అన్వేషించండి

2026 TVS Apache RTR 160 4V: అపాచీ RTR 160 4V అదిరిపోయే అప్‌డేట్ – బడ్జెట్ ధరలో లగ్జరీ ఫీచర్లు!

టీవీఎస్ మోటార్ కంపెనీ తన పాపులర్ అపాచీ RTR 160 4V మోడల్‌ను సరికొత్త ఫీచర్లు, వేరియంట్లతో విడుదల చేసింది. కేవలం రూ. 1.25 లక్షల ప్రారంభ ధరతో ఇది అందుబాటులో ఉంది.

2026 TVS Apache RTR 160 4V News: ఇండియ‌న్ టూ వీలర్ మార్కెట్లో అత్యంత ఆదరణ కలిగిన స్పోర్టీ బైక్ టీవీఎస్ అపాచీ RTR 160 4V ఇప్పుడు సరికొత్త అవతారంలో మెరవనుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ 2026 ఎడిషన్‌ను అప్‌డేట్ చేసిన ఫీచర్లు, కొత్త వేరియంట్లతో లాంచ్ చేసింది. గతంలో కేవలం టాప్ వేరియంట్లకే పరిమితమైన కొన్ని ప్రీమియం ఫీచర్లను ఇప్పుడు బేస్ మోడల్ నుండే అందుబాటులోకి తీసుకురావడం విశేషంగా విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. ఈ అప్‌డేటెడ్ బైక్ ప్రారంభ ధర రూ. 1.25 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలై టాప్ ఎండ్ వెర్షన్ రూ. 1.37 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. తాజాగా ఈ బైక్ లాంచ్ తో ఒక్కసారిగా బైక్ మార్కెట్ ఫోకస్ అంతా టీవీఎస్ కంపెనీపైకి నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

కొత్త ఫీచర్లు.. వేరియంట్లు
2026 మోడల్ అపాచీలో క్లాస్-డి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ తో పాటు ఎల్‌ఈడీ డీఆర్ఎల్స్ (DRLs) జత చేశారు. దీనివల్ల రాత్రి ప్రయాణాల్లో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే లైనప్ మొత్తంలో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్‌ను స్టాండర్డ్ ఫీచర్‌గా అందించారు. ప్రస్తుతం ఈ బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎంట్రీ లెవల్ వెర్షన్‌లో సింగిల్ ఛానల్ ఏబీఎస్, టెలిస్కోపిక్ ఫోర్క్స్, డిజిటల్ ఎల్‌సీడీ క్లస్టర్ ఉంటాయి.

మిడ్-స్పెక్.. టాప్-ఎండ్ వెర్షన్లు
మిడ్-స్పెక్ వేరియంట్ ధర రూ. 1.31 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, యూఎస్‌డీ (USD) ఫోర్క్స్ ఉండటంతో పాటు అడ్జస్టబుల్ లీవర్లు లభిస్తాయి. ఇది మ్యాట్ బ్లాక్, గ్రానైట్ గ్రే, పెర్ల్ వైట్ రంగులలో అందుబాటులో ఉంది. ఇక టాప్-ఎండ్ వెర్షన్ రూ. 1.37 లక్షల ధరకు లభిస్తుంది. ఇందులో 5-అంగుళాల టీఎఫ్‌టీ (TFT) స్క్రీన్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఈ ప్రీమియం వెర్షన్ మ్యాట్ బ్లాక్, రేసింగ్ రెడ్, మెరైన్ బ్లూ రంగులలో కస్టమర్లను ఆకట్టుకోనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇంజిన్ పెర్ఫార్మెన్స్
మెకానికల్ పరంగా చూస్తే, ఇందులో పాత 159.7 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ కొనసాగుతుంది. రైడర్ సౌకర్యం కోసం స్పోర్ట్, అర్బన్, రెయిన్ అనే మూడు రైడింగ్ మోడ్స్ ఇచ్చారు. స్పోర్ట్ మోడ్‌లో ఇంజిన్ 17.6 హెచ్‌పి పవర్, 14.73 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అర్బన్, రెయిన్ మోడ్స్‌లో పవర్ అవుట్‌పుట్ 15.6 హెచ్‌పికి, టార్క్ 14.1 ఎన్ఎమ్ కి తగ్గుతుంది. ఈ మార్పుల వల్ల తక్కువ ధరలోనే కస్టమర్లకు ఎక్కువ ఫీచర్లు అందుబాటులోకి వచ్చినట్లయింది. ముఖ్యంగా నైట్ రైడింగ్ చేసే వారికి కొత్త హెడ్‌ల్యాంప్ సెటప్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఈ కొత్త వెర్షన్ తో టీవీఎస్ అభిమానులు స్ట్పోర్ట్ లుక్ తో కూడిన బైక్ ను సొంతం చేసుకోవచ్చని అంటున్నారు. తాజాగా ఈ బైక్ మార్కెట్లోకి రావడంతో బైక్ మార్కెట్ లో మరింత పోటీ పెరగనుందని నిపుణులు పేర్కొంటున్నారు. సరసమైన ధర, అద్భుతమైన ఫీచర్లతో ఈ బైక్.. బైక్ లవర్ల మదిని దోచుకునే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget