Speed T4 బైక్‌తో ఫ్రీ గిఫ్ట్స్ - Triumph ఇస్తున్న ఉచిత యాక్సెసరీస్ ఆఫర్ ఇదే
Triumph Speed T4 బైక్ కొనుగోలు చేస్తే కొన్ని వేల రూపాయల విలువైన యాక్సెసరీస్ ఉచితంగా అందుతాయి. ఈ బైక్ ధర, స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్, ప్రత్యర్థి బైక్‌ల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Triumph Speed T4 Free Accessories Price Offer: ఈ కొత్త సంవత్సరంలో... మిడ్-కెపాసిటీ సెగ్మెంట్‌లో స్టైలిష్, పవర్‌ఫుల్, ప్రీమియం ఫీల్ ఉన్న బైక్ కొనే ప్లాన్ చేస్తున్నారా?. అయితే, Triumph Speed T4 ప్రస్తుతం మంచి డీల్. కారణం - ఈ బైక్ కొనుగోలు చేసిన వారికి ₹11,500 విలువైన ఫ్రీ యాక్సెసరీస్ అందిస్తోంది ట్రయంఫ్ ఇండియా (Triumph India).
ఇది కేవలం పరిమిత కాలపు ఆఫర్ మాత్రమే. ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై ట్రయంఫ్ స్పష్టత ఇవ్వలేదు. అందుకే ఆసక్తి ఉన్నవాళ్లు ఆలస్యం చేయకుండా తమకు దగ్గరలోని అధికారిక ట్రయంఫ్ డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.
Triumph Speed T4 తో వచ్చే ఫ్రీ యాక్సెసరీస్ లిస్ట్
- ట్యాంక్ ప్యాడ్
- నీ ప్యాడ్స్
- బ్యాక్ రెస్ట్
- లోయర్ ఇంజిన్ గార్డ్స్
- విండ్‌స్క్రీన్
ఈ యాక్సెసరీస్ బైక్ లుక్‌ను మరింత స్టైలిష్‌గా మార్చడమే కాకుండా... రైడ్ సమయంలో మీ కంఫర్ట్, సేఫ్టీని కూడా పెంచుతాయి.
తెలుగు రాష్ట్రాల్లో Triumph Speed T4 ధర ఎంత?
ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ నగరాల్లో Triumph Speed T4 ఎక్స్-షోరూమ్ ధర ₹1,92,539. ఆన్-రోడ్ ధర దాదాపు ₹2,37 లక్షలు. అయితే, త్వరలోనే ఈ బైక్ ధర పెరిగే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు సూచిస్తున్నాయి. అందువల్ల, ఇప్పుడే కొనుగోలు చేయడం ఆర్థికంగా లాభదాయకంగా మారుతుంది.
Triumph Speed T4 ఇంజిన్ & స్పెసిఫికేషన్స్
Speed T4 ను గత ఏడాది భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. Speed 400 తో పోలిస్తే టార్క్‌ను మరింత ట్యూన్ చేసిన బైక్ ఇది. Speed T4 లో 398cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది.
ఈ ఇంజిన్ 7,000 rpm వద్ద 30.6 bhp శక్తిని, 5,000 rpm వద్ద 36 Nm టార్క్‌ను ఇస్తుంది. హెవీ క్రాంక్, ప్రత్యేక ఫ్యూయలింగ్ సెటప్ కారణంగా తక్కువ rpm నుంచే మంచి టార్క్ వస్తుంది. అందువల్ల ఈ బైక్ రైడింగ్ మరింత షార్ప్‌గా అనిపిస్తుంది.
ఈ బైక్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఇచ్చారు. ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది. బ్రేకింగ్ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేక్స్‌తో పాటు డ్యూయల్ ఛానల్ ABS కూడా ఫిట్ చేశారు.
Speed T4 కలర్ ఆప్షన్స్
Triumph Speed T4ను మొత్తం ఐదు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంచారు.
- కాస్పియన్ బ్లూ విత్ మెటాలిక్ వైట్ (Caspian Blue with Metallic White)
- బాజా ఆరెంజ్ (Baja Orange)
- లావా రెడ్ గ్లోస్ విత్ పెర్ల్ మెటాలిక్ వైట్ (Lava Red Gloss with Pearl Metallic White)
- ఫాంటమ్ బ్లాక్ విత్ స్టార్మ్ గ్రే (Phantom Black with Storm Grey)
- ఫాంటమ్ బ్లాక్ విత్ మెటాలిక్ వైట్ (Phantom Black with Metallic White)
ప్రత్యర్థి బైక్‌లు ఇవే
భారత మార్కెట్‌లో Triumph Speed T4 కు ప్రధానంగా Yezdi Roadster, Royal Enfield Meteor 350, Honda CB350RS, Jawa 42 FJ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
చివరగా చెప్పాలంటే... ప్రీమియం లుక్, పవర్‌ఫుల్ టార్క్, ట్రయంఫ్ బ్రాండ్ వాల్యూతో పాటు ₹11,500 ఫ్రీ యాక్సెసరీస్ లభిస్తున్న ఈ ఆఫర్ Speed T4 ను మరింత ఆకర్షణీయంగా మార్చింది. కొత్త బైక్ కొనాలనుకుంటున్నవారికి ఈ కొత్త సంవత్సరం నిజంగా సరైన సమయమే.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.



















