కారులో ఏసీ గంట నడవాలంటే ఎంత పెట్రోల్ అవుతుందో తెలుసా? ఏసీ ఆన్‌లో ఉంటే పెట్రోలు వినియోగం పెరుగుతుంది. ఒక గంట ఏసీ ఆన్‌లో ఉంటే కారులో ఎంత పెట్రోల్ ఖర్చు అవుతుందో చాలా మందికి తెలీదు. అయితే అది కారు మోడల్, ఇంజన్ కెపాసిటీ, సామర్థ్యం మీద ఆధారపడి ఉంటాయి. పెద్ద ఇంజిన్ ఉన్న కార్లలో ఏసీ వేస్తే ఎక్కువ పెట్రోలు అవుతుంది. చిన్న కార్లలో గంట ఏసీ వేస్తే 0.2 నుంచి 0.4 లీటర్ల పెట్రోలు లాగేస్తుంది. అదే పెద్ద కార్లలో అయితే 0.5 నుంచి 0.7 లీటర్ల వరకు అవుతుంది. కారు ఆగినప్పుడు ఏసీ వేస్తే పెట్రోలు వినియోగం మరింత ఎక్కువ అవుతుంది. ఏసీ టెంపరేచర్‌ను మరీ తక్కువగా పెట్టినా ఇలా అవుతూ ఉంటుంది. కారు ఇంజిన్ పాతది అయినా ఏసీకి ఎక్కువ పెట్రోలు అవుతుంది.