక్ హోండా షైన్, టీవీఎస్ స్పోర్ట్స్ & హీరో స్ప్లెండర్ ప్లస్ వంటి బైక్‌లకు డైరెక్ట్‌గా పోటీ ఇస్తుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Nicolas Maduro: ఇంటి నుంచి నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
నన్ను కిడ్నాప్ చేశారు.. నేను యుద్ధ ఖైదీని, నిజాయితీపరుడిని: అమెరికా కోర్టులో నికోలస్ మదురో
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Mahindra XUV 7XO: 7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
7 ఎయిర్‌బ్యాగ్‌లతో మహీంద్రా XUV7XO ఎస్‌యూవీ లాంచ్.. ధర, సేఫ్టీ ఫీచర్లు చూసి కొనేయండి
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Gold vs Silver for Investment : బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
బంగారం 2026లో మరింత లాభాలనిస్తుందా? పెట్టుబడితో వెండిని మించి రాబడి పొందొచ్చా?
Thiruparankundram: ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
ఆ కొండపై దీపం వెలిగించుకోవచ్చు - మద్రాస్ హైకర్టు సంచలన తీర్పు - స్టాలిన్ సర్కార్ ఇక ఆపలేదు !
Venezuelan people happy: దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
దేశాధ్యక్షుడ్ని అమెరికా కిడ్నాప్ చేస్తే సంబరాలు చేసుకుంటున్న వెనిజులా ప్రజలు - మదురో ఇంతగా టార్చర్ పెట్టారా?
Embed widget