టీవీఎస్ రోనిన్‌లో నాలుగు వేరియంట్లు.. మీ బడ్జెట్‌కు ఏది సరిపోతుందో తెలుసుకోండి!
టీవీఎస్ రోనిన్ ఇప్పుడు నాలుగు వేరియంట్లలో లభిస్తోంది. బేస్, బేస్+, మిడ్ & టాప్ వేరియంట్ల ధరలు, ఫీచర్లు ఇవే.

TVS Ronin Price, Mileage And Features Telugu: టీవీఎస్ రోనిన్ 200-250cc విభాగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటోంది. ఇటీవల ఈ బైక్ విక్రయాలు కూడా పెరుగుతున్నాయి. ఏడాది ప్రాతిపదికన త్రైమాసిక అమ్మకాలు దాదాపు రెట్టింపు అయ్యాయి. దీంతో రోనిన్ సిరీస్‌ను టీవీఎస్ మరింత ఆకర్షణీయంగా మార్చింది.
తాజాగా రోనిన్‌లో కొత్త బేస్+ వేరియంట్‌ను తీసుకొచ్చింది. ఇతర వేరియంట్లలోనూ కొన్ని ఫీచర్లను మార్చింది. ప్రస్తుతం ఈ బైక్ Base, Base+, Mid & Top అనే నాలుగు వేరియంట్లలో లభిస్తోంది.
అన్ని వేరియంట్లలో ఒకే ఇంజిన్ ఉంటుంది. 225.9cc సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 20.4 హెచ్‌పీ శక్తిని & 19.9 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్ల మధ్య ప్రధాన తేడాలు.. బ్రేకింగ్ వ్యవస్థ, ఫీచర్లు & రంగుల విషయంలోనే ఉంటాయి.
బేస్ వేరియంట్
రోనిన్ సిరీస్‌లో బేస్ వేరియంట్ ప్రారంభ మోడల్. ఇందులో సింగిల్ ఛానల్ ABS ఉంటుంది. రైన్ & అర్బన్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. దీని కర్బ్ బరువు 159 కిలోలు. మిగతా వేరియంట్ల కంటే ఇది ఒక కిలో తక్కువ.
ఆల్-LED లైట్లు & అసిమెట్రిక్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఉన్నాయి. అయితే స్మార్ట్‌ఎక్స్‌కనెక్ట్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్ & కాల్ అలర్ట్స్ లేవు. దీని ధర రూ.1.30 లక్షలుగా ఉంది.
బేస్+ వేరియంట్
బేస్+ వేరియంట్‌ను టీవీఎస్ కొత్తగా తీసుకొచ్చింది. ఇది బేస్ & మిడ్ వేరియంట్ల మధ్య ఉంటుంది. దీని ధర రూ.1.42 లక్షలు.
ఈ వేరియంట్‌లో సింగిల్ ఛానల్ ABSకు బదులుగా డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. రెండు కొత్త రంగుల ఎంపికలు కూడా ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSతో లభించే అత్యంత అందుబాటు రోనిన్ వేరియంట్ ఇదే.
ఇది కూడా చదవండి: యూత్ కోసం BMW నుంచి మరో కొత్త మోటార్‌సైకిల్ F 450 R.. ధర ఎంతంటే?
మిడ్ వేరియంట్
మిడ్ వేరియంట్ ధర రూ.1.51 లక్షలు. బేస్+తో పోలిస్తే ఇందులో మరిన్ని ఫీచర్లు ఉన్నాయి. టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, SmartXonnect ఇన్‌స్ట్రుమెంటేషన్ & గోల్డ్ ఫినిష్ యూఎస్‌డి ఫోర్క్‌లు లభిస్తాయి.
డ్యూయల్ ఛానల్ ABS కొనసాగుతుంది. రైన్ & అర్బన్ రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి.
టాప్ వేరియంట్
రోనిన్ సిరీస్‌లో టాప్ వేరియంట్ ధర రూ.1.63 లక్షలు. మిడ్ వేరియంట్‌లోని ఫీచర్లతో పాటు మరికొన్ని అదనపు సదుపాయాలు ఇందులో ఉన్నాయి.
ట్రాక్షన్ కంట్రోల్, ప్రీమియం సీటు & అడ్జస్టబుల్ లివర్లు లభిస్తాయి. SmartXonnect కూడా ఉంటుంది. టీవీఎస్ కనెక్ట్ యాప్ ద్వారా వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ETA, ఇన్‌కమింగ్ కాల్ అలర్ట్స్ & రైడ్ అనాలిసిస్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉంటాయి.
మొత్తంగా చూస్తే.. టీవీఎస్ రోనిన్ నాలుగు వేరియంట్లతో విభిన్న అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉంది. తక్కువ ధరలో రోనిన్ కావాలనుకునేవారికి బేస్ వేరియంట్ ఉంది. డ్యూయల్ ఛానల్ ABS కావాలనుకునేవారికి బేస్+ ఉపయోగపడుతుంది. మరిన్ని కనెక్టివిటీ ఫీచర్లు కోరుకునేవారికి మిడ్ వేరియంట్ ఉంది. పూర్తి స్థాయి ఫీచర్లు కావాలనుకునేవారికి టాప్ వేరియంట్ అందుబాటులో ఉంది.
ఈ కథనంలో పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ధరలు.
ఇది కూడా చదవండి: సరికొత్తగా వచ్చిన Mahindra Thar OG.. అయినా ఈ 9 ఫీచర్లు మిస్సింగ్!
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















