Speed 400 కంటే Scrambler 400 X పవర్‌ఫుల్ బైకేనా? ఫుల్ డిటైల్స్ ఇవిగో
Triumph Scrambler 400 X కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇంజిన్, పవర్, సస్పెన్షన్, ఫీచర్లు, బ్రేకులు, ధర సహా ఈ బైక్‌పై తెలుసుకోవాల్సిన 8 ముఖ్యమైన విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

Triumph Scrambler 400 X Price: ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 X అనేది బజాజ్-ట్రయంఫ్ భాగస్వామ్యంలో వచ్చిన రెండో మోటార్‌సైకిల్. Speed 400 కంటే పై స్థాయిలో వచ్చిన ఈ బైక్‌ను కొంచెం రఫ్ రోడ్లు, లైట్ ఆఫ్‌రోడ్ ప్రయాణాలు చేయగలిగేలా డిజైన్ చేశారు. ఈ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేసే ముందే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన 8 విషయాలు ఇవి.
1. ఇంజిన్ & పవర్ ఫిగర్స్
Scrambler 400 Xలో 398.15cc లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 8,000rpm వద్ద 40hp పవర్ & 6,500rpm వద్ద 37.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. Speed 400తో పోలిస్తే ఇందులో 14-టూత్ ఫ్రంట్ స్ప్రాకెట్ వాడారు. దీనివల్ల తక్కువ స్పీడ్‌లలో ఎక్కువ టార్క్ లభిస్తుంది, ఇది ఆఫ్‌రోడ్ పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది.
2. ఫ్యూయల్ ట్యాంక్, బరువు, సీట్ ఎత్తు
ఈ బైక్‌లో 13 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. కర్బ్ వెయిట్ 185 కిలోలు కాగా, సీట్ ఎత్తు 835 మిల్లీమీటర్లు. సీట్ ఎత్తు కొంచెం ఎక్కువగా ఉండటంతో, తక్కువ ఎత్తు ఉన్న రైడర్లు ఈ బండిని కొనే ముందే టెస్ట్ రైడ్ చేయడం మంచిది.
3. ఫీచర్లు ఏం ఉన్నాయి?
Scrambler 400 Xలో అనలాగ్ స్పీడోమీటర్, ఇంటిగ్రేటెడ్ LCD డిస్‌ప్లే ఉంటాయి. ఇందులో స్పీడ్, గేర్ పొజిషన్, ఫ్యూయల్ లెవెల్ వంటి ప్రాథమిక సమాచారం కనిపిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లు లేవు. అయితే... USB ఛార్జింగ్ పోర్ట్, స్విచ్ చేయగల ట్రాక్షన్ కంట్రోల్, రియర్ వీల్‌కు ఆఫ్ చేయగల ABS వంటి ఫీచర్లు ఉన్నాయి.
4. సస్పెన్షన్ ట్రావెల్
Scrambler 400 Xలో ముందు, వెనుక రెండింటికీ 150 మిల్లీమీటర్ల సస్పెన్షన్ ట్రావెల్ ఇచ్చారు. Speed 400లో ముందు 140mm, వెనుక 130mm మాత్రమే ఉంటుంది. అందుకే Scrambler రఫ్ రోడ్లపై మరింత కంఫర్ట్‌గా అనిపిస్తుంది.
5. టైర్లు
ఈ బైక్‌లో MRF టైర్లు ఉన్నాయి.
ముందు: 110/90-19
వెనుక: 140/80-17
పెద్దగా ఉన్న ముందు చక్రం వల్ల ఆఫ్‌రోడ్ స్టెబిలిటీ మెరుగ్గా ఉంటుంది.
6. కలర్ ఆప్షన్స్
ప్రస్తుతం Scrambler 400 X ను నాలుగు కలర్ స్కీమ్స్‌లో అందిస్తున్నారు.
Matt Khaki Green / Fusion White
Volcanic Red / Phantom Black
Pearl Metallic White / Phantom Black
Phantom Black / Silver Ice
7. బ్రేకింగ్ సెటప్
ముందు 320mm డిస్క్ బ్రేక్, వెనుక 230mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. Speed 400లో సిన్టర్డ్ బ్రేక్ ప్యాడ్స్ ఉండగా, Scrambler 400 Xలో ఆర్గానిక్ బ్రేక్ ప్యాడ్స్ వాడారు. కావాలంటే యూజర్లు సిన్టర్డ్ ప్యాడ్స్‌కు మారవచ్చు.
8. ధర ఎంత?
Triumph Scrambler 400 X ఒక్క వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది.
ధర: రూ.2.68 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)
ఇదే బైక్‌కు మరింత ప్రీమియం వెర్షన్‌గా Scrambler 400 XC ఉంది. ఇందులో ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్, అదనపు భాగాలు, కొత్త కలర్ స్కీమ్స్ ఉంటాయి.
Scrambler 400 XC ధర: రూ.2.95 లక్షలు (ఎక్స్-షోరూమ్ ధర)
మొత్తంగా చూస్తే, సిటీలో చక్కర్లు కొట్టడంతో పాటు అప్పుడప్పుడు ఆఫ్‌రోడ్ రైడ్స్ చేయాలనుకునే వారికి Triumph Scrambler 400 X ఒక పవర్‌ఫుల్ & స్టైలిష్ ఆప్షన్. Speed 400 కంటే ఎక్కువ రగ్డ్ క్యారెక్టర్ కోరుకునే రైడర్లకు ఇది ఖచ్చితంగా సరైన ఎంపికగా నిలుస్తుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















