మారుతి సుజుకి వాగన్ ఆర్ భారతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కారు. కొత్త తరం మారుతి వ్యాగన్ ఆర్ 10 లక్షల సేల్స్ మార్కును దాటింది. 2019 జనవరిలో ఈ కారు మార్కెట్లో లాంచ్ అయింది. ఇది ఒక బడ్జెట్ కారు కాబట్టి వినియోగదారులు దీనిపై కాన్సన్‌ట్రేట్ చేశారు. ఇందులో సీఎన్‌జీ, పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. లాంచ్ అయిన 66 నెలలకు వాగన్ ఆర్ మిలియన్ మార్కును దాటింది. ఓవరాల్‌గా చూసుకుంటే 2023లో వాగన్ ఆర్ 30 లక్షల సేల్స్ మార్కును దాటింది. 1999లో వాగన్ ఆర్ మొదట మార్కెట్లో లాంచ్ అయింది. మూడో జనరేషన్ మోడల్లో సీఎన్‌జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. దీని కారణంగా సేల్స్ కూడా విపరీతంగా పెరిగాయి.