అన్వేషించండి

GST Bike Price Cut: బుల్లెట్ నుంచి స్ల్పెండర్‌ వరకు, KTM నుంచి పల్సర్‌ వరకు - పన్ను కోతలతో ప్రతిదీ చౌక!

GST Reform: 350cc వరకు ఉన్న బైకు‌లపై ప్రభుత్వం GST తగ్గించింది. 350cc కంటే ఎక్కువ ఉన్న బైకు‌లపై GST పెంచింది. ఇప్పుడు, డుగ్‌ డుగ్‌ బుల్లెట్ తొక్కాలనే కల నెరవేరవచ్చు.

GST Bike Price Reduction: దసరా, దీపావళి వంటి పెద్ద పండుగల ముందు, కేంద్ర ప్రభుత్వం ద్విచక్ర వాహన మార్కెట్ కోసం తీపి కబురు చెప్పింది, GST రేట్లను సవరించింది. కొత్త GST రేట్ల ప్రకారం, 350cc వరకు ఉన్న బైకులపై పన్ను ఇప్పుడు 18% కి తగ్గింది. దీని అర్థం చిన్న & మధ్య తరహా బైకులు చౌకగా మారతాయి, కామన్‌ మ్యాన్‌ అందుకునే స్థాయికి దిగొస్తాయి. అదే సమయంలో, 350cc కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైకులను లగ్జరీ కేటగిరీలో ఉంచారు & వాటిపై పన్నును 40% కి పెంచారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఎంట్రీ-లెవల్ బైకుల అమ్మకాలను పెంచవచ్చు. అయితే, ప్రీమియం & హై-పెర్ఫార్మెన్స్‌ బైకుల ప్రియులు ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్‌ చిన్న బైకు‌లు చౌకగా మారతాయి
ఈ మార్పు, రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై మిశ్రమ ప్రభావాన్ని చూపుతుంది. హంటర్ 350, క్లాసిక్ 350, మెటియోర్ 350 & బుల్లెట్ 350 వంటి కంపెనీ ప్రసిద్ధ బైకులు ఇప్పుడు చౌకగా మారతాయి, ఎందుకంటే వాటిపై కేవలం 18% GST మాత్రమే వర్తిస్తుంది. మరోవైపు.. హిమాలయన్ 450, గెరిల్లా 450, స్క్రామ్ 440 & 650cc సిరీస్ (ఇంటర్సెప్టర్, కాంటినెంటల్ GT, సూపర్ మెటియోర్ & షాట్‌గన్) ఇప్పుడు 40% పన్ను పరిధిలోకి చేరతాయి. దీనివల్ల వాటి ధరలు పెరుగుతాయి & అడ్వెంచర్-టూరర్ విభాగంలో డిమాండ్ కొంచెం తగ్గవచ్చు.

బజాజ్ & ట్రయంఫ్ బైకు‌లపై ప్రభావం
బజాజ్ డొమినార్ 400 & పల్సర్ NS400Z ఇప్పుడు 40% పన్ను స్లాబ్ కిందకు వచ్చాయి. బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్య మోడళ్లైన స్పీడ్ 400, స్క్రాంబ్లర్ 400X &థ్రక్ట్సన్‌ 400 కూడా ఖరీదైనవిగా మారతాయి. ఇప్పటివరకు వీటిని మిడ్-కెపాసిటీ విభాగంలో అందుబాటు ఎంపికలుగా పరిగణించేవారు. పన్ను పెరుగుదల వాటి ఇమేజ్‌ను ప్రభావితం చేయవచ్చు.

స్ల్పెండర్‌ ప్లస్ ధర ఎంత తగ్గుతుంది?
కొత్త GST రేటు అమలులోకి వచ్చిన తర్వాత హీరో స్ప్లెండర్ ప్లస్ ఎంత చౌకగా మారుతుందో ఒక ఉదాహరణ చూద్దాం. ప్రస్తుతం, దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,426. దానిపై GSTని దాదాపు 10% తగ్గిస్తే, ధరను దాదాపు రూ. 7,900 తగ్గించవచ్చు. ఈ మేరకు కస్టమర్‌ ప్రత్యక్ష ప్రయోజనం పొందుతారు. అయితే, బైకు కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్-షోరూమ్ ధరతో పాటు ఇతర ఛార్జీలు కూడా యాడ్‌ అవుతాయి, గమనించాలి.

