అన్వేషించండి

VinFast VF7 First Look : భారత్ మొబిలిటీ ఎక్స్​పోలో VF7, VF6.. ఆకట్టుకునే ఫీచర్లతో, 10 సంవత్సరాల బ్యాటరీ వారంటీ​తో డెబ్యూ ఇచ్చిన VinFast 

VinFast Debuts in India : భారత్​లో జరిగిన ఆటో ఎక్స్​పో 2025లో VF7, VF6 ఎలక్ట్రిక్ SUVలతో డెబ్యూ ఇచ్చింది విన్​ఫాస్ట్. ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చి మార్కెట్​లో క్రేజ్​ని పెంచుకుంది.

VinFast Makes India Debut with VF7, VF6 : అంతర్జాతీయ సంస్థ విన్​ఫాస్ట్​ ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఇండియా ఆటో మొబైల్​ని టార్గెట్​ చేస్తూ.. VF7, VF6లను భారత మొబిలిటీ ఎక్స్​పోలో ఆవిష్కరించింది. VF7 విన్​ఫాస్ట్ మేకర్స్ నుంచి వచ్చి ప్రీమియంగా అందరి దృష్టిని ఆకర్షించింది. జర్మన్ ఈవీలకు ప్రత్యర్థిగా దీనిని లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. విన్​ఫాస్ట్​ నుంచి ఇండియాలో తయారు చేసి లాంచ్​ అయిన మొదటి కారు ఇదే. ఈ ఐదు సీట్లు కలిగి ఉన్న ఎలక్ట్రిక్ SUV ఇదే ఏడాది ద్వితీయార్థంలో విడుదల కానున్నట్లు తెలిపారు మేకర్స్.

తమిళనాడులోని తూత్తుకుడిలో తయారీదారులు స్థానికంగా VF7ను అసెంబుల్ చేయనున్నారు. ఇతర ఫీచర్ల మాదిరిగానే.. VF7 ముందు భాగంలో కూడా Vలోగోను రూపొందించారు. సీల్డ్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ డిజైన్​తో హెడ్ ల్యాంప్ యూనిట్స్, ఎయిర్ వెంట్ గ్రిల్​తో క్లీన్ డిజైన్ చేశారు. స్ట్రాంగ్ షోల్డర్ లైన్, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్​లతో మినిమలిస్టిక్ డిజైన్స్​ VF7 సొంతం. 

VF7 ఫీచర్లు ఇవే.. 

కారులోపల 15 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ యూనిట్​నిచ్చారు. HUD, పనోరమిక్ సన్​రూఫ్, 8 ఎయిర్​ బ్యాగ్​లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, లెవెల్ 2 ADASలను కలిగి ఉంది. ఈ SUVని 75.4 kWh భారీ లిథియం అయాన్ బ్యాటరీని డ్యూయల్ మోటారు కాన్ఫిరిగేషన్​తో అందుబాటులోకి తెచ్చారు. ఫుల్ ఛార్జ్​తో 450 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 349 hp, 500 Nm టార్క్​ను ఇది ఉత్పత్తి చేస్తుంది. 

VF6 ఫీచర్లు ఇవే..

విన్​ఫాస్ట్ SUVలలో రెండో వేరియంట్ అయిన VF6 కూడా అద్భుతమైన ఫీచర్లతో వచ్చింది. ఈ వేరియంట్ 12.9 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్​తో వచ్చింది. 171 bhp, 250 Nm టార్క్​ను ఇది ఉత్పత్తి చేస్తూ.. ఫుల్ వెర్షన్ ఛార్జ్​తో 400 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ప్లస్ వెర్షన్​లో 198 bhp, 309 Nm టార్క్​ని ఉత్పత్తి చేస్తూ.. ఫుల్ ఛార్జ్​తో 381 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. 

ప్లస్ పాయింట్ అదే

VF7, VF6 ప్రీ బుకింగ్ మాత్రం ప్రీ ఫెస్టివ్ పీరియడ్​లో ప్రారంభమవుతుందని తెలిపారు మేకర్స్. VF7 డెబ్యూ అయితే ఇచ్చారు కానీ ధరను ఇంకా ప్రకటించలేదు. బ్యాటరీ పరిమాణం, దాని లగ్జరీ ఫీచర్స్​ని బట్టి.. ఇది ఇతర లగ్జరీ కార్ల తయారీదారులకు గట్టి పోటి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా 10 సంవత్సరాల వారంటీని అందిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది విన్​ఫాస్ట్. గ్లోబల్ మోడల్ ఫీచర్ అయిన దీనిని ఇండియాలో కూడా అందిస్తుంది.

