News
News
వీడియోలు ఆటలు
X

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కు గుడ్‌న్యూస్ - త్వరలో ఐదు కొత్త మోడల్స్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ మనదేశంలో కొత్త మోడళ్లను త్వరలో లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

FOLLOW US: 
Share:

Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ భారత మార్కెట్లో తన కొత్త మోడళ్లను నిరంతరం ప్రవేశపెడుతోంది. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగుతుంది. భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాబోయే కొద్ది నెలల్లో అనేక కొత్త బైక్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.

కొత్త  రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన కొత్త తరం బుల్లెట్ 350 బైక్‌ను ఈ ఏడాది విడుదల చేయనుంది. కంపెనీకి చెందిన అత్యంత చవకైన మోటార్‌సైకిల్ ఇదే. ఇది రాయల్ ఎన్‌ఫీల్డ్ జే-సిరీస్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. మీటోర్, హంటర్, కొత్త-జెన్ క్లాసిక్‌లతో సహా ఇతర 350 సీసీ బైక్‌లను కూడా ఇదే ప్లాట్‌ఫారంపై రూపొందించారు. ఈ బైక్‌లో 349సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్ ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450
హిమాలయన్ 450 భారతదేశంలో అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న అడ్వెంచర్ బైక్‌లలో ఒకటి. ఈ బైక్ రోడ్ టెస్టింగ్‌లో ఇప్పటికే చాలా సార్లు కనిపించింది. ఇది ప్రస్తుత హిమాలయన్ కంటే శక్తివంతమైన ఇంజన్లు, ఫీచర్లను పొందుతుంది. ఇది 450 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 40 బీహెచ్‌పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది యూఎస్‌డీ ఫ్రంట్ ఫోర్క్స్, 21 అంగుళాల ఫ్రంట్, 18 అంగుళాల రియర్ వైర్ స్పోక్ వీల్స్‌ను పొందుతుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 సీసీ రోడ్‌స్టర్
ఇది హిమాలయన్ 450 ఆధారంగా రోడ్-బియాస్డ్ నేక్డ్ స్ట్రీట్ మోటార్‌సైకిల్ అవుతుంది. 450 సీసీ హిమాలయన్‌కు ఇది ట్వీక్డ్ వెర్షన్. ఇది తక్కువ సీటు ఎత్తు, ట్యూబ్‌లెస్ టైర్‌లతో కూడిన అల్లాయ్ వీల్స్, అనేక ఇతర అప్‌డేట్‌లను పొందే అవకాశం ఉంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన షాట్‌గన్ 650ని బాబర్ కాన్సెప్ట్‌గా EICMA 2021లో డిస్‌ప్లే చేసింది. కంపెనీ చాలా కాలంగా భారతదేశంలో దీనిని పరీక్షిస్తుంది. ఇది బాబర్ తరహా క్రూయిజర్ మోటార్‌సైకిల్‌గా ఉండే అవకాశం ఉంది. ఇది మీటోర్ 650 పవర్‌ట్రైన్‌ను పొందుతుంది. ఇది భారతదేశంలో కంపెనీకి సంబంధించిన అత్యంత ప్రీమియం బైక్.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కాంటినెంటల్ జీటీ 650
రాయల్ ఎన్‌ఫీల్డ్ కూడా పూర్తిగా ఫెయిర్డ్ కాంటినెంటల్ GT 650ని తీసుకురావడానికి సిద్ధం అవుతోంది. కంపెనీ దీనిని ఇంకా ధృవీకరించనప్పటికీ రేస్ స్పెక్ సెమీఫెయిర్డ్ కాంటినెంటల్ జీటీ 650 త్వరలో రానుందని చెప్పవచ్చు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ 2023 మార్చికి సంబంధించి తన విక్రయాల నివేదికను విడుదల చేసింది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 72,235 మోటార్‌సైకిళ్లను విక్రయించింది. మార్చి 2022లో కంపెనీ మొత్తం 67,677 యూనిట్లను విక్రయించింది. అంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు వార్షిక ప్రాతిపదికన ఏడు శాతం పెరిగాయన్న మాట.

2022-23 ఆర్థిక సంవత్సరంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ మొత్తం 8,34,895 మోటార్‌సైకిళ్ల అమ్మకాలను నమోదు చేసింది. ఇది కంపెనీకి అత్యధిక విక్రయాలు. ఈ సంఖ్య 2021-22 కంటే 39% ఎక్కువ. కంపెనీ 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొదటిసారిగా 1,00,000 వాహనాలను ఎగుమతి చేసింది. ఇది 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే కంటే 23 శాతం ఎక్కువ. అదే సమయంలో, కంపెనీ దేశీయ మార్కెట్లో గత సంవత్సరంతో పోలిస్తే 41 శాతం పెరుగుదలతో 7,34,840 యూనిట్లను విక్రయించింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన చవకైన బైక్ హంటర్ 350ని గత సంవత్సరం ఆగస్టులో రూ. 1.5 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ధర విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న మోటార్‌సైకిళ్లలో ఒకటిగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నిలిచింది.

Published at : 12 May 2023 03:16 PM (IST) Tags: Royal Enfield Auto News Automobiles Upcoming Royal Enfield Bikes

సంబంధిత కథనాలు

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Upcoming Cars: రూ.10 లక్షలలోపు లాంచ్ కానున్న లేటెస్ట్ కార్లు ఇవే - కొత్త కారు కొనాలనుకుంటే కొంచెం ఆగండి!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Top 5 160 CC Bikes: బెస్ట్ 160 సీసీ బైక్ కొనాలనుకుంటున్నారా - ఈ ఐదు ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని టాప్-5 కార్ కలెక్షన్ - ఆర్మీ స్పెషల్ కారు కూడా గ్యారేజ్‌లో!

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

Luna moped EV: లూనా మోపెడ్ మళ్లీ వచ్చేస్తోంది, దీనికి పెట్రోల్ అక్కర్లేదు - గుడ్‌న్యూస్ చెప్పిన కైనెటిక్ CEO

టాప్ స్టోరీస్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

Telugu Indian Idol 2 Winner : అమ్మకు 'ఆహా' తెలుగు ఇండియన్ ఐడల్ 2 కిరీటం - విజేతను ప్రకటించిన అల్లు అర్జున్

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

KCR In Nirmal: నిర్మల్ జిల్లాకు సీఎం కేసీఆర్ వ‌రాలు- ఒక్కో మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, ఒక్కో పంచాయతీకి రూ.10 లక్షలు

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Coromandel Express Accident: మృతుల సంఖ్య 288 కాదు, 275 - రెండు సార్లు లెక్కపెట్టడం వల్లే కన్‌ఫ్యూజన్

Tom Holland on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!

Tom Holland  on RRR: స్పైడర్ మ్యాన్ కూడా 'ఆర్ఆర్ఆర్' అభిమానే, సినిమా అద్భుతం అంటూ ప్రశంసలు!