పాకిస్తాన్ ద్రవ్యోల్బణం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటూ వస్తుంది. మారుతి సుజుకి ఆల్టో కే10 కారు ధర పాకిస్తాన్‌లో ఎంత ఉంటుందో తెలుసా? మనదేశంలో ఈ కారు ధర రూ.4.75 లక్షల నుంచి ప్రారంభం కానుంది. ఇది మారుతి సుజుకి ఆల్టో కే10 ఎక్స్ షోరూం ధర. పాకిస్తాన్ రూపాయల్లో చూసుకుంటే దీని ధర చాలా ఎక్కువగా ఉండనుంది. మారుతి సుజుకి ఆల్టో వీఎక్స్ ధర 23.31 లక్షల పాకిస్తాన్ రూపాయలుగా ఉంది. ఇందులో వీఎక్స్ఆర్ వేరియంట్ ధర 27 లక్షల పాకిస్తాన్ రూపాయలుగా ఉంది. ఇక వీఎక్స్ఆర్ ఏజీయస్ వేరియంట్ ధర 28.94 లక్షల పాకిస్తాన్ రూపాయలుగా ఉంది. వీఎక్స్ఎల్ ఏజీయస్ వేరియంట్ ధర 30.45 లక్షల పాకిస్తాన్ రూపాయలుగా ఉంది. మొత్తంగా పాకిస్తాన్‌లో ఆల్టో కొనాలంటే అక్కడి కరెన్సీలో 30 లక్షల పైనే పెట్టాలన్న మాట.