Royal Enfield New Bike: తక్కువ రేటులో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్ - ఎక్కువ మైలేజ్, ఇంటర్నేషనల్ టెక్నాలజీ!
Royal Enfield Hybrid Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు కొత్త టెక్నాలజీ వైపు కదులుతోంది. కంపెనీ త్వరలో 250cc హైబ్రిడ్ ఇంజిన్‌తో కొత్త బైక్‌ను విడుదల చేయబోతోంది, ఇది అద్భుతమైన మైలేజీతో వస్తుంది.

Royal Enfield 250cc Hybrid Bike: రోడ్డును దడదడలాడించే మోటార్ సైకిళ్లు తయారు చేస్తున్న రాయల్ ఎన్‌ఫీల్డ్, ఇప్పుడు రూట్ మార్చింది. సాంప్రదాయ బైక్‌ల తయారీని దాటి కొత్త రూట్‌లోకి మళ్లింది. ఈ కంపెనీ త్వరలో కొత్త 250cc హైబ్రిడ్ మోటార్ సైకిల్‌ను విడుదల చేయాలని చూస్తోంది. కొత్త బండి క్లాసిక్ లుక్స్ ఇవ్వడంతో పాటు టెక్నాలజీ పరంగానూ ముందుంటుంది. ఈ కంపెనీ, ఈ కొత్త హైబ్రిడ్ బైక్ ఇంజిన్‌ను ప్రసిద్ధ చైనా కంపెనీ CFMoto ద్వారా తయారు చేయిస్తోంది.
హైబ్రిడ్ టెక్నాలజీతో ఎక్కువ మైలేజీ
ఈ బైక్‌లో బిగించే ఇంజిన్ హైబ్రిడ్ టెక్నాలజీతో పని చేస్తుంది. అంటే.. దీనిని పెట్రోల్‌తో పాటు ఎలక్ట్రిక్ మోడ్‌తో కూడా నడపవచ్చు. ఫలితంగా మైలేజీ బాగా పెరుగుతుంది & పర్యావరణంపై ప్రభావం కూడా తగ్గుతుంది. భారత ప్రభుత్వ విధానమైన BS6 ఫేజ్ 2 & CAFE నిబంధనలను దృష్టిలో ఉంచుకుని ఈ కంపెనీ హైబ్రిడ్ మోడల్ దిశగా హ్యాండిల్ తిప్పింది.
హైబ్రిడ్ మోటర్ సైకిల్ ధర ఎంత ఉంటుంది?
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం, రాయల్ ఎన్‌ఫీల్డ్ 250cc కెపాసిటీతో హైబ్రిడ్ టెక్నాలజీ మోటర్ సైకిల్‌ను తయారు చేస్తోంది. ఈ బండి రేటు రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.35 లక్షల మధ్య ఉండవచ్చు. ఈ బ్రాండ్‌లో చవకైన బైక్ Hunter 350 కంటే ఇది ఇంకా తక్కువ రేటులో వస్తుంది. అంటే, తక్కువ బడ్జెట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ కొనడానికి ఇది గొప్ప అవకాశం అవుతుంది, పైగా మైలేజ్ కూడా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ మోడ్‌ను వాడడం వల్ల బండి నిర్వహణ ఖర్చులు కూడా తగ్గుతాయి.
ఫీచర్లు
రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త 250cc బైక్ కంపెనీ ఐకానిక్ క్లాసిక్ డిజైన్‌తో రావచ్చు, ఇది కస్టమర్లకు రెట్రో ఫీల్ ఇస్తుంది. రైడర్ భద్రత కోసం, దీనికి ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) అమరుస్తారు. ఇంకా... డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, LED హెడ్‌ల్యాంప్ & టెయిల్ లైట్లు వంటి ఆధునిక లక్షణాలను యాడ్ చేస్తారు. తక్కువ బరువున్న వ్యక్తులు కూడా హ్యాండిల్ చేసేలా దీని తేలిక రూపొందిస్తున్నారు. ఈ కారణంగా కూడా ఈ మోటర్ సైకిల్ మైలేజ్ & పనితీరు రెండూ మెరుగ్గా ఉంటాయి.
'V' కోడ్‌నేమ్
కంపెనీ ప్రస్తుతం ఈ బైక్‌కు 'V' అనే కోడ్‌నేమ్ ఇచ్చింది. చైనా నుంచి వచ్చే ఇంజిన్‌తో, చెన్నైలోని హైవే రోడ్ ఫ్యాక్టరీలో మోటర్ సైకిల్ మాన్యుఫ్యాక్చర్ చేస్తారు. ఇంజిన్ మినహా దాదాపుగా మిగిలిన భాగాలన్నీ (90% విడిభాగాలు) భారతదేశంలో తయారైనవే. కొత్త 250సీసీ బైక్ రెడీ అయ్యాక, భారత్‌తో పాటు ఆగ్నేయాసియా & యూరప్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విడుదల చేస్తారు.
ఈ మోటర్ సైకిల్ ఎప్పుడు లాంచ్ అవుతుంది?
ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ & CFMoto మధ్య ఒప్పందం 2026 ప్రథమార్థం నాటికి ఖరారవుతుందని భావిస్తున్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే ఈ బైక్ లాంచ్ ప్రక్రియ వేగవంతం అవుతుంది.





