వియత్నామీస్ (Vietnamese) ఇప్పటికే మూడు ఖండాల్లోని 12 దేశాల్లో EV మేకర్​గా తన మార్క్ వేసింది. వియత్నాం కాకుండా.. ఇండోనేషియా, యూనైటెడ్ స్టేట్స్​తో పాటు ఇండియాలో మూడో విన్​ఫాస్ట్ తయారీ యూనిట్​ను ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్​గా ఇండియాను దృష్టిలో పెట్టుకుని.. ఇప్పటికే ఉన్న లగ్జరీ కార్ల తయారీదారుల కంటే భిన్నంగా ఉండేలా వీటిని డిజైన్ చేస్తున్నట్లు విన్‌ఫాస్ట్ ఇండియా డిప్యూటీ CEO అశ్విన్ పాటిల్ తెలిపారు. బ్రాండ్ బ్యాటరీ లీజింగ్, సబ్​స్క్రిప్షన్ ప్లాన్​తో సహా పలు రకాల విక్రయ నమూనాలు పరిశీలిస్తూ మోడల్స్​ని మార్కెట్​లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. 

Also Read : 2025లో మూడు కొత్త కార్లు లాంచ్ చేయనున్న టాటా - పంచ్, టియాగో, టిగోర్‌ల్లో

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anna Konidela: తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
AB Venakateswara Rao on Jagan: జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు
జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు
IPL2025 RCB VS RR Result Update: ఆర్సీబీ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. నాలుగో విజ‌యంతో టాప్-3కి చేరిక‌.. వందో ఫిప్టీతో  కోహ్లీ స‌త్తా.. సాల్ట్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ
ఆర్సీబీ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. నాలుగో విజ‌యంతో టాప్-3కి చేరిక‌.. వందో ఫిప్టీతో  కోహ్లీ స‌త్తా.. సాల్ట్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RR vs RCB Match Highlights IPL 2025 | రాజస్థాన్ పై 9వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం | ABP DesamTravis Head vs Maxwell Stoinis Fight | ఐపీఎల్ మ్యాచులో ఆస్ట్రేలియన్ల మధ్య ఫైట్ | ABP DesamShreyas Iyer Reading Abhishek Sharma Paper | ఆ పేపర్ లో ఏముంది అభిషేక్ | ABP DesamAbhishek Sharma Thanking Yuvraj Singh | యువీ లేకపోతే నేను లేనంటున్న అభిషేక్ శర్మ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana News: ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డ్ !
Anna Konidela: తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
తిరుమల శ్రీవారికి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల, మార్క్ శంకర్ కోసం తల్లి ప్రేమ ఇదీ
AB Venakateswara Rao on Jagan: జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు
జగన్‌ నెవర్‌ ఎగైన్‌.. ఇదే నా నినాదం, పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఫిక్స్ - ఇంటిలెజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు
IPL2025 RCB VS RR Result Update: ఆర్సీబీ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. నాలుగో విజ‌యంతో టాప్-3కి చేరిక‌.. వందో ఫిప్టీతో  కోహ్లీ స‌త్తా.. సాల్ట్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ
ఆర్సీబీ స్ట‌న్నింగ్ విక్ట‌రీ.. నాలుగో విజ‌యంతో టాప్-3కి చేరిక‌.. వందో ఫిప్టీతో  కోహ్లీ స‌త్తా.. సాల్ట్ ఫ్యాబ్యుల‌స్ ఫిఫ్టీ
Actor: లుక్స్, కలర్ చూసి ఎగతాళి - కట్ చేస్తే రూ.వందల కోట్ల ఆస్తికి వారసుడు, ఈ స్టార్ హీరో గురించి తెలుసా?
లుక్స్, కలర్ చూసి ఎగతాళి - కట్ చేస్తే రూ.వందల కోట్ల ఆస్తికి వారసుడు, ఈ స్టార్ హీరో గురించి తెలుసా?
CM Chandrababu: బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి,  రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
బాణసంచా ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, రూ. 15 లక్షల భారీ పరిహారం ప్రకటన
Bhu Bharati Act: భూభార‌తి చట్టం, పోర్ట‌ల్ సోమవారం జాతికి అంకితం, ధ‌ర‌ణి భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
భూభార‌తి చట్టం, పోర్ట‌ల్ సోమవారం జాతికి అంకితం, ధ‌ర‌ణి భూముల‌పై ఫోరెన్సిక్ ఆడిట్‌: పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
SS Rajamouli: ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
ఈ పాన్ ఇండియా మూవీస్ కోసం దర్శక ధీరుడు రాజమౌళి వెయిటింగ్ - వాటి అప్ డేట్స్ ఏంటో తెలుసా?
Embed widget