మొత్తం KTM సిరీస్‌ రేటు పెరుగుతుంది
స్పోర్ట్స్ & అడ్వెంచర్ బైకు‌లకు ప్రసిద్ధి చెందిన KTMను కొత్త GST రేట్లు ప్రభావితం చేస్తాయి. డ్యూక్ సిరీస్, RC సిరీస్ & అడ్వెంచర్ సిరీస్‌లోని చాలా బైకు‌లు 350cc కంటే ఎక్కువ కెపాసిటీ ఉన్నవి, వీటిపై ఇప్పుడు 40% పన్ను యాడ్‌ అవుతుంది. అంటే పండుగ సీజన్‌లో KTM బైకు‌ల ధరలు పెరుగుతాయి & వాటి అమ్మకాలు ఒత్తిడికి లోనవుతాయి.

మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ లేదా క్లాసిక్ వంటి 350cc కంటే తక్కువ ఇంజిన్ ఉన్న బైకు‌ను కొనాలనుకుంటే, ఇది మీకు మంచి అవకాశం. ఈ బైకు‌లు మునుపటి కంటే చౌకగా ఉంటాయి. మీ కల హిమాలయన్ 450, బజాజ్ డొమినార్ 400 లేదా KTM అడ్వెంచర్ వంటి మిడ్‌ రేంజ్‌ & హై రేంజ్‌ బైకు‌ అయితే, ఇప్పుడు మీరు ఎక్కువ బడ్జెట్‌ పెట్టుకోవాలి. ప్రభుత్వ నిర్ణయం సాధారణ వినియోగదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది, ప్రీమియం బైకు‌లను ఇష్టపడే వారి జేబులపై భారం పెంచుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Fast Cars In India: హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
హైవేలపై జర్నీకి ఎక్కువగా వాడుతున్న కార్లు ఇవే.. ధర చూసి కొనేయండి
BMW F 450 GS అడ్వెంచర్ బైక్స్‌ లైనప్‌లోకి స్పోర్ట్ వేరియంట్.. టాప్ మోడల్ ఫీచర్లు, కొత్త ధరలివే!
స్పోర్టీ లుక్‌తో BMW F 450 GS కొత్త వేరియంట్.. స్పోర్ట్ మోడల్ ధర రూ.5.90 లక్షలు!
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
కొత్త Skoda Slavia కోసం కంపెనీ చెప్పిన మైలేజ్‌ 19.5kpl.. రియల్‌ వరల్డ్‌లో నిజంగా అంత మైలేజ్‌ ఇచ్చిందా?
2026 Skoda Slavia 8AT రియల్‌ మైలేజ్ టెస్ట్.. సిటీలో ఎంత? హైవేపై ఎంత?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Diwali Bonus: ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
ఉద్యోగులకు వెండి పళ్లెంలో దీపావళి బోనస్.. సూరత్‌ వ్యాపారిపై నెటిజన్ల ప్రశంసలు
AP Local Body Elections: పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
పరిషత్‌ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామాలు.. జైలు నుంచి జడ్పీటీసీ, ఒక్క ఓటుతో విజయాలు, సత్తా చాటిన సామాన్యులు!
Family Drama OTT : అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
అమ్మకు ఆదివారం హాలిడే - ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా
Petrol Pump Free Services: పెట్రోల్ కొన్నా, కొనకపోయినా.. పెట్రోల్ బంకుల్లో ఈ సేవలన్నీ ఉచితం, మీ హక్కు కూడా!
పెట్రోల్ బంక్‌కు వెళ్తున్నారా? ఈ 'ఉచిత' సౌకర్యాలు మీ హక్కు.. డబ్బులు అడిగితే ఇలా చేయండి!
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
AI Morphing Student Died: ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
ఏఐ ఫొటో మార్ఫింగ్ కలకలం.. లెక్చరర్, ప్రిన్సిపల్ వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య!
Embed widget