డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రోడ్డు యాక్సిడెంట్లలో ప్రతి యేటా కొన్ని వందల మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కాబట్టి మనం ట్రాఫిక్ రూల్స్ క్రమం తప్పకుండా పాటిస్తూ ఉండాలి. మీరు స్కూల్ కానీ, హాస్పిటల్ కానీ ఉండే ప్రాంతాల్లో వాహనాన్ని నిదానంగా నడపాలి. యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రూల్ పెట్టారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ కూడా అస్సలు ఉపయోగించకూడదు. సిగ్నల్ దాటేటప్పుడు జీబ్రా క్రాసింగ్ దాటి వాహనాలు ముందుకు పోకూడదు. వీటిలో మీరు ఏదైనా రూల్ బ్రేక్ చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ అవుతుంది. కారులో మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా పెట్టినా అది రూల్ బ్రేక్ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే మ్యూజిక్ ఎక్కువగా పెడితే అది పక్కన డ్రైవర్లను డిస్టర్బ్ చేసే అవకాశం అవుతుంది.