TVS NTorq 150: దేశంలోనే అత్యంత వేగవంతమైన స్కూటర్ లాంచ్, యూత్‌ఫుల్ థ్రిల్ పక్కా - ధర, ఫీచర్లు ఇవిగో
TVS Ntorq 150 launch: టీవీఎస్ మోటార్, TVS Ntorq 150 స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఇది, కొత్త ఫ్లాగ్‌షిప్ పెట్రోల్ స్కూటర్. తెలుగు రాష్ట్రాల్లో మూడు పాపులర్ స్కూటర్లతో ఇది సేల్స్ రేస్ చేస్తుంది.

TVS NTorq 150 Price, Mileage And Features In Telugu: టీవీఎస్ మోటార్ కంపెనీ, తన పాపులర్ స్కూటర్ TVS NTorq 125 విజయవంతం కావడంతో, భారతీయ మార్కెట్‌లోకి కొత్త ఫ్లాగ్‌షిప్ స్కూటర్ టీవీఎస్ ఎన్‌టార్క్ 150 ని విడుదల చేసింది. ఈ స్కూటర్ భారతదేశంలో అత్యంత వేగవంతమైన ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) స్కూటర్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో, ఈ కొత్త బండి ప్రారంభ ధర దాదాపు రూ. 1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా కంపెనీ డిసైడ్ చేసింది. టీవీఎస్ కొత్త స్కూటర్... Hero Xoom 160, Yamaha Aerox 155 & Aprilia SR 160 వంటి స్పోర్టీ స్కూటర్‌లకు ప్రత్యక్ష పోటీగా రంగంలోకి వచ్చింది.
ఇంజిన్ & పెర్ఫార్మెన్స్
TVS Ntorq 150 స్కూటర్‌లో 149.7cc ఎయిర్-కూల్డ్ O3CTech ఇంజిన్ బిగించారు. ఈ ఇంజిన్ 7000 rpm వద్ద 13 bhp శక్తిని & 5500 rpm వద్ద 14.2 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ స్కూటర్‌లో రెండు రైడింగ్ మోడ్‌లు (స్ట్రీట్ & రేస్) ఉన్నాయి. TVS Ntorq 150 పనితీరులో ఇది టాప్ గన్ లాంటిది, కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 60 కి.మీ./గం వేగాన్ని అందుకుంటుంది. అంతేకాదు, గరిష్టంగా 104 కి.మీ./గం వేగంతో హైవే మీద దూసుకెళ్లగలదు. ఈ పెర్ఫార్మెన్స్ కారణంగా, TVS Ntorq 150 స్కూటర్ భారతదేశంలోనే అత్యంత వేగవంతమైన ICE స్కూటర్‌గా అవతరిస్తుందని కంపెనీ ప్రకటించింది.
స్మార్ట్ టెక్నాలజీ & కనెక్టివిటీ
కొత్త TVS Ntorq 150 స్కూటర్‌లో మొదట చెప్పుకోవాల్సిన విషయం దాని హై-రిజల్యూషన్ TFT డిస్‌ప్లే, ఇది TVS SmartXonnect టెక్నాలజీతో వస్తుంది. ఇది 50 కంటే ఎక్కువ కనెక్టెడ్ ఫీచర్లను కలిగి ఉంటుంది, మిమ్మల్ని స్మార్ట్ రైడర్‌గా మారుస్తుంది. కనెక్టెడ్ ఫీచర్లలో... టర్న్-బై-టర్న్ నావిగేషన్, లైవ్ వెహికల్ ట్రాకింగ్, లాస్ట్ పార్కింగ్ లొకేషన్, కాల్ & మెసేజ్ అలెర్ట్స్, OTA అప్‌డేట్స్, అలెక్సా & స్మార్ట్‌వాచ్ ఇంటిగ్రేషన్ ఉన్నాయి. ఈ లక్షణాలన్నింటినీ 4-వే స్విచ్ గేర్‌తో సులభంగా నియంత్రించవచ్చు, ఇవన్నీ మీ రైడింగ్ అనుభవంలో హై టెక్నాలజీని యాడ్ చేస్తాయి.
భద్రత & అధునాతన ఫీచర్లు
పెర్ఫార్మెన్స్ & ఫీచర్లతో పాటు రైడర్ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని TVS Ntorq 150 ని డిజైన్ చేశారు. ఈ టూవీలర్‌లో అనేక అధునాతన సేఫ్టీ ఫీచర్లు యాడ్ చేశారు. వాటిలో.. ABS & ట్రాక్షన్ కంట్రోల్, హజార్డ్ లాంప్, క్రాష్ & థెఫ్ట్ అలెర్ట్స్, అత్యవసర బ్రేక్ హెచ్చరిక వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగా, ఈ స్కూటర్ స్టైలిష్ & స్పీడీ మాత్రమే కాకుండా, భద్రత పరంగా ప్రీమియం అనుభూతిని కూడా ఇస్తుంది. ఈ స్కూటర్ ప్రత్యేకంగా స్పోర్టీ డిజైన్, హై పెర్ఫార్మెన్స్ & కనెక్టెడ్ స్మార్ట్ ఫీచర్ల కోసం చూస్తున్న కస్టమర్లకు TVS Ntorq 150 మంచి ఛాయిస్ కాగలదు.





















