అన్వేషించండి

సరికొత్తగా వచ్చిన Mahindra Thar OG.. అయినా ఈ 9 ఫీచర్లు మిస్సింగ్‌!

మహీంద్రా థార్ OGలో ఎన్నో కొత్త ఫీచర్లు వచ్చాయి. అయితే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరా, ADAS సహా 9 ఫీచర్లు ఇంకా లేవు.

Mahindra Thar OG Price, Mileage And Features Telugu: మహీంద్రా థార్ అంటేనే ప్రత్యేకమైన ఆఫ్‌రోడ్ SUV. ఈ వాహనం మొదటి నుంచి లగ్జరీ కంటే ఆఫ్‌రోడ్ సామర్థ్యానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 2020లో వచ్చిన రెండో తరం థార్ కూడా ఇదే విధానాన్ని కొనసాగించింది. తాజాగా మహీంద్రా మరోసారి థార్‌ను అప్‌డేట్ చేసింది. కొత్త మోడల్‌కు థార్ OG అనే పేరు పెట్టింది.

థార్ OGలో కొత్త ఫీచర్లు, మెరుగైన సాంకేతికతను తీసుకొచ్చారు. డిజైన్‌లోనూ మార్పులు చేశారు. అయినప్పటికీ ఆధునిక ఎస్‌యూవీల్లో సాధారణంగా కనిపిస్తున్న కొన్ని ఫీచర్లు థార్ OGలో ఇంకా అందుబాటులో లేవు. అవేంటంటే..

1. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

థార్ OGలో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ లేదు. అన్ని వేరియంట్లలో మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ వ్యవస్థనే అందించారు. అయితే వెనుక ప్రయాణికుల కోసం ఎయిర్ కండిషనింగ్ వెంట్లు అన్ని వేరియంట్లలోనూ ప్రామాణికంగా ఉన్నాయి. వెనుక కిటికీలు తెరవడానికి వీలు లేకపోవడంతో ఈ సదుపాయం ఉపయోగకరంగా ఉంటుంది.

2. పవర్‌డ్ లేదా వెంటిలేటెడ్ సీట్లు

థార్ OGలో ముందు సీట్లను పూర్తిగా మాన్యువల్‌గా సర్దుకోవాలి. టాప్ వేరియంట్‌లో కూడా ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్ లేదా సీట్ వెంటిలేషన్ లేదు. డ్రైవర్ సీటును ఎత్తు & ముందుకు, వెనక్కు సర్దుకోవచ్చు. సహ ప్రయాణికుడి సీటును ముందుకు, వెనక్కు మాత్రమే సర్దుకోవచ్చు. వెనుక సీట్లలోకి వెళ్లేందుకు సీటును ముందుకు జరిపే విధానం కూడా మాన్యువల్‌గానే ఉంటుంది.

3. 360 డిగ్రీ కెమెరా

పార్కింగ్ విషయంలోనూ థార్ OG వెనుకబడింది. ఇందులో వెనుక పార్కింగ్ కెమెరా మాత్రమే ఉంది. అది కూడా టాప్ జెడ్‌ఎక్స్‌టీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. ఏఎక్స్‌టీ & ఎల్‌ఎక్స్‌టీ వేరియంట్లలో వెనుక పార్కింగ్ సెన్సర్లు మాత్రమే ఉన్నాయి. 360 డిగ్రీ కెమెరా సదుపాయం లేదు.

4. ADAS

ఆధునిక ఎస్‌యూవీల్లో అధునాతన డ్రైవర్ సహాయ వ్యవస్థలు ఇప్పుడు సాధారణంగా మారుతున్నాయి. అయితే థార్ OGలో ADAS సదుపాయం లేదు. పెద్ద థార్ రాక్స్‌లో ఈ ఫీచర్లు ఉన్నాయి. కానీ చిన్న థార్ OGకి మాత్రం మహీంద్రా వీటిని తీసుకురాలేదు.

5. డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

థార్ OGలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఉంది. కానీ డ్రైవర్ ముందు పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మాత్రం లేదు. స్పీడోమీటర్ & టాకోమీటర్ కోసం అనలాగ్ డయల్స్ ఉన్నాయి. మధ్యలో రంగుల MID ఉంటుంది. ఏఎక్స్‌టీ వేరియంట్‌లో మాత్రం రంగుల MIDకు బదులుగా మోనోక్రోమ్ MID ఇచ్చారు.

ఇది కూడా చదవండి: యూత్‌ కోసం BMW నుంచి మరో కొత్త మోటార్‌సైకిల్‌ F 450 R.. ధర ఎంతంటే?

6. బ్రాండెడ్ ఆడియో సిస్టమ్

థార్ OGలో ఆరు స్పీకర్ల ఆడియో వ్యవస్థ ఉంది. అయితే దీనికి ప్రత్యేకమైన బ్రాండెడ్ ఆడియో సిస్టమ్ లేదు. ఆరు స్పీకర్లను పైకప్పు భాగంలో అమర్చారు. మహీంద్రా ఇతర ఎస్‌యూవీల్లో హర్మన్ కార్డన్ లేదా సోనీ వంటి బ్రాండెడ్ ఆడియో వ్యవస్థలను అందిస్తోంది. కానీ థార్ OGలో అలాంటి సదుపాయం లేదు.

7. వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే

థార్ OGలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ LXT వేరియంట్ నుంచి అందుబాటులో ఉంటుంది. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో సదుపాయం ఉంది. అయితే ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ కార్‌ప్లేను వైర్‌లెస్‌గా ఉపయోగించే అవకాశం లేదు. యాపిల్ కార్‌ప్లే కోసం కేబుల్ కనెక్షన్ అవసరం.

8. ఆటో డిమ్మింగ్ IRVM

థార్ OGలో ఇంటీరియర్ రియర్ వ్యూ మిర్రర్ కూడా సాధారణంగానే ఉంది. అన్ని వేరియంట్లలో మాన్యువల్ డే, నైట్ అడ్జస్ట్‌మెంట్ ఉన్న IRVMను అందించారు. వెనుక నుంచి వచ్చే వాహనాల లైట్ల కాంతిని ఆటోమేటిక్‌గా తగ్గించే ఆటో డిమ్మింగ్ మిర్రర్ లేదు.

9. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్

థార్ OGలో అన్ని వేరియంట్లకు సంప్రదాయ మెకానికల్ హ్యాండ్‌బ్రేక్‌నే ఇచ్చారు. టాప్ జెడ్‌ఎక్స్‌టీ వేరియంట్‌లో కూడా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ లేదు. ముఖ్యంగా ఆటోమేటిక్ వేరియంట్లలో ఈ సదుపాయం ఉంటే థార్ OG మరింత ఆధునికంగా అనిపించేది.

ఇది కూడా చదవండి: క్రెటా కంటే తక్కువ ధరలో హ్యుందాయ్ కొత్త SUV.. రూ.11,000 టోకెన్ ధరతో బుకింగ్స్ షురూ

మొత్తంగా చూస్తే.. మహీంద్రా థార్ OGలో గత మోడల్‌తో పోలిస్తే ఎన్నో మార్పులు చేసింది. కొత్త ఫీచర్లు & సాంకేతిక అప్‌గ్రేడ్‌లు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఆధునిక ఎస్‌యూవీల్లో కనిపించే కొన్ని సదుపాయాలు ఇందులో ఇంకా లేవు. అయితే థార్‌ను కొనుగోలు చేసే చాలామందికి ప్రధాన ఆకర్షణ ఆఫ్‌రోడ్ సామర్థ్యమే. అందుకే మహీంద్రా ఈ మోడల్‌లో అవసరమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ.. కొన్ని సౌకర్యాలను పరిమితం చేసినట్లు కనిపిస్తోంది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
త్వరలో మార్కెట్లోకి రానున్న New Renault Duster .. లాంచ్ తేదీ, ఫీచర్లు సహా అంచనా ధర వివరాలు
హైదరాబాద్‌ లేదా విజయవాడ... Kawasaki Versys X 300ని ఇప్పుడే ఇంటికి తీసుకెళ్లొచ్చు, ఈజీ EMI ప్లాన్‌ ఉందిగా!
Kawasaki Versys X 300: రూ.4 లక్షల బండిని కేవలం రూ.7,685 EMI తో సొంతం చేసుకునే ప్లాన్‌
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
రూ.2-5 లక్షల బడ్జెట్‌లో బ్రహ్మాండమైన అడ్వెంచర్ టూరర్‌ బైక్స్.. ఇవిగో 11 ఆప్షన్లు
Advertisement

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravathi Lands: అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
అమరావతి గ్రామకంఠం భూములపై సీఆర్డీఏ క్లారిటీ.. మినహాయింపులకు కటాఫ్ తేదీ ఇదే
Ex Minister Ambati Rambabu: మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
మంత్రి లోకేశ్ చెబితేనే అక్రమ కేసులు.. నిరసన చేస్తే హత్యాయత్నం, అట్రాసిటీ కేసులా? - అంబటి రాంబాబు
UPI Subsidy: MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
MDR అమలు చేసినా UPIకి సబ్సిడీ.. కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రణాళిక
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Khairatabad Byelection: ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
ఖైరతాబాద్ ఉపఎన్నికల్లో పోటీకి రెడీ.. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కవిత ప్రకటన
KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్‌ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
KTM 390 Adventure: ఈ బండిని ఫైనాన్స్‌లో కొంటే రూ.6500 EMI కడితే చాలు, పూర్తి వివరాలు ఇవిగో
IBPS Exam Malpractice: కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
కాదేదీ కాపీకి అనర్హం.. ఐబీపీఎస్ ఎగ్జామ్‌‌లో హైటెక్ మాల్ ప్రాక్టీస్.. విజయవాడలో అభ్యర్థి పట్టివేత
Amaravati News: అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
అమరావతి నివాస భూముల వివాదం.. సీఎం చంద్రబాబు జోక్యం కోరూతూ పరిరక్షణ సమితి లేఖ
Embed widget