అన్వేషించండి

Hero Destini 125: భారీ అప్‌గ్రేడ్స్‌తో కొత్త హీరో డెస్టినీ వచ్చేస్తుంది.. హొండా యాక్టివాకు గట్టి పోటీ ఖాయం!

Hero Destini 125: హీరో డెస్టినీ 125 ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ త్వరలోనే విడుదల కానుంది. ఈ స్కూటర్‌ని ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్న మోడల్‌ కంటే సరికొత్త డిజైన్‌, చేసి తీసుకువచ్చే అవకాశం ఉంది.

Hero Destini Facelift Version Teased: హీరో డెస్టినీ ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌ నుంచి ఎక్కువగా అమ్ముడవుతున్న స్కూటర్‌గా ఉంది. అయినప్పటికీ ఇది హోండా యాక్టివా కంటే చాలా వెనుకబడి ఉంది. దీని డిజైన్, ఇతర స్టైలింగ్ సరిగ్గా లేకపోవడంతో జనాలు వీటిని కొనేందుకు ఆసక్తి కనబరచడం లేదు. ఇప్పుడు తాజాగా హీరో డెస్టినీ 125ని అప్‌డేటెడ్‌ వెర్షన్‌లో తీసుకువచ్చేందుకు హీరో కంపెనీ యోచిస్తుంది. గత ఏడాది ఆగస్టులో విడుదల చేసిన హీరో డెస్టినీ ప్రైమ్‌ని మించిపోయేలా దీనిని మార్కెట్‌లో ప్రవేశపెట్టనుంది. అతి త్వరలోనే రాబోతున్న ఈ డెస్టినీ 125 ఫేస్‌లిఫ్ట్‌లో కొత్త డిజైన్, అదిరిపోయే స్టైలింగ్‌తో తీసుకురానుంది.

సరికొత్తగా మార్కెట్‌లోకి..
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న డెస్టినీ స్కూటర్లలోని పలు సమస్యలకు హీరో చెక్‌ పెట్టనుంది. అందులో భాగంగా ముందుగా ఇప్పటి వరకు లేని సరికొత్త డిజైన్‌లో వీటిని ప్రవేశ పెట్టనుంది. ఈ కొత్త మోడల్‌ వెస్పా, లాంబ్రెట్టా స్కూటర్‌ల మాదిరిగా తక్కువ బాడీ ప్యానలింగ్‌తో తీసుకురానున్నారు. కొత్త డిజైన్‌ ప్రకారం రీ-డిజైన్‌లో భాగంగా లైట్ సెటప్, పొడవాటి టెయిల్‌లైట్స్‌, ఫ్రంట్ ఆప్రాన్ వంటి వాటిలో ప్రధాన డిజైన్ అప్‌డేట్‌లను కలిగి ఉండనుంది. ఫ్రంట్ ఫెండర్, హెడ్‌లైట్ కౌల్, రియర్‌వ్యూ మిర్రర్‌లలో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. వీటితో పాటు డ్యూయల్-టోన్ కలర్‌లో పెర్ల్ బ్లాక్ కలర్‌ స్టాండర్డ్‌గా రానుంది.

స్కూటర్ సైడ్ ప్రొఫైల్‌ విషయానికి వస్తే డ్యూయల్-టోన్ స్టెప్డ్ సీట్ ఉంటుంది. ఇది స్కూటర్‌కి సరికొత్త స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. లాంగ్ రైడ్‌లలో ఈ సీట్‌ సెటప్‌ అనువుగా ఉంటుంది. ఇక సైడ్ ప్యానెల్స్ మంచి ఎత్తులో తీసుకురానున్నారు. అక్కడే 3D 'డెస్టినీ' లోగోను కలిగి ఉంటుంది. ఎగ్జాస్ట్ పైప్ ప్రస్తుత మోడల్ కంటే కొత్త ఎగ్జాస్ట్ షీల్డ్‌ను పొందుతుంది.

