Upcoming Compact SUVs in India: నెక్సాన్, బ్రెజాలకు కొత్త పోటీ - త్వరలో మార్కెట్లోకి ఐదు కొత్త ఎస్‌యూవీలు!
Upcoming Subcompact SUVs in India: త్వరలో మార్కెట్లోకి ఐదు కొత్త సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీలు ఎంట్రీ ఇవ్వనున్నాయి.
Upcoming SUVs in India: సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం టాటా నెక్సాన్, మారుతి బ్రెజా ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెక్సాన్ చాలా ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. బ్రెజ్జా కేవలం పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్ కూడా ఈ విభాగంలో మంచి పనితీరును కనబరుస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఈ కార్లకు పోటీగా రానున్న కొన్ని కొత్త మోడళ్ల గురించి తెలుసుకుందాం.
మహీంద్రా ఎక్స్‌యూవీ300 ఫేస్‌లిఫ్ట్ (Mahindra XUV300 Facelift)
మహీంద్రా దేశంలో తన సబ్ 4 మీటర్ ఎస్‌యూవీ అయిన ఎక్స్‌యూవీ300కి ప్రధాన అప్‌డేట్‌ను అందించడానికి సిద్ధంగా ఉంది. అప్‌డేట్ చేసిన మోడల్ ప్రత్యేక డిజైన్ అప్‌డేట్‌లతో కూడిన కొత్త క్యాబిన్, సెగ్మెంట్ ఫస్ట్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందుతుంది. కొత్త మోడల్ రాబోయే బీఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రేంజ్‌లో కనిపించనున్న స్టైలింగ్ ఆప్షన్లతో వస్తుంది. ఇందులో 1.5 లీటర్ డీజిల్, 1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.2 లీటర్ డైరెక్ట్ ఇంజెక్షన్ టర్బో పెట్రోల్ ఇంజిన్లు ఉండనున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కూడా ఇవే ఇంజన్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
కొత్త స్కోడా కాంపాక్ట్ ఎస్‌యూవీ (New Skoda Compact SUV)
స్కోడా ఒక కొత్త సబ్ 4 మీటర్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. ఇది 2025 ప్రారంభంలో భారతీయ మార్కెట్లో విడుదల కానుంది. కొత్త చిన్న ఎస్‌యూవీని అప్‌డేట్ చేసిన ఎంక్యూబీ ఏవో ఐఎన్ ప్లాట్‌ఫారమ్‌పై రూపొందించనున్నారు. ఇది స్లావియా, టైగన్, వర్టస్‌ల్లో కూడా ఉపయోగించనున్నారు. కొత్త ఎస్‌యూవీ మాన్యువల్, టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన 1.0 లీటర్ 3 సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది.
నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ (Nissan Magnite Facelift)
నిస్సాన్ 2024లో దేశంలో ఫేస్‌లిఫ్టెడ్ మాగ్నైట్ సబ్ 4 మీటర్ ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. కొత్త మోడల్ డిజైన్ మార్పుల్లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండనున్నాయి. ఇవి మరింత ఫీచర్ లోడెడ్ క్యాబిన్‌ను అందించనున్నాయి. ఈ ఎస్‌యూవీ ఇప్పటికే ఉన్న ఇంజన్ ఆప్షన్లు 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
కొత్త రెనో కిగర్ (New Renault Kiger)
రెనో కొత్త తరం క్విడ్, కిగర్, ట్రైబర్‌లను లాంచ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మోడల్ కొత్త మోడల్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌తో కొత్త ఇంటీరియర్‌ను పొందుతుంది. ఇది 1.0 లీటర్ నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్, 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో మార్కెట్లోకి రానుంది.
కొత్త హోండా కాంపాక్ట్ ఎస్‌యూవీ (New Honda Compact SUV)
కొత్త ఎలివేట్ విజయం సాధించిన తర్వాత హోండా ఒక సరికొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త మోడల్ న్యూ జెన్ డబ్ల్యూఆర్-వీ కావచ్చని సమాచారం. ఈ కొత్త కాంపాక్ట్ ఎస్‌యూవీ 1.2 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్‌తో సహా మరిన్ని ఇంజిన్ ఆప్షన్లతో మార్కెట్లోకి రానుంది.