![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Bajaj Chetak Electric Scooter: కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో - ఫీచర్లు ఇలా?
కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ జనవరి 9వ తేదీన లాంచ్ కానుంది.
![Bajaj Chetak Electric Scooter: కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో - ఫీచర్లు ఇలా? Upcoming Bajaj Chetak Electric Scooter To Be Launched on January 9th Check Details Bajaj Chetak Electric Scooter: కొత్త బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ త్వరలో - ఫీచర్లు ఇలా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/02/5032121877bf1a3fa8d891473e0982011701535779744614_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Upcoming Bajaj Chetak Electric Scooter: బజాజ్ ఆటో తను అప్‌డేట్ చేసిన బజాజ్ చేతక్‌ను కొత్త సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయడానికి సిద్ధం అయింది. ఇది జనవరి 9వ తేదీన మార్కెట్లోకి రానుంది. ఈ స్కూటర్‌లో డిజైన్, మెకానికల్ ఛేంజెస్ ఉండనున్నాయి. కొత్త టెక్నాలజీతో ఈ ఎలక్ట్రిక్ కారు మార్కెట్లోకి రానుంది. ఇటీవల కంపెనీ తన బజాజ్ చేతక్ అర్బన్ 2024ని పరిచయం చేసింది. ఇప్పుడు రాబోయే ఎలక్ట్రిక్ స్కూటర్ దీని కంటే ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో అమర్చబడుతుంది.
బ్యాటరీ, రేంజ్ ఇలా...
బజాజ్ చేతక్ అర్బన్ 2024 ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక పెద్ద 3.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చింది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 127 కిలోమీటర్ల రేంజ్‌ను అందించగలదు. ఇప్పుడు రానున్న కొత్త స్కూటర్ 2.88 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇది ప్రస్తుతం ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 113 కిలోమీటర్ల రేంజ్‌ను పరిధిని అందించనుందని తెలుస్తోంది. అదే సమయంలో కొత్త బ్యాటరీని 0 నుంచి 100 శాతం వరకు పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాల వరకు పట్టవచ్చు.
పనితీరు గురించి చెప్పాలంటే 2024 బజాజ్ చేతక్ గంటకు 73 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌ను పొందగలదని తెలుస్తోంది. ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్‌లో గంటలకు 63 కిలోమీటర్ల వేగాన్ని అందిస్తుంది. ప్రస్తుత అప్‌డేట్‌లో ఇప్పటికే ఉన్న రౌండ్ ఎల్సీడీ యూనిట్ స్థానంలో కొత్త టీఎఫ్‌టీ స్క్రీన్ అందించనున్నారు.
ఫీచర్లు ఎలా ఉన్నాయి?
ఇది టర్న్ బై టర్న్ నావిగేషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రిమోట్ లాక్/అన్‌లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇది మాత్రమే కాకుండా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీని 18 లీటర్ల నుంచి 21 లీటర్లకు పెంచవచ్చు.
వీటితో పోటీ?
దేశీయ విపణిలో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీ పడుతున్న వాటిలో ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్లు ఉన్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. *T&C Apply
Also Read: 2024 జనవరిలోనే లాంచ్ కానున్న టాప్ కార్లు ఇవే - కొనాలంటే కాస్త వెయిట్ చేయండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)