అన్వేషించండి

EV Home Charging Tips: ఇంట్లోనే ఈవీ ఛార్జింగ్ సెటప్.. ఫస్ట్ టైమ్ బయ్యర్స్ కోసం క్రేజీ టిప్స్! సేఫ్టీగా ఇన్‌స్టాల్ చేయడం ఎలా?

ఎలక్ట్రిక్ వాహనాల హోమ్ ఛార్జింగ్ ఇన్‌స్టాలేషన్ కోసం కావాల్సిన పవర్ కెపాసిటీ, ఎర్తింగ్ ప్రాముఖ్యత, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం .

EV Home Charging Requirements Safety Tips: ఇండియాలో ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ హవా నడుస్తోంది. పెట్రోల్ కొట్టించడానికి బంకుల దగ్గర లైన్లో నిలబడే అవసరం లేకుండా, రాత్రిపూట ఫోన్ లాగే కారును కూడా ఛార్జింగ్ పెట్టుకోవడం చాలామందికి నచ్చుతోంది. అయితే కొత్తగా ఈవీ కొనేవారికి వచ్చే మొదటి డౌట్.. "ఇంట్లో ఛార్జర్ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి?" అనేది. పబ్లిక్ ఛార్జర్లు పెరుగుతున్నా కూడా, 80 శాతం ఛార్జింగ్ మన ఇంట్లోనే జరుగుతుంది. అందుకే హోమ్ ఛార్జింగ్ సెటప్ గురించి కొన్ని బేసిక్ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.

రెండు రకాల ఛార్జింగ్ ఆప్షన్లు..
సాధారణంగా ఈవీ కొన్నప్పుడు కంపెనీలు రెండు రకాల ఛార్జర్లను ఇస్తాయి. ఒకటి పోర్టబుల్ ఛార్జర్. దీన్ని మన ఇంట్లోని 15A సాకెట్‌కు డైరెక్ట్‌గా కనెక్ట్ చేయవచ్చు. ఇది వాడటం ఈజీనే కానీ ఛార్జింగ్ చాలా స్లోగా ఎక్కుతుంది. ఫుల్ బ్యాటరీ కావడానికి దాదాపు 8 నుండి 15 గంటల టైమ్ పడుతుంది. ఇక రెండోది వాల్-మౌంటెడ్ ఏసీ ఛార్జర్. దీన్ని మీ పార్కింగ్ ఏరియాలో గోడకు ఫిక్స్ చేస్తారు. దీనివల్ల 4 నుండి 8 గంటల్లోనే కారు ఫుల్ ఛార్జ్ అవుతుంది.

ఇన్‌స్టాలేషన్ కోసం కావాల్సినవి..
హోమ్ ఛార్జర్ పెట్టాలంటే ముందుగా మీ ఇంట్లో పవర్ లోడ్ కెపాసిటీని చెక్ చేసుకోవాలి. 3.3kW ఛార్జర్ల కోసం సింగిల్ ఫేజ్ కనెక్షన్ సరిపోతుంది. ఒకవేళ మీరు 7kW లాంటి ఫాస్ట్ ఛార్జర్లు వాడాలంటే మాత్రం త్రీ-ఫేజ్ కనెక్షన్ తీసుకోవడం మంచిది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం 'ఎర్తింగ్'. ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్‌కు స్ట్రాంగ్ ఎర్తింగ్ లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛార్జర్ కోసం ఒక సపరేట్ సర్క్యూట్, అలాగే ఒక ఎంసీబీ (MCB) స్విచ్ ఉండటం వల్ల ఇతర గృహోపకరణాల మీద లోడ్ పడదు.

చేయాల్సినవి (Dos)..
ఎప్పుడూ కంపెనీ అప్రూవ్ చేసిన టెక్నీషియన్ల ద్వారానే ఇన్‌స్టాలేషన్ చేయించుకోండి. ఛార్జర్‌ను మీ కారు పార్కింగ్ స్లాట్‌కు వీలైనంత దగ్గరగా ఉండేలా చూసుకోండి. వైర్లను మరీ ఎక్కువగా లాగడం వల్ల డ్యామేజ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఛార్జర్‌ను ఎండ, వాన తగలకుండా షెడ్డు కింద ఉంచడం వల్ల ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. స్మార్ట్ ఛార్జింగ్ యాప్స్ వాడటం వల్ల ఎంత కరెంటు ఖర్చు అవుతుందో కూడా ట్రాక్ చేయవచ్చు.

చేయకూడనివి (Don'ts)..
చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్.. రెగ్యులర్ ఎక్స్‌టెన్షన్ వైర్లను వాడటం. ఇవి ఈవీ ఛార్జింగ్ లోడ్‌ను తట్టుకోలేక కాలిపోయే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో ఏసీ, గీజర్ లాంటి హెవీ అప్లయన్స్ ఆన్ చేసినప్పుడు ఛార్జింగ్ స్పీడ్ తగ్గకుండా చూసుకోవాలి. అలాగే ఏదైనా ప్రాబ్లం వస్తే సొంతంగా రిపేర్ చేయడానికి ట్రై చేయకండి.

అపార్ట్‌మెంట్లలో ఉండేవారికి సూచనలు..
అపార్ట్‌మెంట్లలో ఉండేవారు ముందుగా తమ హౌసింగ్ సొసైటీ పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లలో ఛార్జర్లు పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంది. మీ ఓన్ మీటర్ నుండి లేదా సపరేట్ సబ్-మీటర్ ద్వారా కనెక్షన్ తీసుకోవచ్చు.

ఖర్చు ఎంత అవుతుంది?
చాలా కంపెనీలు కారుతో పాటే ఛార్జర్‌ను ఫ్రీగా ఇస్తాయి. కాకపోతే మీ మీటర్ నుండి పార్కింగ్ స్లాట్ వరకు వైరింగ్ దూరం ఎక్కువగా ఉంటే అదనపు ఖర్చు అవుతుంది. ఇండియాలో బేసిక్ ఇన్‌స్టాలేషన్ ఖర్చు రూ. 5,000 నుండి రూ. 25,000 వరకు ఉండవచ్చు. ఒకసారి సెటప్ పూర్తయితే, పెట్రోల్ ఖర్చుతో పోలిస్తే ఈవీ ఛార్జింగ్ చాలా చీప్ అని చెప్పవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
ట్రయంఫ్ ట్రాకర్ 400 పెర్ఫార్మెన్స్‌ టెస్ట్.. యాక్సిలరేషన్‌, బ్రేకింగ్ వ్యవస్థల నిజమైన పనితీరు ఇదే!
100 కి.మీ. వేగం 7.55 సెకన్లలోనే.. Triumph Tracker 400 సూపర్‌ పెర్ఫార్మెన్స్‌!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
తక్కువ ధరకే టాటా ఎలక్ట్రిక్ కార్లు.. BaaSతో దిగొచ్చిన ధరలు, పూర్తి లెక్క ఇదిగో
టాటా EVలపై భారీ తగ్గింపు.. కొత్త స్కీమ్‌తో రూ.7.30 లక్షల వరకు ఆదా!

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget