ఎడ్లబండిపై వచ్చి రూ.కోటిన్నర Toyota Vellfire తీసుకున్న రైతు - షోరూంలో అందరూ షాక్!
Toyota Vellfire Delivery: బెంగళూరులోని ఒక రైతు, లగ్జరీ కారు డెలివరీ తీసుకునే ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Toyota Vellfire Delivery With Bullock Cart: కర్ణాటకకు చెందిన రైతు సంజు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఆ రైతు, లగ్జరీ కారు Toyota Vellfire ను డెలివరీ తీసుకోవడానికి ఎద్దుల బండిపై టయోటా షోరూమ్‌కు వచ్చాడు. అతను, బెంగళూరులోనీ భీకరమైన ట్రాఫిక్‌లోనే ఎద్దుల బండితో ప్రయాణి షోరూమ్ వద్దకు వచ్చాడు. దీంతో, అతని స్టైల్ & అతని ఎద్దుల బండి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియో వైరల్ అయింది. అతని ఎంట్రీ చాలా ప్రత్యేకంగా సాగింది, మార్గమధ్యంలో జనం ఎద్దుల బండిపై వెళ్తున్న సంజును ఫోటోలు & వీడియోలు తీశారు.
రైతు సంజు ప్రత్యేక శైలి
రైతు సంజు తన రూరల్ స్టైల్‌తో సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉన్నాడు. వ్యవసాయం చేస్తున్నప్పటికీ, అతనికి లగ్జరీ కార్లంటే ఇష్టం. అతని దగ్గర ఇప్పటికే లగ్జరీ కార్ కలెక్షన్ ఉంది, వాటిలో - Porsche Panamera, Ford Mustang, Maserati Levante, Toyota Fortuner & Innova Hycross ఉన్నాయి. ఈసారి, అతను కొత్త టయోటా వెల్‌ఫైర్ డెలివరీని ఒక ప్రత్యేక జ్ఞాపకంగా మార్చుకున్నాడు.
యూట్యూబ్‌లో వీడియో
రైతు ఎడ్లబండిపై టయోటా షోరూమ్‌కు వచ్చిన మొత్తం దృశ్యం యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయింది. “ఒక రైతు లగ్జరీ కారును కొనుగోలు చేస్తున్నాడు” అనే క్యాప్షన్‌తో ఈ వీడియో వీక్షకుల మన్ననలు అందుకుంది. ఈ వీడియో ప్రారంభంలో, సంజు ఇల్లు & కార్యాలయం వెలుపల అతని లగ్జరీ కార్లను వరుసగా చూపించారు. అతను ఎప్పటిలాగే ప్రీమియం కారులో షోరూమ్‌కు వస్తాడని ప్రజలు భావించారు, కానీ ఈసారి అతను అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెల్లటి కుర్తా-ధోతీ, భారీ బంగారు గొలుసులు & ఉంగరాలు ధరించి, సంజు సాంప్రదాయ ఎడ్ల బండిని ఎక్కి షోరూమ్ వైపు వెళ్ళాడు. కోట్ల విలువైన కార్ల యజమాని ఎడ్ల బండిపై ప్రయాణించడం చూసి జనం ఆశ్చర్యపోయారు.
టయోటా డీలర్‌షిప్‌లో ఘన స్వాగతం
సంజు టయోటా డీలర్‌షిప్ వద్దకు వచ్చినప్పుడు, సిబ్బంది అతనికి గొప్పగా స్వాగతం పలికారు. అతను పూజ చేసి తన కొత్త టయోటా వెల్‌ఫైర్‌ను డెలివరీ తీసుకున్నాడు. ఈ లగ్జరీ MPV ధర సుమారు ₹1.5 కోట్లు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఉద్యోగులు కారును పూలదండలతో అలంకరించి రైతు సంజును అభినందించారు. డెలివరీ తర్వాత, సంజు తన కొత్త కారులో ఇంటికి వెళ్లాడు.
టయోటా వెల్‌ఫైర్ ఎలా ఉంది?
టయోటా వెల్‌ఫైర్ భారతదేశంలో అల్ట్రా-లగ్జరీ MPVగా ప్రసిద్ధి చెందింది. ఇందులో రెండు కెప్టెన్ సీట్లు, రూఫ్-మౌంటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ & ఎలక్ట్రిక్ రిక్లైనింగ్ సీట్లు ఉన్నాయి, ఇది ప్రైవేట్ జెట్ లాగా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంటీరియర్‌లో పూర్తిగా డిజిటల్ క్లస్టర్, వెంటిలేటెడ్ & హీటెడ్ సీట్లు & ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల స్టీరింగ్ వీల్ వంటి ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి. భద్రత కోసం ADAS, 360-డిగ్రీ కెమెరా & ఆటో బ్రేక్ హోల్డ్ ఉన్నాయి. ఈ MPV 2.5-లీటర్, 4-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్‌తో శక్తినిస్తుంది, ఇది 193 PS పవర్ & 240 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హైబ్రిడ్ వ్యవస్థ బలమైన పనితీరును & అద్భుతమైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది.





