టెక్నికల్‌ ఫీచర్లు
కొత్త హీరో డెస్టినీ 125 ఇంజిన్‌లో ఎటువంటి మార్పు ఉండక పోవచ్చు. ఇది 9bhp పవర్‌ని, 10.4nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బ్రేకింగ్ సిస్టమ్‌లో కూడా భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. త్వరలో ప్రవేశపెట్టే కొన్ని వేరియంట్‌లలో ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో రానుంది. అన్ని ప్రస్తుత మోడళ్లలో 130 mm డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బ్రేక్‌లు అప్‌డేట్‌ చేసే అవకాశం ఉంది. 

Also Read: రూ.ఆరు లక్షల్లోనే సెవెన్ సీటర్ కారు - పెద్ద ఫ్యామిలీకి బెస్ట్ ఆప్షన్!

సస్పెన్షన్ సెటప్ విషయానికి వస్తే ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌, వెనుకవైపు యూనిట్ స్ప్రింగ్-లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌ సెటప్‌తో రానుంది. ఈ డిజైన్‌లో తీసుకున్న రానున్న మార్పుల కారణంగా ఇప్పటికే ఉన్న డిజిటల్-అనలాగ్ సెటప్‌కి బదులుగా పూర్తి డిజిటల్ డిస్‌ప్లేతో కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తుంది. ఇక పిలియన్ రైడర్‌ల కోసం బ్యాక్‌రెస్ట్‌ని అందించనున్నారు. వెనుక వైపున స్లిమ్మర్ టెయిల్‌ల్యాంప్స్, ఇండికేటర్స్‌ రెట్రో టచ్‌ని అందించనున్నాయి. హీరో ప్రస్తుత 10-అంగుళాల వీల్స్‌కు బదులుగా పెద్ద 12-అంగుళాల చక్రాలను అందించే అవకాశం ఉంది. ఈ అప్‌డేట్స్‌తో మార్కెట్‌లోకి తీసుకురావడం ద్వారా ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షించేలా హీరో పక్కా ప్లాన్‌తో విడుదల చేయనుంది. ఈ స్కూటర్‌ హోండా యాక్టివా, టీవీఎస్‌ జూపిటర్లకు గట్టి పోటీని ఇవ్వనుంది. 

Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? - మీకు మంచి ఆప్షన్ ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అగ్నిపమాదంలో  ప్రాణాలు తీసిన తలుపులుపోసానికి తీవ్ర అస్వస్దత   ఇలా అయిపోయాడేంటి..?మేం సపోర్ట్ ఆపేస్తే రెండు వారాల్లో నువ్వు ఫినిష్-  అయినా సంతకం పెట్టను..Badrinath Avalanche Workers Trapped | మంచుచరియల కింద చిక్కుకుపోయిన 41మంది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ - సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి
Posani Heart Problem: పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
పోసాని ఛాతినొప్పి డ్రామా - తేల్చిన పోలీసులు
Crazxy Movie Review - 'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
'క్రేజీ' రివ్యూ అండ్ రేటింగ్: Tumbbad హీరో కొత్త సినిమా - థ్రిల్లింగ్ రైడ్!
SA Vs Eng Result Update: సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
సెమీస్ చేరిన సౌతాఫ్రికా.. ఇంగ్లాండ్ పై ఘ‌న‌విజ‌యం.. నాకౌట్ జ‌ట్ల ఖ‌రారు.. రేపు కీల‌క మ్యాచ్
AP Pensions: 5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
5 ఏళ్ల తరువాత ప్రజల్లో భయం పోయింది: జీడీ నెల్లూరులో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు
Tamannaah Bhatia: అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
అసలే పాలరాతి శిల్పం... ఆపై వైట్ డ్రస్... కుర్రకారు గుండెల్లో గుబులు రేపేలా తమన్నా
Rahul Dravid: ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
ఇంగ్లాండ్ లో ఇండియన్ టీమ్ ను సెకండ్ క్లాస్ మనుషుల్లా చూసేవారు: రాహుల్ ద్రవిడ్ వీడియో వైరల్
IPPB: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వివరాలు ఇలా
Embed widget