ఈ ఫార్ట్యూనర్‌పై బాంబులేసినా పేలదు! బ్రెజిల్‌లో టయోటా ఫార్ట్యూనర్ బుల్లెట్ ప్రూఫ్ వెర్షన్ లాంచ్ అయింది. అవలాన్, కార్బన్, ఎవల్యూషన్ బ్లిండిజెన్స్, పర్వి బ్లిండాడోస్‌తో కంపెనీ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది. కొత్త, పాత రెండు మోడల్స్‌లోనూ వినియోగదారులకు బుల్లెట్ ప్రూఫ్ మోడల్స్ అందుబాటులో ఉంటాయి. దీని కోసం వాహనాన్ని కొన్ని వినియోగదారులు ఆర్మరింగ్ కంపెనీకి పంపాల్సి ఉంటుంది. వాహనం బాడీ వర్క్‌ను బుల్లెట్ ప్రూఫ్ ప్రాసెస్ మరింత బలంగా మార్చనుంది. ఈ అప్‌గ్రేడ్‌కు ఎంత ఖర్చవుతుందో కంపెనీ తెలపలేదు. కారును కొన్నాక బుల్లెట్ ప్రూఫ్‌గా మార్చడానికి 30 రోజులు పడుతుంది. ఆర్మరింగ్ కంపెనీని ఎంచుకున్నాక వినియోగదారులకు డెలివరీ డేట్ ఇస్తారు. అయితే ఈ అప్‌గ్రేడ్ తర్వాత వాహనం పెర్ఫార్మెన్స్‌లో మార్పు వచ్చిందని వినియోగదారులు అంటున్నారు.